E-Paper
Advertisement

CM Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ట్రూఅప్ ఛార్జీల నుంచి బిగ్ రిలీఫ్

CM Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ట్రూఅప్ ఛార్జీల నుంచి బిగ్ రిలీఫ్

CM Chandrababu: నూతన సంవత్సరం వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం.. కీలక నిర్ణయాలు తీసుకుంది. భూ యాజమాన్య పత్రాల్లో వ్యక్తుల ఫోటోలను తొలగించి.. ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు.. నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్‌కు కూడా చెక్ పెట్టారు. అదేవిధంగా.. 5 కేటగిరిలకు చెందిన భూములను 22ఏ జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో.. ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ సక్సెస్ అయింది. ప్రధాని నరేంద్రమోడీకి.. సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

జనవరి 4 భోగాపురంలో ఫస్ట్ ల్యాండింగ్

ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో.. ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమానం ల్యాండింగ్ విజయవంతం అయింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో.. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, టీడీపీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు భోగాపురానికి చేరుకున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌లో 300 విమానాలు దిగే సదుపాయం ఉంది. తొలి దశ నిర్మాణ పనులకు 4 వేల 592 కోట్లు ఖర్చయింది. తొలి కమర్షియల్ విమానం ల్యాండింగ్ సక్సెస్ అయిన శుభ సందర్భంగా.. సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ఆ ప్రాంత కనెక్టివిటీని పెంచనుంది. తద్వారా అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు సీఎం చంద్రబాబు.

జనవరి 3 నకిలీ రిజిస్ట్రేషన్లకు చెక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్‌లకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇలాంటి రిజిస్ట్రేషన్లను రద్దు చేసేందుకు కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జాయింట్ కలెక్టర్, ఆర్డీవో కూడా సభ్యులుగా ఉంటారు. రిజిస్ట్రేషన్ల చట్టంలోనూ ఈ మార్పులు చేశారు. రిజిస్ట్రేషన్ చేసే అధికారి కావాలనే తప్పు చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఐజీ అనుమతితో క్రిమినల్ కేసు పెడతారు. నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు జరిగితే.. ఫిర్యాదు అందిన 15 రోజుల్లోనే రిజిస్ట్రార్‌ విచారణ ప్రారంభిస్తారు. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు నిర్ధారణ అయితే, రిజిస్ట్రార్‌ విచారణ ప్రారంభించి, దస్తావేజులో పేర్కొన్న పార్టీలకు నోటీసులు పంపుతారు. దస్తావేజు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్ అయిందని తేలితే, దానిని రాతపూర్వకంగా నమోదు చేసి, రద్దు ప్రక్రియను కొనసాగిస్తారు. ఆ తర్వాత ఈ సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ చేసి, జిల్లా స్థాయి కమిటీకి నివేదిక పంపడం ద్వారా రద్దు ప్రక్రియను కొనసాగిస్తారు. నిషేధిత భూములను ఎవరైనా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు చేస్తే, రిజిస్ట్రార్‌ సుమోటోగా ఆ దస్తావేజుల రద్దుకు చర్యలు తీసుకోవచ్చు. విచారణలో ఆధారాలు ఉన్నాయని తేలితే, రిజిస్ట్రార్‌ దస్తావేజు రద్దు చర్యలు ప్రారంభిస్తారు. ఆధారాలు లేవని తేలితే, ఫిర్యాదును తిరస్కరించి, అందుకు గల కారణాలను రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకతను పెంచనున్నాయి.

జనవరి 3 లాజిస్టిక్ హబ్‌గా ఏపీ

ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏడు ఎయిర్‌పోర్టులు సేవలు అందిస్తున్నాయి. వీటికి అదనంగా.. మరో ఏడు ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేసి.. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో నాలుగు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా.. కేంద్రం నుంచి ఆమోదం లభించింది. దాంతో.. నాలుగు చోట్ల ఎయిర్‍పోర్టుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే.. దామవరం దగ్గర 418 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. ఎకరాకు 13 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత కింద 916 కోట్లతో.. పీపీపీ పద్ధతిలో దగదర్తి ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టారు. త్వరలోనే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయనున్నారు. దగదర్తి విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. నెల్లూరు జిల్లా ఆర్థికంగా, పారిశ్రామికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. జిల్లాకు మరిన్ని పెట్టుబడులు వస్తాయని.. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఒక్క నెల్లూరు జిల్లాకు మాత్రమే కాకుండా.. కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశాలున్నాయి.

జనవరి 2 రాజముద్రతో పాస్ బుక్

వ్యక్తుల బొమ్మ లేకుండా రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు పాల్గొనాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీపై ఈ వారం వర్చువల్‌గా సమీక్షా సమావేశం నిర్వహించారు. రీ సర్వే పూర్తైన గ్రామాల పరిధిలో.. 22 లక్షల కొత్త పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ జరిగింది. జనవరి 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ యాజమాన్య పత్రాల్లో.. మాజీ సీఎం జగన్‌ ఫొటోను తొలగించి.. గతంలో మాదిరిగానే ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే.. మ్యుటేషన్‌ పూర్తయిన వారికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను ఇప్పటికే అనేక జిల్లాల్లో రైతులకు, భూయజమానులకు అందించారు.

జనవరి 1 22ఏ నుంచి రిలీఫ్

నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల కేటగిరిలకు చెందిన భూములను 22ఏ జాబితా నుంచి తొలగించింది. మిగిలిన 4 రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రైవేట్‌ భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగించింది ప్రభుత్వం. ప్రైవేట్‌ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా.. అధికారులు దానిని సుమోటోగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధించిన పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలన్నారు. అదేవిధంగా స్వాతంత్ర్య సమరయోధుల భూములను కూడా 22ఏ నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతులు, భూ యాజమానుల హక్కులను రక్షించడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు. రెండు నెలల్లో ఫ్రీ హోల్డ్ భూములపై జీవోఎం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి నుంచి ఫ్రీ హోల్డ్ అమలు చేసేలా జీవోఎం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భూముల విషయంలో తప్పు జరిగిందని తేలితే.. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. భూముల అక్రమాల నివారణకు ప్రత్యేకంగా యాప్‌ను తీసుకురానుంది కూటమి ప్రభుత్వం. యజమాని భూమికి సంబంధించిన సర్వే నెంబర్‌తో ఆధార్ లింక్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా భూ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ 22ఏ సమస్య.. ఎక్కువగా శ్రీకాకుళం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కనిపిస్తోంది. ఈ జిల్లాల్లోని రైతులు, భూ యజమానులు 22ఎ సమస్యతో చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో.. 22ఏ జాబితాలోని 5 కేటగిరీల భూముల క్రయ, విక్రయాలకు లైన్ క్లియర్ అయింది.

ఈ వారం ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల నుంచి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ప్రజలపై భారం పడకుండా డిస్కంలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే భరించనుంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో.. శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంబించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి ప్రభుత్వ శాఖల పనితీరుపై రివ్యూ చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తుల మేరకే.. జిల్లాల్లో మార్పులు, చేర్పులు చేశామని క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

డిసెంబర్ 31 ప్రజలకు ట్రూఅప్ రిలీఫ్

కొత్త సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల నుంచి ప్రజలకు రిలీఫ్ ఇచ్చింది. ఈ మేరకు డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూఅప్ మొత్తాన్ని.. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీఈఆర్‌సీకి లేఖ రాసింది. ఈ నిర్ణయంతో.. రాష్ట్ర ప్రజలకు 4 వేల 498 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారం తప్పింది. గత ఐదేళ్లలో.. వివిధ పేర్లతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం ఉంది. ప్రజలు ఇప్పటికీ ప్రతి నెలా బిల్లులో వాటిని చెల్లిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ట్రూఅప్ భారాన్ని భరించింది. మరోవైపు.. ఏపీలో యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని 2029 నాటికి 4 రూపాయల లోపునకు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం 5 రూపాయలకు పైనే ఉంటే.. 2025-26 నాటికి అది 4 రూపాయల 90 పైసలకు తగ్గింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి.. యూనిట్ కొనుగోలు వ్యయాన్ని 4 రూపాయల 60 పైసలకు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

డిసెంబర్ 30 వారిని వదలొద్దు!

అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై.. దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు.

డిసెంబర్ 29 ఆలయాలపై రివ్యూ

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంబించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ వారం కూడా ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై రివ్యూ చేశారు. రెవెన్యూ, వ్యవసాయం, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం, రవాణా, అగ్నిమాపక, దేవాదాయ సహా వివిధ శాఖల పనితీరుపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో ఆయా శాఖల పనితీరు ఏ విధంగా ఉందనే అంశంపై సమీక్షించారు.

డిసెంబర్ 29 కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ వారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో.. 24 కీలక అంశాలకు ఆమోదం లభించింది. విశాఖలో ఆస్పత్రి నిర్మాణానికి భూమి కేటాయింపు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పెనుగొండను వాసవీ పెనుగొండగా మార్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. బనగానపల్లె, అడ్డరోడ్డును డివిజన్లుగా ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉంటుంది. జిల్లా కేంద్రం మాత్రం మదనపల్లెకు మార్చారు. అద్దంకి నియోజకవర్గాన్ని.. బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు మార్చారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి సబ్‌డివిజన్‌లోనే.. దర్శి నియోజకవర్గం ఉండనుంది. రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలోకి, కడపలోకి సిద్ధవటం, ఒంటిమిట్టని మార్చారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, విజ్ఞప్తుల మేరకే.. జిల్లాల్లో మార్పులు, చేర్పులు చేశామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని.. 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేశామని తెలిపారు. జనం కోరిక మేరకే డివిజన్లు, మండలాలు మార్చామన్నారు. రాయచోటిని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం హామీ ఇచ్చారు. విజయవాడ, తిరుపతిని.. గ్రేటర్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ సర్కార్ రాజముద్రతో.. 21 లక్షల 80 వేల పాస్‌బుక్‌లు పంపిణీ చేస్తున్నారు. పట్టాదార్ పాస్‌బుక్‌లపై గత పాలకుల ఫొటోలు తొలగించింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా పోలవరం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో మౌలిక వసతుల కోసం దాదాపు 3 లక్షల కోట్లను ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.

Story By Anup, Big Tv

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×