BigTV English

Deepseek Trump: డీప్‌సీక్ ప్రభంజనం.. స్టార్‌గేట్ ప్రాజెక్టుకు భారీ పెట్టుబడులు అవసరమా.. ట్రంప్ స్పందన

Deepseek Trump: డీప్‌సీక్ ప్రభంజనం.. స్టార్‌గేట్ ప్రాజెక్టుకు భారీ పెట్టుబడులు అవసరమా.. ట్రంప్ స్పందన

Deepseek Trump| ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధా చాట్‌బాట్‌లలో చైనాకు చెందిన ఏఐ స్టార్టప్‌ ‘డీప్‌సీక్‌’ (DeepSeek) ప్రభంజనంగా మారింది. ముఖ్యంగా అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ చాట్‌జీపిటీకి డీప్‌సీక్ ఏఐ గట్టిపోటీనిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సిలికాన్‌ వ్యాలీకి గట్టిగా హెచ్చరించారు. ‘‘డీప్‌సీక్‌ విజయం మీకు ఓ వేకప్‌ కాల్‌’’ అంటూ సలహా ఇచ్చారు.


కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌, దిగ్గజ టెక్‌ కంపెనీల ఫౌండర్‌లు, సీఈవోలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చాట్‌జిపిటీ సిఈఓ శామ్ ఆల్ట్‌మెన్ కూడా ఉన్నారు. సమావేశంలో ఒరాకిల్, ఎన్‌విడియా, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలు సంయుక్తంగా 590 బిలియన్ డాలర్ల భారీ ఏఐ ప్రాజెక్టు స్టార్‌గేట్ ప్రారంభం గురించి ప్రకటన కూడా చేశారు. ఈ భారీ ప్రాజెక్టుకు ట్రంప్ ప్రభుత్వం సహకారం కూడా లభించింది. ఇదే సమయంలో చైనా డీప్‌సీక్‌ తన ఆధునిక చాట్‌బాట్‌ ఆర్‌1 మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ట్రంప్‌ ప్రమాణ స్వీకారం తరువాత హంగామా కారణంగా ఆర్‌1 మోడల్‌పై ఆ రోజుల్లో పెద్దగా దృష్టిపడలేదు.

అయితే వారం తిరిగేలోపే డీప్‌సీక్‌ చాట్‌బాట్‌ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అమెరికా యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేయబడిన యాప్‌గా డీప్‌సీక్‌ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతేకాదు.. తన ప్రత్యర్థి చాట్‌జీపీటీని డౌన్‌లోడ్‌ల విషయంలో వెనక్కి నెట్టేసింది.


టెక్‌ ప్రపంచంపై ప్రభావం
డీప్‌సీక్‌ అరంగ్రేట్రంలోనే విజయం సాధించడంతో ఇతర టెక్‌ కంపెనీలకు గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యంగా చిప్‌ తయారీ రంగంలో అగ్రగామి సంస్థ ఎన్‌విడియా భారీ నష్టాన్ని చవిచూసింది. సోమవారం ఎన్‌విడియా షేర్లు 17 శాతం పతనమయ్యాయి. ఇది వాల్‌ స్ట్రీట్‌ మార్కెట్‌లో ఒకే రోజులో జరిగిన అతిపెద్ద నష్టాల్లో ఒకటిగా నమోదైంది. ఈ నష్టంతో కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు 589 బిలియన్‌ డాలర్ల మేరకు తగ్గిపోయింది.

Also Read: వెనక్కి తగ్గని ట్రంప్.. గూగుల్‌లో గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేర్లు మార్పు..

ట్రంప్‌ ఘూటు వ్యాఖ్యలు
ఈ పరిణామాలపై ట్రంప్‌ స్పందిస్తూ, ‘‘డీప్‌సీక్‌ తక్కువ ఖర్చుతో తయారైన ఒక ప్రభావవంతమైన మోడల్‌. సిలికాన్‌ వ్యాలీకి ఇది ఒక వేకప్ కాల్ (జాగ్రత్త పడాలి) లాంటిది. డీప్ సీక్ విజయాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. మీకు (అమెరికన్ కంపెనీలకు) కూడా తక్కువ ఖర్చుతో, అధిక సామర్థ్యం కలిగిన చాట్‌బాట్‌లను తయారు చేయగలగడం సాధ్యమే.’’ అని సూచించారు.

చైనా డీప్‌సీక్‌ తో అమెరికా పెత్తనానికి సవాల్
డీప్‌సీక్‌ విజయవంతమైన చాట్‌బాట్‌గా గుర్తింపుతో చైనాకు కృత్రిమ మేధా రంగంలో మరింత ప్రాబల్యం ఏర్పడింది. ఇది అమెరికా టెక్‌ కంపెనీలకు గట్టి పోటీగా మారడమే కాక, తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేయగలమని చాటిచెప్పింది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ప్రమాణం చేసిన ట్రంప్.. ఆర్థిక విధానాల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకోవాలని అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఒకవైపు అమెరికన్ కంపెనీలు 500 పైగా బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారీ ఏఐ ప్రాజెక్టు కు ప్రారంభించడం.. మరోవైపు చైనా డీప్ సీక్ లాంటి అద్భుతమైన ఏఐ టెక్నాలజీనీ చాలా తక్కువ ఖర్చుతో తయారు చేయడంతో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

అయితే ఏఐ టెక్నాలజీ రంగంలో వందల బిలియన్ల డాలర్ల (భారత కరెన్సీలో పదుల వేల కోట్లు) ఖర్చుతో అమెరికా అగ్రస్థానాన్ని కొనసాగించగలదా? లేక చైనా ఈ పోటీలో తక్కువ ఖర్చుతోనే అమెరికా పెత్తనానికి సవాలు విసురుతుందా? అనేది ముందుముందు చూడాలి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×