BigTV English
Advertisement

OTT Movie : ప్రేమలో పడి ప్రెగ్నెంట్ చేసే సైతాన్ … ఫ్యూజులు అవుట్ అయ్యే మూవీ సామి

OTT Movie : ప్రేమలో పడి ప్రెగ్నెంట్ చేసే సైతాన్ … ఫ్యూజులు అవుట్ అయ్యే మూవీ సామి

OTT Movie : ఓటీటీలో ఇప్పుడు వెబ్ సిరీస్ లను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. వీటిలో మిస్టరీ థ్రిల్లర్ లను వదలకుండా చూస్తునారు. బెంగాల్ నుంచి మంచి కంటెంట్ తో వెబ్ సిరీస్ లు వస్తున్నాయి.  ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ భార్య భర్తల చుట్టూ తిరుగుతుంది. చివరివరకూ సస్పెన్స్ ని అందిస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..


బింగే (Binge) లో

2024 లో వచ్చిన ఈ బెంగాల్ వెబ్ సిరీస్ పేరు ‘అరారత్’ (Ararat). ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు విక్కీ జాహెడ్ దర్శకత్వం వహించారు. ఇందులో మెహజాబీన్ చౌదరి, షమోల్ మౌలా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ బెంగే (Binge) అనే ఓటీటీలో ప్లాట్‌ ఫామ్‌లో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ రిఫాత్, రూపా అనే దంపతుల చుట్టూ తిరుగుతుంది. ట్విస్ట్ లతో మీకు పిచ్చెక్కించే వెబ్ సిరీస్ ఇది. ఒక సైతాన్ చేతిలో చిక్కుకునే మహిళ చివారికి ఏమౌతుంది అనీదే ఈ స్టోరీ.


స్టోరీలోకి వెళితే

రిఫాత్ ,రూపా ల పెళ్లి జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది. ఈ జంట చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అయితే ఉన్నట్టుండి. రూపా ప్రవర్తనలో ఒక్కసారిగా తీవ్రమైన మార్పు వస్తుంది. ఆమె ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా రిఫాత్‌ను విడిచిపెట్టాలని, అందుకు విడాకులు కూడా ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. దీంతో రిఫాత్ కూడా ఆమె ప్రవర్తనకి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఆమె నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. రూపా మౌనంగా ఉండటంతో, రిఫాత్‌కు ఆమెకు వేరొకరితో సంబంధం ఉందనే అనుమానం కలుగుతుంది. ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి, అతను డిటెక్టివ్ అరిఫిన్ సహాయం తీసుకుంటాడు. ఈ కథలో అనేక విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. భర్తకు విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతుంది రూపా. ఇంతలో ఆమె వేరొకరితో సంబంధం పెట్టుకున్నదని తెలుసుకుంటాడు రిఫాత్.

ఈ విషయం మీద ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. రిఫాత్ కూడా తన అసిస్టెంట్ తో మలేషియా ట్రిప్ పోయినప్పుడు, ఆమెతో ఏకాంతంగా గడుపుతాడు. నువ్వు అలా చేసినప్పుడు, నేను ఇలా చేస్తే తప్పు ఎలా అవుతుందని నిలదీస్తుంది. ఆ విషయం అతనికి తప్ప మారెవరికి తెలియదు. ఇది విని షాక్ అవుతాడు రిఫాత్. ఆమెకి ఈ విషయం ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతాడు.  అసలు విషయం ఒక సైతాన్ ఆవహించిన మనిషి రూపాను లవ్ చేస్తాడు. ఆమెను ప్రెగ్నెంట్ కూడా చేస్తాడు. చివరికి రూప పరిస్తితి ఏమౌతుంది.  ఆమె ప్రవర్తన వెనుక ఉన్న అసలు  నిజం ఏమిటి? ఈ ప్రశ్నల చుట్టూ కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. రిఫాత్, రూపా జీవితాల్లోని సంబంధాలను చూపిస్తూ , ఈ సిరీస్ స్టోరీని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. మీరుకూడా ఈ వెబ్ సిరీస్ ను చూడాలి అనుకుంటే బెంగే ఓటీటీ లో సిద్దంగా ఉంది.

Tags

Related News

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×