BigTV English

CM Revanth Reddy: ప్రగతి పద్దు ఏ శాఖకు ఎంతంటే..

CM Revanth Reddy: ప్రగతి పద్దు ఏ శాఖకు ఎంతంటే..

CM Revanth Reddy: ఈ వారం రేవంత్ సర్కార్ కీలక పథకాలకు శ్రీకారం చుట్టింది. కొలువుల పండగ కంటిన్యూ చేసింది. అటు భవన నిర్మాణాలకు ఈజీగా అనుమతులు ఇచ్చే బిల్డ్ నౌ సాఫ్ట్ వేర్ ను ప్రారంభించారు సీఎం. చెన్నైలో జరిగిన సౌత్ స్టేట్ మీటింగ్ లో డీలిమిటేషన్ సమస్యలపై గళం వినిపించారు సీఎం రేవంత్. అటు సీఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.


(22-03-2025 శనివారం) ( చెన్నై డిక్లరేషన్ )

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా గళం వినిపిస్తూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చెన్నై వేదికగా జరిగిన సౌత్ స్టేట్స్ మీటింగ్ లో మరోసారి తన వెర్షన్ పై క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగిన మీటింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. డీలిమిటేషన్ తో దక్షిణాదికి ఎలా నష్టమన్న విషయాలపై సభ్యులకు వివరించారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయొద్దని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణను సౌత్ స్టేట్స్ పకడ్బందీగా చేశాయని, అందుకు శిక్ష వద్దంటున్నారు. అసెంబ్లీ సీట్ల పెంపునకే పరిమితం కావాలన్నారు సీఎం రేవంత్. మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ వాయిదా వేయాలని చెన్నై మీటింగ్ లో చెప్పారు.


(21-03-2025 శుక్రవారం ) ( తక్కువ వడ్డీ రుణాల కోసం )

తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే సంస్థలు ఉన్నా గత ప్రభుత్వం ఎక్కువ వడ్డీతో రుణాలు తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా ఈనెల 21న సీఎంతో NABARD చైర్మన్ షాజీ కేవీ భేటీ అయిన సందర్భంగా కూడా ఇదే ఇష్యూను ప్రస్తావించారు. తెలంగాణకు గ్రామీణ మౌలిక వసతుల నిధి కింద తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలన్నారు. తెలంగాణలో సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని, ఇందిరా క్రాంతిపథం, గోదాములు, రైస్‌మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్‌ సామర్థ్యం పెంచేందుకు సహకరించాలని కోరారు సీఎం. స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ల నిర్వహణలో నాబార్డు భాగస్వామిగా చేరాలన్నారు.

(21-03-2025 శుక్రవారం) ( తాగునీటి కొరత రాకుండా )

ఈ వేసవిలో తాగునీటి కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా మంత్రి సీతక్క మిషన్ భగీరథ సిబ్బందిని అలర్ట్ చేశారు. రిజర్వాయర్లలో తాగునీటికి తగినంత నీటి నిల్వలు ఉన్నాయని, గతంలో తాగునీరు అందని గ్రామాలకు కూడా ఈసారి తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. డ్రింకింగ్ వాటర్ అవసరాల కోసం ప్రతి కలెక్టర్ దగ్గర రెండు కోట్ల రూపాయల నిధులను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. తాగు నీటి సమస్యలు లేకున్నా కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

(20-03-2025 గురువారం) ( తెలంగాణ.. జరూర్ ఆనా.. )

72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుండడంతో ఈ మెగా ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌ టూరిజం ప్లాజాలో ఈనెల 20న 72వ ఎడిషన్‌ మిస్‌ వరల్డ్‌ పోటీల పోస్టర్‌ను, తెలంగాణ పర్యాటక శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి జూపల్లి, మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మిస్ వరల్డ్ క్రిస్టినా పోచంపల్లి ఇక్కత్‌ చీరకట్టుతో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. మిస్ వరల్డ్ పోటీలపై తెలంగాణ.. జరూర్‌ ఆనా.. నినాదంతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మే 7 నుంచి 31 వరకు జరగనుంది. పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి అందగత్తెలు తరలి రానున్నారు. పోటీల ప్రారంభ కార్యక్రమం మే 10న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో, ముగింపు వేడుకలు మే 31న హైటెక్స్‌లో జరుగుతాయి. ఈ మధ్యలో రాష్ట్రంలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు మిస్ వరల్డ్ పోటీదారులను తీసుకెళ్తారు. మొత్తం 21 ప్రదేశాల్లో 23 థీమ్‌లతో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఈవెంట్లు నిర్వహించబోతున్నారు.

(20-03-2025 గురువారం) ( ప్రజాపాలనలో కొలువుల పండగ )

కొలువుల జాతరను కంటిన్యూ చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఈనెల 20న వివిధ శాఖల్లో కారుణ్య నియామకాల కింద ఎంపికైన వారికి నియామకపత్రాలను సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో అందించారు. పంచాయతీ రాజ్ శాఖలో కారుణ్య నియామ‌కాల‌ కింద 582 జూనియర్ అసిస్టెంట్లు, మిషన్ భగీరథ శాఖలో 55 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 27 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో 38 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 55 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు మొత్తం 922 మంది ఉద్యోగులకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. కారుణ్య నియామకాలు అనేవి క్రమం తప్పకుండా ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యత అని సీఎం రేవంత్ అన్నారు.

(20-03-2025 గురువారం) ( క్లియర్ గా.. వేగంగా.. )

ప్రజాపాలనలో మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ ప్రభుత్వం. ఈనెల 20న బిల్డ్ నౌ సాఫ్ట్​ వేర్ ను సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. భవనాలు, లే అవుట్ల అనుమతుల కోసం కొత్తగా ఆన్ లైన్ లో బిల్డ్ నౌ వెబ్ పోర్టల్ తీసుకొచ్చారు. కొత్త విధానంలో డ్రాయింగ్ పరిశీలన, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ మరింత వేగం కానుంది. బిల్డింగ్, లే అవుట్ ప్లాన్ ​ను ఆగ్మెంటెడ్ రియాల్టీతో త్రీడీ విధానంతో చూసే అవకాశం ఉంటుంది. భవనాలు, లేఅవుట్ల ఆమోదం కోసం స్క్రుటినీలో జాప్యం తగ్గించేందుకు దేశంలోనే అత్యంత వేగంగా ఈ బిల్డ్ నౌ సాఫ్ట్ వేర్ పని చేస్తుందంటున్నారు. భవన నిర్మాణ ప్లాన్ ఆమోదించే సమయం 21 రోజుల నుంచి 15 రోజులకు.. అలాగే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ టైం 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గబోతోంది. అధికారులు సైట్ నుంచి నేరుగా ఫోటోలు, సెట్‌బ్యాక్‌, రోడ్డు వెడల్పు వంటి రియల్-టైమ్ డేటాను అప్‌లోడ్ చేసే అవకాశం ఉండబోతోంది.

(20-03-2025 గురువారం) ( పోలీస్ స్కూల్ అడ్మిషన్లు షురూ )

పోలీసుల పిల్లల కోసం సీఎం రేవంత్ చేసిన ఆలోచన ఆచరణలోకి వచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌ లో మార్చి 21న‌ మంచిరేవుల స్కూల్‌ ప్రాంగణంలో మొదటి బ్యాచ్‌ విద్యార్థుల ఎంపికకు లక్కీ డ్రా నిర్వహించారు. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్‌ లెటర్లు అందజేశారు. ఈ స్కూల్‌లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యాబోధన అందించనున్నారు. మొత్తం 200 సీట్లలో 100 సీట్లు పోలీసు సిబ్బంది పిల్లలకు, మిగతా 100 సీట్లు సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించారు. యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌ ను ఏప్రిల్ మొదటి వారంలో సీఎం ప్రారంభించనున్నారు.

(19-03-2025 బుధవారం) ( ప్రగతి పద్దు )

కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారి పూర్తి 12 నెలల ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టింది. బడ్జెట్‌ మొత్తం ఆదాయం 3.04 లక్షల కోట్లలో అత్యధికంగా 34 శాతం అంటే 1,04,329 కోట్లను సంక్షేమ పథకాలకే కేటాయించింది. వీటిలోనూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల టైంలో ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు సంబంధించిన తొమ్మిది పథకాలకు ఏకంగా 56,084 కోట్లు దక్కాయి. ప్రస్తుత ఏడాదికి ఇవే గ్యారంటీ హామీలకు 47,167 కోట్లు కేటాయించగా వచ్చే ఏడాదికి మరో 8,917 కోట్లు పెంచింది. మౌలిక సదుపాయాల కల్పనకు మూలధన వ్యయం కింద 36,504 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.

19-03-2025 బుధవారం ( బడ్జెట్ లో శుభవార్త )

కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ బడ్జెట్లో ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పౌర సరఫరాల శాఖకు ఈ బడ్జెట్లో 5 వేల 734 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డుల జారీ, అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియను జనవరి 26 నుంచి ప్రారంభించామని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లయ్ ​చేయాల్సిన అవసరం లేదు.

VO: 19-03-2025 బుధవారం ( మెక్ డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ )

అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డొనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2 వేల మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది. ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డిని మెక్‌ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ తో పాటు సంస్థ ప్రతినిధులు కలిశారు. తమ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం చేసుకుంది. మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటంపై సీఎం రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

చాలా రాష్ట్రాలు పోటీ పడ్డా.. తెలంగాణను మెక్ డొనాల్డ్ ఎంపిక చేసుకోవడం గర్వంగా ఉందన్నారు సీఎం. సంస్థకు అవసరమైన స్కిల్డ్ ఎంప్లాయిస్ ను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. మెక్‌డొనాల్డ్స్‌కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్‌డొనాల్డ్స్ అవుట్‌ లెట్లున్నాయి. ప్రతి ఏడాది మరో 3 లేదా 4 కొత్త అవుట్ లెట్లను విస్తరించే ప్రణాళికలున్నాయి. కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీసు ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

18-03-2025 మంగళవారం ( అందరితో మమేకం )

ప్రజాపాలనలో అందరితో మమేకమవుతూ.. అందరినీ కలుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తన నియోజకవర్గం ఇల్లందుకు సీతారామ ప్రాజెక్టు నీరు అందించే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జనాలతో మమేకం అవుతున్నారని, రేవంత్ ప్రజల మనిషి అంటూ గుమ్మడి నర్సయ్య కొనియాడారు. తమ జిల్లాకు చెందిన సమస్యలను వివరించేందుకు తగిన సమయం ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు.

(17-03-2025 సోమవారం) ( యువ వికాసమే లక్ష్యంగా.. )

ఓవైపు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, ఉద్యోగాలు రాని వారికి స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్. ఈనెల 17న అసెంబ్లీ ఆవరణలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద అర్హులైన యువకులకు 4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వం అందించే నిధులతో యువత వ్యాపారాలను, సర్వీసు పనులను ప్రారంభించి అభివృద్ధి చెంది జీవితంలో నిలదొక్కుకోవాలనేది దీని మెయిన్ కాన్సెప్ట్. ఈ స్కీంతో నియోజకవర్గానికి 5 వేల మందికి లబ్ది జరగబోతోంది. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. రెసిడెన్స్, క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

(16-03-2025 ఆదివారం) ( అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం )

ఈనెల 16న సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దాదాపు 800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారు. ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్ స్కూల్​ కాంప్లెక్స్​ , 46 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించడానికి 148 కోట్లతో ఘన్​ పూర్​ రిజర్వాయర్​ నుంచి నవాబ్​ పేట రిజర్వాయర్​ మెయిన్​ కెనాల్​ సీసీ లైనింగ్​ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక సంఘాలకు 7 ఆర్టీసీ బస్సులను లబ్ధిదారులకు అందించారు.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×