BigTV English

CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. హుస్సేన్ సాగర్ చుట్టూ 14కి.మీ. పరిధిలో సరికొత్త థీమ్‌లు

CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. హుస్సేన్ సాగర్ చుట్టూ 14కి.మీ. పరిధిలో సరికొత్త థీమ్‌లు

CM Revanth Reddy: ప్రాధాన్యతా క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన వారికి నియామకపత్రాలు అందించడం, పారదర్శక పరిపాలన కోసం సమాచార కమిషనర్ల నియామకం, కోర్ అర్బన్ రీజియన్ లో పౌర సేవలు సులభతరం చేసేలా ఆదేశాలు, లండన్ ఐ తరహాలో హుస్సేన్ సాగర్ అభివృద్ధి ప్రణాళికకు ముందడుగు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల హబ్ గా హైదరాబాద్ ఆవిర్భావం వంటి కీలక చర్యలకు ఈ వారం కేంద్రబిందువైంది. ఆ డిటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.


11-05-2025 ఆదివారం ( ట్యాంక్ బండ్ కు కొత్త రూపు )

ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసరాల్లో కొత్త లుక్ తీసుకొచ్చేందుకు బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు మాస్టర్‌ప్లాన్‌ కు సర్కార్ రెడీ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు టెండర్లు ఆహ్వానించగా దేశ విదేశీ కంపెనీలెన్నో ఆసక్తి చూపించాయి. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టులోకి వచ్చే ఈ మొత్తం టూరిస్ట్ స్పాట్లకు తగ్గట్లు ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌కు హెచ్‌ఎండీఏ రూపకల్పన చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త పర్యాటక ప్రాజెక్టులను చేపట్టే అవకాశాలున్నాయి. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 14 కిలోమీటర్ల పరిధిలో సరికొత్త థీమ్‌లను అందుబాటులోకి తేనున్నారు. లండన్‌ ఐ తరహాలో భారీ జాయింట్‌ వీల్‌ లాంటివి ఏర్పాటుకు ప్రైవేట్ సంస్థలు ముందుకొస్తే.. సాధ్యసాధ్యాలను పరిశీలిస్తారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ ఖైరతాబాద్‌ వద్ద మెట్రోను కలుపుతూ స్కైవాక్‌ నిర్మాణానికి ప్రతిపాదనలున్నాయి. వివిధ దేశాల్లో వాటర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టులు పరిశీలించి ఇక్కడా నెలకొల్పనున్నారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ పర్యాటకంగా ఆకట్టుకునే అంశాలు లేక అనుకున్న స్థాయిలో టూరిస్టులు రావడం లేదు. అందుకే సరికొత్తగా వీటిని తీర్చిదిద్దబోతున్నారు.


12-05-2025 సోమవారం ( ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం )

ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో పాటే సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని సమతుల్యం చేసుకుంటూ సమగ్రమైన సమ్మిళితమైన అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ అన్నారు. ఈనెల 12న నానక్‌రామ్‌గూడలో సొనాటా సాఫ్ట్‌వేర్ కొత్త ఫెసిలిటీ సెంటర్ ను సీఎం ప్రారంభించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, హైదరాబాద్‌ను ప్రపంచంలోని అద్భుత నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రణాళికలను సీఎం వివరించారు. హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల హబ్ గా మారిందని, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్, AI -రెడీ డేటా సెంటర్లలో ప్రముఖంగా నిలుస్తోందన్నారు. స్వయం సహాయ సంఘాల ద్వారా 66 లక్షల మందికి పైగా మహిళలకు సాధికారత కల్పిస్తూ, దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ ఫండింగ్, మెంటరింగ్ కార్యక్రమాన్ని తెలంగాణ అమలు చేస్తోందని గుర్తు చేశారు. 2023 డిసెంబర్ నుండి ఇప్పటివరకు తెలంగాణ 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, దాదాపు 1 లక్షకు పైగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను కల్పించడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది.

13-05-2025 మంగళవారం ( ఘనమైన హైదరాబాదీ ఆతిథ్యం )

హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులు, కంటెస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 13న చౌమహల్లా ప్యాలెస్ లో విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులు, నగర ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్ – హైదరాబాద్ వారసత్వ సంపదపై షార్ట్ ఫిల్మ్ చూపించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తమనెంతో ఆకర్షించాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ అండ్ సీఈవో జూలియా మోర్లేతో పాటు కంటెస్టెంట్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదం తమ దేశాల్లో వినిపిస్తామన్నారు.

14-05-2025 బుధవారం ( పారదర్శక పాలనలో ముందడుగు )

పారదర్శక పాలనకు కట్టుబడి ఉండేలా ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమాచార కమిషనర్ల నియామకం ఇందుకు నిదర్శనం. మే 14న సచివాలయంలో నలుగురు కొత్త సమాచార కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పీవీ శ్రీనివాసరావు, మోసినా పర్వీన్, దేశాల భూపాల్, అయోధ్యరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ నియామకాలతో సమాచార హక్కు చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన హ్యూమన్ రీసోర్సెస్ అందుబాటులోకి వచ్చినట్లైంది. పారదర్శక పరిపాలనకు బలంగా నిలిచేలా సమాచార కమిషన్‌ పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది.

14-05-2025 బుధవారం ( ప్రాజెక్టుల పూర్తి కోసం.. )

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే రెండేళ్లలో 2027 జూన్ నాటికి కృష్ణాపై అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అందుకు తగ్గట్లు నిర్ణీత గడువుతో పాటు లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, అనుసరించాల్సిన కార్యాచరణపై జలసౌధలో సీఎం రేవంత్ ఈనెల 14న రివ్యూ చేశారు. కృష్ణా బేసిన్‌లో ప్రాధాన్యతగా ఎంచుకున్న ప్రాజెక్టులకు అవసరమైన నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. భూసేకరణ వేగంగా పూర్తయ్యేందుకు రెవెన్యూ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలని, స్పెషల్ ఆఫీసర్లు పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అటు కోయిల్ సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్‌లోగా పూర్తి చేయాలన్నారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్, జహహర్ నెట్టెంపాడు లిఫ్ట్, రాజీవ్ భీమా లిఫ్ట్ ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నీటి వాటాల అనుమతులు తీసుకోవాలన్నారు.

VO: 14-05-2025 బుధవారం ( కొత్త ఉద్యోగులకు దిశానిర్దేశం )

తెలంగాణలో తరతరాలుగా వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్తశుద్ధితో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖలో కొత్తగా నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి చెప్పారు. తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో బతకడానికి అవసరమైన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములై ప్రజల భావోద్వేగానికి ప్రతీకలుగా నిలబడాలన్నారు. కొలువుల పండుగలో భాగంగా నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 244 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 199 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ కు జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియామక పత్రాలను అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగైదు దశాబ్దాలు వాయిదా పడిన ప్రాజెక్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో కూడా పూర్తి కాలేదని, తెలంగాణ ప్రజలకు అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు అని, ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పూర్తి చేస్తామన్నారు సీఎం. 14 నెలల టైంలో ఒక్క ఇరిగేషన్ శాఖలోనే 1121 మందిని నియమించింది ప్రభుత్వం. ఓవరాల్ గా 14 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాల కల్పన జరిగింది.

VO: 14-05-2025 బుధవారం ( పౌర సేవలు మరింత సులభం )

తెలంగాణ కోర్ అర్బన్ రీజియ‌న్ ప‌రిధిలో చేపట్టే వివిధ ర‌కాల నిర్మాణాలు, ఇత‌ర స‌దుపాయాల క‌ల్పన‌కు సంబంధించిన పౌర సేవలు, అనుమ‌తుల ప్రక్రియ సరళంగా, మరింత ఈజీగా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించి సమగ్ర అధ్యయ‌నంతో సాధ్యమైనంత త్వర‌గా నివేదిక స‌మ‌ర్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈనెల 14న ఇదే విషయంపై సెక్రటేరియట్ లో రివ్యూ చేశారు సీఎం. ఔట‌ర్ రింగు రోడ్ ప‌రిధిలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప‌రిధిలోని కోర్ అర్బన్ రీజియ‌న్‌లో వివిధ ర‌కాల నిర్మాణాల‌కు ప్రజ‌లు ప‌లు విభాగాల‌కు అప్లై చేసుకొని ఆయా కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన అవసరం లేకుండా ఒకే ప్లాట్‌ఫామ్‌పై దరఖాస్తు చేసుకుని సింగిల్ విండోలో అనుమతి లభించేలా వ్యవస్థ ఉండాలన్నారు. ఆయా శాఖ‌లు వ‌సూలు చేసే బిల్లులు కూడా ఒకేసారి, ఒకే విండో ద్వారా చెల్లించే విధానానికి రూపకల్పన జరగాలన్నారు.

VO: 14-05-2025 బుధవారం ( పారదర్శక పాలనలో ముందడుగు )

పారదర్శక పాలనకు కట్టుబడి ఉండేలా ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమాచార కమిషనర్ల నియామకం ఇందుకు నిదర్శనం. మే 14న సచివాలయంలో నలుగురు కొత్త సమాచార కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పీవీ శ్రీనివాసరావు, మోసినా పర్వీన్, దేశాల భూపాల్, అయోధ్యరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ నియామకాలతో సమాచార హక్కు చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన హ్యూమన్ రీసోర్సెస్ అందుబాటులోకి వచ్చినట్లైంది. పారదర్శక పరిపాలనకు బలంగా నిలిచేలా సమాచార కమిషన్‌ పనిచేసేలా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది.

15-05-2025 గురువారం ( కాళేశ్వరం మాస్టర్ ప్లాన్ )

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలిసారి జరుగుతున్న సరస్వతీ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇబ్బందులు రాకుండా టెంట్ సిటీ రెడీ చేయించింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ స్వయంగా హాజరై పుష్కర స్నానం చేశారు. తెలంగాణలో రాబోయే గోదావరి, కృష్ణా పుష్కరాలను అత్యంత అద్భుతంగా నిర్వహిస్తామన్నారు. ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక క్షేత్రంగా, ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. కాళేశ్వరం క్షేత్రానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

15-05-2025 గురువారం ( LRS సడలింపులు )

అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2020లో ఇచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనల్లో మరికొన్ని సడలింపులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణకు రిజిస్టర్‌ సేల్‌డీడ్‌ ఉన్న వారికే అవకాశం ఉండేది. తాజాగా జీవో 98 ప్రకారం రిజిస్టర్‌ గిఫ్ట్‌డీడ్‌, రిజిస్టర్‌ ఎక్సేంజ్‌ డీడ్‌, వారసత్వ రిజిస్ర్టేషన్లు ఉన్న వారు కూడా తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవచ్చు. పురపాలకశాఖ కార్యదర్శి ఇలంబర్తి ఈనెల 15న ఉత్తర్వులిచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేని లేఅవుట్లలో చేతులు మారిన ప్లాట్లను కొనుగోలు చేసిన వాళ్లు కూడా LRSకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.

15-05-2025 గురువారం ( శెభాష్ పోలీసింగ్ )

మత్తు పదార్థాల కట్టడిలో హైదరాబాద్ సిటీ పోలీసులు చేపట్టిన చర్యలకు ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ యాంటీ-నార్కొటిక్స్‌ అవార్డు విభాగంలో మొదటిస్థానం దక్కింది. ఈనెల 15న దుబాయ్‌లో జరిగిన వరల్డ్‌ పోలీస్‌ సమ్మిట్‌ 2025లో నగర సీపీ సీవీ ఆనంద్‌ ఈ పురస్కారం అందుకున్నారు. మూడేళ్ల క్రితం ఆయన సారథ్యంలో హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ – H NEW ఏర్పడింది. గోవా, బెంగళూరు కేంద్రాలుగా డ్రగ్స్‌ సప్లై చేస్తున్న ఇంటర్నేషనల్ స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. మత్తు పదార్థాల వినియోగంతో తలెత్తే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డ్రగ్స్‌ నియంత్రణలో చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.

16-05-2025 శుక్రవారం ( హజ్ యాత్రికులకు అండగా )

తెలంగాణలోని మైనారిటీ వర్గాల అభివృద్ధి, విద్య, ఉపాధి రంగాల్లో సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ముస్లింలలో ఎంతో మంది నిరుపేదలు ఉన్నారని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల్లో వారి జనాభా ప్రకారం అవకాశాలు కల్పిస్తామన్నారు. హజ్‌ యాత్రికులకు నాంపల్లిలో వీడ్కోలు పలికే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. హజ్ యాత్రికుల కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని మామిడిపల్లిలో వసతి భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్‌కు వెళ్లి ప్రార్థనలు చేయాలని అనుకుంటారని, ఈసారి ప్రభుత్వానికి 6 వేల దరఖాస్తులు అందితే వాటన్నింటినీ ఆమోదించినట్టు సీఎం రేవంత్ చెప్పారు. ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం ఎంపీ అడిగిన దాని కంటే ఎక్కువగానే దాదాపు 2 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు సీఎం.

16-05-2025 శుక్రవారం ( నకిలీ విత్తన దందాకు చెక్ )

వానాకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ రెడీగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడే విత్తనాలు, ఎరువులు రైతాంగానికి అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈనెల 16న వ్యవసాయ శాఖపై చేసిన రివ్యూలో కీలక ఆదేశాలు ఇచ్చారు. నకిలీ విత్తనాలు, రైతులను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ, నకిలీ విత్తనాల దందాకు చెక్ పెట్టేందుకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు సీఎం. జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలని, రాష్ట్ర సరిహద్దులు అన్ని చోట్ల టాస్క్ ఫోర్స్ నిఘా ఉంచాలని, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పారు. అన్ని జిల్లాల్లో సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈసారి రుతుపవనాలు ముందే వస్తుండటంతో, రాష్ట్రంలోనూ వానలు ముందుగానే కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన సూచనలను రైతులు గమనించి ఆ ప్రకారం విత్తుకు సిద్ధమవ్వాలన్నారు.

16-05-2025 శుక్రవారం ( హైదరాబాద్‌లో డేటా సిటీ )

తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా కరెంట్ డిమాండ్ పెరగడంతో భవిష్యత్ అంచనాలు, అవసరాలకు తగినట్లుగా కరెంట్ సప్లైకి రెడీగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈసారి ఎంత డిమాండ్ పెరిగినా కరెంట్ కోతలకు ఛాన్స్ లేకుండా పకడ్బందీగా వేసవి సీజన్ ను విద్యుత్ శాఖ అధికారులు అధిగమించారు. పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్‌ నివాసంలో ఈనెల 16న పవర్ పై సీఎం రివ్యూ చేశారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్‌ డిమాండ్‌ 9.8 శాతం పెరిగింది. ఈ ఏడాది విద్యుత్‌ డిమాండ్‌ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరుకుంది. ఈ డిమాండ్‌ 2025–26 లో 18,138 మెగావాట్లకు చేరే ఛాన్స్ ఉంది. దీంతో క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్‌పై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపైన దృష్టి సారించాలన్నారు. జీసీసీ హబ్ ​గా హైదరాబాద్ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్ మారబోతుంది. హైదరాబాద్‌లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. ఫ్యూచర్ సిటీలో టవర్లు, పోల్స్‌, లైన్స్‌ ఏవీ బహిరంగంగా కనిపించకుండా పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అటు GHMC పరిధిలోనూ స్మార్ట్ పోల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×