CM Revanth Reddy: ఈవారం ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగు ముందుకేసింది. క్యాబినెట్ భేటీలో చారిత్రక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేవంత్ సర్కార్. కేంద్ర నిధుల కోసం కొత్త ఫార్ములా, ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీ ఆవిష్కరణ, రెవెన్యూశాఖ బలోపేతానికి చర్యలు, ఇందిరమ్మ ఇండ్లపై కీలక అప్డేట్ సహా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల క్లియరెన్స్ పై కీలక నిర్ణయాల దిశగా ముందడుగు పడింది.
08-03-2025 శనివారం ( భళా మహిళా శక్తి )
ప్రజా ప్రభుత్వంలో మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న రేవంత్ సర్కార్.. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్-2025 పాలసీని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆవిష్కరించారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమంటూ చెబుతూ వస్తున్న సీఎం రేవంత్ తాజాగా ఈ పాలసీని ఆవిష్కరించడం ద్వారా వారిని మరో అడుగు ముందుకు వేయించారు. ఇప్పటికే మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటూ వస్తోంది. ఆర్టీకి అద్దె బస్సులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, పెట్రోల్ బంకులు, ప్రభుత్వ స్కూల్ పిల్లల డ్రెస్ ల వర్క్ ఆర్డర్ ఒక్కటేమిటి ఎన్నెన్నో అవకాశాలను వారి కోసం సృష్టిస్తోంది.
అవకాశాలిస్తోంది. బ్యాంకురుణాలు ఇప్పిస్తున్నారు. తాజాగా మహిళా సంఘాలకు చెందిన 150 బస్సులను సీఎం ప్రారంభించారు. సోలార్ పవర్ ప్లాంట్లకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. గ్రామీణ, పట్టణ మహిళలను, యువతులను, వృద్ధ మహిళలను ఒకే గొడుగు కిందకు చేర్చి, ఆర్థిక స్వాతంత్య్రం, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ద్వారా వారిని శక్తిమంతం చేయడానికి ప్రయత్నిస్తోంది ప్రజా ప్రభుత్వం. అందరినీ ఒకే గొడుగు కిందికి తెస్తే సభ్యుల సంఖ్య కోటికి చేరనుంది. కోటి మంది మహిళలు లక్ష కోట్ల రుణాన్ని పొందినప్పుడు నిజమైన మహిళా సాధికారత, ఆర్థికశక్తి కేంద్రంగా మారుతారని మహిళాశక్తి మిషన్ పాలసీతో ప్రభుత్వం చెబుతున్న మాట.
08-03-2025 శనివారం ( కేంద్ర నిధుల కోసం కొత్త ఫార్ములా )
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టుల కోసం కేంద్ర నిధులు తీసుకురావడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో ఆల్ పార్టీ ఎంపీల భేటీని శనివారం నాడు ప్రజాభవన్ లో నిర్వహించారు. ఇందులో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీకి బీజేపీ, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ హాజరయ్యారు. మీటింగ్ లో కేంద్రం అందించాల్సిన సహాయం, రావాల్సిన నిధులపై డిస్కస్ చేశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన వర్సిటీకి నిధులు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల అభివృద్ధి నిధి కింద 1800 కోట్లు తీసుకొచ్చేలా ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు.
అలాగే మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ కింద 24,269 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 14 వేల 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే 10 గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు 45 వేల కోట్లు, గోదావరి-మూసీ అనుసంధాన ప్రాజెక్టుకు 7,440 కోట్లు ఇవ్వాలని, హైదరాబాద్‌లో సీవరేజ్ మాస్టర్ ప్లాన్ కు అలాగే వరంగల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం నిధులు రాబట్టడానికి రోడ్ మ్యాప్ డిసైడ్ చేశారు.
07-03-2025 శుక్రవారం ( సౌత్ వాయిస్ )
జనాభా ఆధారంగా గానీ, ప్రోరేటా అంటే ఇప్పుడున్న సీట్ల సంఖ్య ఆధారంగా గానీ లోక్‌సభ సీట్ల డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈనెల 7న ఢిల్లీలో ఇండియాటుడే కాంక్లేవ్ లో పాల్గొన్న సీఎం చాలా అంశాలపై తమ స్టాండ్ పై క్లారిటీ ఇచ్చారు. దక్షిణాదికి నష్టం జరగకుండా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని పార్టీల వాదనలు వినాలన్నారు. బలహీన వర్గాలు కోరుతున్నట్టు బీసీ రిజర్వేషన్లు పెంచడం కరెక్టే అని, సామాజిక న్యాయం సాధించే క్రమంలో రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు.
07-03-2025 శుక్రవారం ( ఉద్యోగుల బకాయిల క్లియరెన్స్ )
ప్రభుత్వ ఉద్యోగులు బకాయిల కోసం తిరగాల్సిన పని లేదని, ప్రజా ప్రభుత్వం వచ్చాక ఏడాది టైంలోనే ఉద్యోగులకు సంబంధించి 10 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ సహా పలువురు ప్రతినిధులు ఈనెల 7న సచివాలయంలో డిప్యూటీ సీఎంతో సమావేశం అయ్యారు. దశాబ్దాలుగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులు దాచుకున్న డబ్బు కోసం పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి, తానూ అర్థం చేసుకున్నామని, గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 5వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టిందని వారికి గుర్తు చేశారు. గత 14 నెలల్లో కొంత పెండింగ్ జమ అయ్యాయని, పాత, కొత్త బిల్లులు కలిపి ఇప్పటికే 10 వేల కోట్ల బిల్లులను క్లియర్ చేసినట్లు తెలిపారు. మరో 8 వేల కోట్ల బకాయిలు మిగిలి ఉన్నాయని, ఏప్రిల్ నుంచి అవి కూడా లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒకటో తేదీనే శాలరీస్ ఇస్తున్న విషయాన్ని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం వివరిస్తోంది.
07-03-2025 శుక్రవారం ( ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ )
ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. 2.5 శాతం డీఏ ఇస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. డీఏ ప్రకటనతో ప్రతి నెలా ఆర్టీసీపై 3.6 కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నా కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. మహాలక్ష్మి స్కీం ప్రారంభించాక ప్రతిరోజూ అదనంగా 14 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని, దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందని, అందుకే డీఏ పెంచామని ప్రభుత్వం అంటోంది. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటిదాకా 150 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. దాదాపు 5 వేల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక ప్రయోజనం మహిళలకు ప్రజాప్రభుత్వం అందించింది.
07-03-2025 శుక్రవారం ( ఇందిరమ్మ ఇండ్లపై కీ అప్డేట్ )
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇళ్లను ఇచ్చే కార్యక్రమం వారం రోజుల్లో ప్రారంభమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేని కారణంగా తులం బంగారం కొంత ఆలస్యమవుతుందని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని ఆలస్యమైనా నిలబెట్టుకుంటామని ప్రభుత్వం అంటోంది. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఇప్పటికే ఎంపిక చేశారు. పనులు మొదలు పెట్టేందుకు బిల్లుల్ని దశల వారీగా రిలీజ్ చేయబోతున్నారు. కేంద్రం నుంచి మరిన్ని ఇండ్ల కోసం నిధులు తెచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేశారు.
07-03-2025 శుక్రవారం ( విద్యావ్యవస్థలో సంస్కరణలు )
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం కోసం రూపొందించిన నివేదికను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి అందించారు. కొత్తగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పై స్టడీ చేసిన విషయాలను మంత్రి వెంకట్ రెడ్డికి వివరించారు. ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు టెక్నికల్ ఎడ్యుకేషన్ తో పాటు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది.
07-03-2025 శుక్రవారం ( ప్రాపర్టీ ట్యాక్స్ ఆఫర్ )
GHMC పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపు బకాయిదారులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 90 శాతం వడ్డీ మాఫీతో మొత్తం ఒకేసారి పన్ను బకాయిలు చెల్లించేలా మరోసారి ఓటీఎస్‌ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ ఈనెల 7న ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటీఎస్‌లో మొత్తం పన్నుతోపాటు వడ్డీ 10 శాతం చెల్లిస్తే సరిపోతుందంటున్నారు ఆఫీసర్లు. గతేడాది ప్రవేశపెట్టిన వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీంతో సుమారు లక్ష మంది వినియోగదారులు ఆస్తి పన్ను చెల్లించారు. జీహెచ్‌ఎంసీ.. ఈసారి ఆస్తి పన్నుకు సంబంధించి 2 వేల కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
06-03-2025 గురువారం ( క్యాబినెట్ కీలక నిర్ణయాలు )
ఈనెల 6న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదంతో పాటే విద్యా, ఉద్యోగాల్లోనూ బీసీలకు 42 శాతం కోటా కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫార్సులకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. న్యాయపరమైన చిక్కులు రాకుండా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానించింది. అలాగే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ – FCDAకి ఆమోదం తెలిపారు. శ్రీశైలం హైవే – నాగార్జునసాగర్ హైవే మధ్యలో దాదాపు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఉండబోతోంది. దీని అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 90 పోస్టులను మంజూరు చేశారు.
హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని నిర్ణయించడంతో ఆ ప్రాంతాల జనం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మహిళా సాధికారతపై ఇందిరా మహిళా శక్తి మిషన్ – 2025కు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామాల్లో సెర్ప్ కింద, పట్టణాల్లో మెప్మా కింద ఉన్న మహిళా సంఘాలు ఒకే గొడుగు కింద తెస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట ట్రస్టు బోర్డు ఏర్పాటుకు వీలుగా దేవాదాయ చట్టంలో సవరణలు చేయాలని నిర్ణయించారు. 2025-2030 మధ్య ఐదేళ్లకు గాను టూరిజం పాలసీకి ఆమోదం, మే నెలలో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు ఏ లోటూ లేకుండా ఏర్పాట్లు చేయడం, 10,954 గ్రామాలకు రెవెన్యూ అధికారుల నియామకం, ఉగాది నుంచి భూభారతి చట్టం అమలు ఇలాంటి కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది.
04-03-2025 మంగళవారం ( పెండింగ్ నిధులపై యాక్షన్ ప్లాన్ )
తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన పథకాలు, నిధుల విషయంలో ఎప్పటికప్పుడు సీఎం రేవంత్, మంత్రులు ఢిల్లీ వెళ్లి మరీ ఫాలో అప్ చేసుకుంటూ వస్తున్నారు. నిధులు రాబడుతున్నారు. సమస్యలు వివరిస్తున్నారు. పెండింగ్ పనులను మంజూరు చేయిస్తున్నారు. ఈవారం కూడా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈనెల 4న కేంద్ర ఆహార పౌర సరఫరా, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణకు పీఎం కుసుమ్ స్కీం కింద గతంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి అనుమతులను పునరుద్ధరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
తెలంగాణకు గతంలో 4 వేల మెగావాట్లకు అనుమతులు ఇచ్చిన కేంద్రం, తర్వాత దానిని వెయ్యి మెగావాట్లకు కుదించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. అటు FCIకి 2014-15 ఖరీఫ్ కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన 1,468 కోట్లను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. గతంలో బియ్యం పంపిణీకి సంబంధించి అన్ని రకాల బకాయిలను ధ్రువీకరించుకుని రిలీజ్ చేయాలని కోరారు. అలాగే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని, రేషన్ కార్డుల కోటా కింద రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు ధాన్యం, సబ్సీడీని కేంద్రం ఇవ్వాలని గుర్తు చేసి వచ్చారు.
04-03-2025 మంగళవారం ( అద్దె బస్సులపై జీవో )
మహిళా సంఘాలకు స్వయం ఉపాధిలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 4న అందుకు సంబంధించిన జీవోను రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసింది. తొలి విడతలో 150 మహిళా సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె కింద 77,220 రూపాయలు చెల్లిస్తారు. ఇక బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ సైతం ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను నడపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లయింది.
VO: 03-03-2025 సోమవారం ( న్యాయమైన నీటి వాటా కోసం )
తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటాల కోసం రేవంత్ ప్రభుత్వం ఏ అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. ప్రతి సందర్భంలో కేంద్ర జల్ శక్తి మంత్రికి పరిస్థితులను వివరిస్తూనే వస్తున్నారు. తాజాగా ఈనెల 3న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దాదాపు గంట పాటు వీరి సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులపై ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పర్యావరణ అనుమతులపై చర్చించారు.
కృష్ణా నది పరివాహకంలో సుమారు 70 శాతం తెలంగాణలో ఉంటే.. కేవలం 30 శాతం మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణకు కేటాయించాలన్నారు. గోదావరికి సంబంధించి నికర జలాల్లో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ సర్కార్ గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిందని ఫిర్యాదు చేశారు. కేంద్ర జల సంఘం, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీల నుంచి ఎలాంటి అనుమతి పొందలేదని గుర్తు చేశారు.
02-03-2025 ఆదివారం ( వనపర్తిలో అభివృద్ధి పథం )
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఈనెల 2న వనపర్తికి మొదటిసారి వెళ్లారు. దీంతో ఆయన్ను చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. టీనేజ్ లో సీఎం ఎక్కువ కాలం వనపర్తిలోనే ఉన్నారు. ఇంటర్ కూడా అక్కడే చదివారు. వనపర్తిలోనే ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి అక్కడే కొన్నేళ్లు ఉండడంతో.. అత్యంత సన్నిహితులైన వారు ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. మరోవైపు వనపర్తి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, వనపర్తి బాయ్స్ ZPHS కొత్త బిల్డింగ్, ఐటీ టవర్స్ బిల్డింగ్ నిర్మాణానికి, శ్రీరంగాపురం టెంపుల్ అభివృద్ధి పనులకు, పెబ్బేరులో 30 బెడ్స్ హాస్పిటల్ నిర్మాణానికి, రాజనగరం నుంచి పెద్దమందడికి బీటీ రోడ్డు నిర్మాణానికి, సీఆర్ఆర్ రోడ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కేడీఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ లో స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం 10,490 మందికి కుట్టు మిషన్లు అందజేశారు. బ్యాంక్ లింకేజీ ద్వారా 300 కోట్ల నిధులను అందజేశారు. ఒంటరి మహిళలు, నిస్సహాయ తల్లులకు 50 వేల చొప్పున నిధులు కేటాయించారు.
02-03-2025 ఆదివారం ( ఆపరేషన్ SLBC రెస్క్యూ )
ఈనెల 2న సీఎం రేవంత్ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదస్థలిని పరిశీలించారు. మంత్రుల బృందంతో కలిసి సొరంగంలోకి వెళ్లిన సీఎం.. సహాయక చర్యల గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం వివిధ శాఖల అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రమాదం ప్రకృతి విపత్తు అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదని సీఎం గుర్తు చేశారు. SLBC పనులు వేగంగా పూర్తిచేసి నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చిత్తశుద్ధితో పనిచేస్తుంటే అనుకోకుండా ఈ దుర్ఘటన జరిగిందన్నారు.