RGV : తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం. అప్పట్లో డైరెక్టర్ గా స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత రాను రాను వర్మ సినిమాల ను తీయడం మానేసి సినిమాలపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. తనకు నచ్చినట్లు తాను ఉంటూ.. నచ్చని వారిపై విమర్శలు చేస్తూ వస్తున్నావు రాంగోపాల్ వర్మ సినిమాలపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుంటారు. కొన్నిసార్లు కాంట్రవర్సీ అవుతాయి.. అయిన ఆయన లెక్కచేయ్యడు. తాజాగా ఓ సినిమాపై రామ్ గోపాల్ సినిమా పై రివ్యూ ఇచ్చాడు. ఎప్పుడు విమర్శించే ఆయన ఈ మూవీ పై పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.
మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ పై వర్మ కామెంట్స్..
డైరెక్టర్ వర్మ ఒక సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ను ఇచ్చారంటే అతి ఆశ్చర్య పడాల్సిన విషయమే.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన ప్రాంచైజీలలో ‘మిషన్ ఇంపాజిబుల్’ ఒకటి. టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ స్పై సిరీస్ యాక్షన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏడు సిరీస్లు ప్రేక్షకులను బాగా అలరించాయి. రీసెంట్ గా వచ్చిన 8వ సిరీస్ కూడా జనాలను మెప్పించింది. క్రిస్టోఫర్ మేక్‌క్వారీ దర్శకత్వం వహించారు. మే 17న ఇండియా లో పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. శనివారం హైదరాబాద్ లో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. ఆయన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
Also Read : పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం..టాలీవుడ్ నిర్మాతలు ఫుల్ ఖుషి..
రామ్ గోపాల్ వర్మ రియాక్షన్..
మిషన్ ఇంపాజిబుల్ మూవీ తనకు బాగా నచ్చేసిందని ఆయన పొగిడేశాడు. ఇప్పుడే ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’ సినిమా చూశాను. అది మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ ఫ్రాంచైజీ లో ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లే ఇదే బెస్ట్అని ఆర్జీవీ ఎక్స్ లో పోస్ట్ చేసారు. అంతకముందు థియేటర్ వద్ద వర్మ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎక్స్ట్రార్డినరీగా, ఫెంటాస్టిక్ గా ఉంది. టామ్ క్రూజ్ అనే కాదు.. మొత్తం సినిమా సూపర్ గా ఉంది. ఇది చూసిన తర్వాత మనం ఫిలిం మేకర్స్ అని చెప్పుకోడానికే సిగ్గేస్తోంది. అన్ని పార్ట్స్ లో కల్లా ఇదే బెస్ట్ మూవీ. దీన్ని మించిన కథ రాదేమో అనుకుంటున్నాను.. ఇక రాంగోపాల్ వర్మ సినిమా విషయానికొస్తే రీసెంట్ గా శారీ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ మూవీ యావరేజ్ టాక్ ని అందుకోవడం తో ఇప్పుడు మరో సినిమాపై ఫోకస్ పెట్టారు. ఆ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు మూడు కథలను చెప్పిన వర్మ ఏ కథతో ముందుగా ప్రేక్షకులను పలకరిస్తాడో చూడాలి..
The difference between them and us is they assume the audience to be intelligent and push their intelligence further up, by making films like #MissionImpossibleTheFinalReckoning
On the contrary we assume the audience to be dumb and we push their dumbness further down in the hope…— Ram Gopal Varma (@RGVzoomin) May 18, 2025