E-Paper
Advertisement

ఇలాంటి స్పూర్తే మీ నుంచి కోరుకునేది అధ్యక్షా! జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన పీసీసీ చీఫ్‌ మెరుపు ధర్నా!

ఇలాంటి స్పూర్తే మీ నుంచి కోరుకునేది అధ్యక్షా! జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన పీసీసీ చీఫ్‌ మెరుపు ధర్నా!
Advertisement

ఇక్కడ హైదరాబాద్‌ గల్లీలో చేసిన మెరుపు ధర్నా అక్కడ ఢిల్లీని కదిలించింది. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తొలిసారిగా తన విశ్వరూపం చూశారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మెరుపు ధర్నా పేరుతో రైల్‌ నిలయంలో ఆయన చేపట్టిన  ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య జరిగిన తీవ్ర తోపులాటలో మహేశ్‌కు గాయాలు కూడా అయ్యాయి.

బీజేపీ వైఖరిపై టీపీసీసీ ఉగ్రరూపం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. భేష్‌.. మహేశ్‌..! అని కాంగ్రెస్‌ అగ్ర నేతలు ప్రశంసించగా.. ఇలాంటి స్పూర్తినే మేం కోరుకుంటున్నాం అధ్యక్షా ! అని తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణులు మహేశ్‌ భుజం తట్టారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ… నబంబర్‌ 1న ఢిల్లీలో ఇండీ కూటమి భారీ నిరసన తెలియజేసేందుకు రెడీ అయ్యింది.

Advertisement

ఈ ఆందోళనలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు రెడీ అయ్యారు. వీరితో పాటు ఇక్కడి యువతను కూడా పెద్ద ఎత్తున తరలించాలని టీపీసీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. దీని కోసం ప్రత్యేక రైళ్లను కేటాయించాలని రైల్వే శాఖను కోరింది. దీన్ని చివరి దాకా పెండింగ్‌లో పెట్టిన రైల్వే శాఖ బుధవారం రైళ్లను కేటాయించేందుకు అనుమతిని తిరస్కరించింది.

దీంతో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్ నేతృత్వంలో సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయమైన రైల్‌ నిలయాన్ని ముట్టడించారు. మోడీ డౌన్‌ డౌన్‌ అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోనికి దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫర్నిచర్‌ ధ్వంసమయ్యింది. అక్కడే బైఠాయించి నినాదాలు చేస్తున్న మహేశ్‌ను పోలీసులు బలవంతంగా గుంజేయడంతో ఆయనను గట్టిగా పట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌ శ్రేణలంతా మహేశ్‌పై పడిపోయారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి.

Advertisement

అయినా అక్కడ నుంచి కదలకుండా మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైళ్ల అనుమతులు అడ్డుకోగలరేమో గానీ, తమను అడ్డుకోలేరని, లక్షలాదిగా ఢిల్లీ చేరుకుని కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎండగడతామని మహేశ్‌ అన్నారు. టీపీసీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుందని, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

పలువురు నేతలకు బస్సుల ద్వారా యువతను, క్యాడర్‌ను తరలించే బాధ్యతలను అప్పగించారు. అయితే ఢిల్లీలో జరగనున్న ‘ఓటును కాపాడండి.. దేశాన్ని రక్షించండి’ అనే నినాదంతో ఓట్ చోరీపై చేపడుతున్న ఆందోళనను కాంగ్రెస్‌ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. రాంలీలా మైదానంలో పెద్ద ఎత్తున నిరసన సభ జరపునున్నారు. దీంతో కేంద్రం దీన్ని నిలువరించేందుకు.. కాంగ్రెస్ కోరిన ప్రత్యేక రైళ్లకు అనుమతివ్వలేదు.

మహేశ్ చేపట్టిన మెరుపు ధర్నాతో ఈ నిరసన రూపానికి మరింత వేడి పెరిగింది. జాతీయ స్థాయిలో తెలంగాణ క్యాడర్‌ ఉద్యమంపై చర్చ జరిగింది. దీనికి నేతృత్వం వహించిన మహేశ్‌కు ఢిల్లీ పెద్దలు కితాబునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు కూడా మహేశ్‌ ఉద్యమస్పూర్తిని మెచ్చుకున్నారు. అక్కడ ఢిల్లీలో నవంబర్ 1న జరిగే  ఆందోళన ఎలా ఉంటుందో  ఇక్కడి బీజేపీ నేతలకు ఈ మెరుపు ధర్నా చిన్న శాంపిల్ ను చూపెట్టాడు మహేశ్.

Tags

Related News

కాళేశ్వరం ఉంటే.. మళ్లీ తుమ్మిడిహట్టి ఎందుకు? వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

రజినీకాంత్ వదిలేసిన కల.. అల్లుడు ధనుష్ నిజం చేయబోతున్నారా?

ఫ్రీ బస్సుపై దుష్ప్రచారం..అది మహిళలపై కోపమా? సర్కార్‌ను బద్నాం చేసే వ్యూహమా? బండి కనకయ్య మాటలతో తొండి వాదన!

డిమాండ్ల సాధన కోసం లాంగ్‌ మార్చ్‌ చేపట్టిన మహా రైతులు! కరువు పరిహారం, సమగ్ర రుణమాఫీ, అటవీ భూములపై హక్కులకై పోరు!

మల్లారెడ్డి కాలేజీల్లో చదువు బంద్.. సినిమాలు షురూ! అసలు ఏం జరుగుతోంది?

సన్నరకాల ధాన్యానికి వారు చెప్పిందే మద్దతు ధర..! బ్లాక్‌ మార్కెట్‌లో ధర పెంచారు.. రైతుల వడ్ల ధరను దించారు..! రోడ్డెక్కిన వరి రైతు!

బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాపై సంధించిన అస్త్రం ‘హేట్‌ స్పీచ్‌ బిల్లు’..!? నాన్‌బెయిలబుల్ నేరం.. పదేండ్ల జైలు..! అందుకే కేటీఆర్‌ దీన్ని వ్యతిరేకిస్తున్నారా?

Big Stories

Advertisement
×