Cm Chandrababu: ప్రకాశం జిల్లాలోని మార్కాపురం గడ్డపై చాలా సంవత్సరాల తర్వాత టీడీపీ మెన్నటి ఎన్నికలలో జెండా ఎగరేసింది. 2009లో గెలిచిన కందుల నారాయణ రెడ్డి 15 ఏళ్ల లాంగ్‌గ్యాప్ తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఎన్నికల ముందు నారాయణరెడ్డి ఎమోషనల్ స్పీచ్‌తో తను ఓడిపోతే తన శవం చూస్తారని సెంటిమెంట్ డైలాగులు పండించి గట్టు ఎక్కిన పరిస్థితి . అలాంటాయన గెలిచాక వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ క్యాడర్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. స్వయంగా చంద్రబాబే ఆయన వైఖరిని తప్పుపడుతూ బహరింగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎఫెక్టో ఏమో కందుల తాజాగా ఓవర్ యాక్షన్ మొదలుపెట్టారు. ఇంతకీ ఆయన చేస్తున్న అతి ఏంటో మీరే చూడండి.
ప్రజాదర్బార్‌లో సెలైన్ పెట్టించుకున్న కందుల నారాయణరెడ్డి
ఇదిగో ఇక్కడ కనపడుతున్న ఆయన కందుల నారాయణరెడ్డి.. ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే.. ఈయన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది, మార్కాపురం నియోజకవర్గంలోని సమస్యలపై ఈ నెల 22నప్రజా దర్బార్ నిర్వహించారు. అక్కడి వరకు ఒకే బాగుంది. ఆరోగ్యం బాగా లేదని ప్రజా దర్బార్‌కు వచ్చి ప్రజల ముందు సెలైన్ ఎక్కించుకొవటం కొద్దిగా ఓవర్ అన్పిస్తుంది కదా..
ఆశించిన రీతిలో లేదని సీఎం ఆగ్రహం
అవును ఈ ఓవర్ యక్షన్‌పై ప్రజలు చర్చించుకుంటున్నారు. మహిళ దినోత్సవం పురస్కరించుకుని సీఎం చంద్రబాబు ఇటీవల మార్కాపురం వచ్చారు. టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కార్యకర్తల మీటింగ్ లో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పనితీరు ఆశించిన రీతిలో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చురకలు అంటించారు. సర్వే చేస్తే మార్కాపురం ఎమ్మెల్యేకు 37 శాతం మార్కులు మాత్రమే వచ్చాయని, పనితీరును మరింత మెరుగుపర్చుకోవలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటానని, తీరు మార్చుకోకపోతే పోతే చర్యలు ఉంటాయని తీవ్రంగానే హెచ్చరించారు.
కందులకు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కందులపై అలా కార్యకర్తల ముందు మండిపడటంతో ఆయన పరువు పొయినట్లైంది.. సొంత క్యాడర్ ముందు డ్యామేజ్ అయ్యానని ఆయన తెగ ఫీల్ అవుతున్నారంట. ఆ క్రమంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ప్రజలలో సానుభూతి పొందటానికి స్టైల్ మార్చారని, ఓవర్ యాక్షన్ చేస్తున్నారని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రజా దర్భర్ లో సెలైన్ ఎక్కించుకుంటూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటునట్లు కలరింగ్ ఇవ్వబోయి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి నవ్వులపాలైయ్యారని పార్టీ కార్యకర్తలు గుసగుసలు ఆడుకుంటున్నారు.
15 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి ఎన్నికైన కందుల నారాయణ
వాస్తవానికి నారాయణ రెడ్డి 15 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. 2009లో గెలిచిన తర్వాత మళ్లీ గత ఎన్నికల్లోనే ఆయన్ని విజయం వరించింది. ఎన్నికల ముందు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఎమోషనల్ స్పీచ్ తో తాను ఓడిపోతే తన శవం చూస్తారని సెంటిమెంట్ మాటలు పండించి గట్టు ఎక్కిన పరిస్థితి . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నారాయణరెడ్డి పేరుకు మాత్రమే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ మిగతా వ్యవహారాలను తమ్ముడు రామిరెడ్డితో పాటు కుటుంబసభ్యులకు పవర్ షేర్ చెశారట. పోలీస్ స్టేషన్లలో పంచాయితీలు ఒక్కరు చూస్తే మిగతా వ్యవహారాలని కుటుంబంలోని మరొకరు చూస్తున్నారట.
ఎమ్మెల్యే కుటుంబసభ్యుల్లో ఒకరి అత్యుత్సాహం
పనులు నిమిత్తం వచ్చిన వారు ఎమ్మెల్యే కుటంబ సభ్యుల దగ్గర చర్చించిన తర్వాతే ఆయన ఓకే అంటునాడట . ఇటీవల మార్కాపురం టౌన్ లో షాపులు తొలగింపు, ఇళ్ల ముందు దిమ్మెలు తొలగింపు జరిగినప్పుడు కొంతమందిని టార్గెట్ చేసుకున్న నారాయణరెడ్డి ఫ్యామిలీమధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడే విధంగా చేసిందంట. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్లో ఒకరి అత్యుత్సాహంతో ఆక్రమణాల తొలగింపు సమయంలో పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని మార్కాపురంలోని కొంతమంది టీడీపీ నేతాలే అధిష్టానానికి ఫిర్యాదులు చెశారట. అప్పటి నుంచి మార్కాపురంలో కూల్చివేతలకు జోలికి వెళ్లటం లేదట.
కందుల బ్రదర్స్ పేరుతో మద్యంపై అదనపు బాదుడు
చీమకుర్తి గ్రానేట్ లారీలు పొరుగు రాష్టాలకు వెళ్లాలంటే మార్కాపురం నియోజకవర్గంలో నుంచే వెళ్లాలి. సదరు వ్యాపారులను బెదిరించి ఎమ్మెల్యే కుటుంబం వసూళ్లు చేస్తోందంట. దానికి సంబంధించిన ఫోన్‌లో వ్యాపారస్థులను ఎమ్మెల్యే మనుషులమని బెదిరిస్తున్న ఆడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ గా మారాయి. రాష్ట్రం మెత్తం మద్యం ఎమ్మార్పీ ధరలకు అమ్ముతుంటే ఒక మార్కాపురంలో టైమ్‌ని బట్టి అదనపు బాదుడు బాదుతున్నారు. ఇదంటనే అడుగుతే ఎమ్మెల్యే కందుల బ్రదర్స్ పేరు మద్యం షాపుల యజమానులు చెబుతున్నారంట. ఇలా ప్రతి విషయంలోను ఎమ్మెల్యే వైఖరి విమర్శలపాలవుతోంది . టీడీపీ నిర్వహిస్తున్న అంతర్గత సర్వేలో ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించి అన్నీ మైనస్‌లే వచ్చాయంట.
డ్యామేజ్ కంట్రోల్ కోసం నారాయణ సెలైన్ బాటిల్ డ్రామా
మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురంలో పర్యటించిన చంద్రబాబు.. కార్యకర్తల ముందే ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.. పార్టీని బలోపేతం చేయడంతో పాటు సభ్వత్వ నమోదులో చాలా వెనక్క బడ్డారని మండిపడ్డారు. అటు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదని సీరియస్ అయ్యారు. ఆ ఎఫెక్ట్‌తో డ్యామేజ్ కంట్రోల్ కోసం కందుల నాగార్జునరెడ్డి సెలైన్ బాటిల్ డ్రామాకు తెర లేపారంట. మొత్తానికి ఆ ఓవర్ యాక్షన్ ఆయన్ని మరింత నవ్వులపాలు చేస్తుందిప్పుడు.