Nirmala Sitharaman: దేశంలో జీఎస్టీ రేట్లను తగ్గించాలని అనేక నెలలుగా డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదాయపు పన్ను రేట్ల తగ్గింపుతో పాటు, జీఎస్టీ రేట్లను కూడా తగ్గించే యోచనలో ఉన్నామని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం జీఎస్టీ రేట్లు, శ్లాబులను హేతుబద్ధీకరించే ప్రక్రియ దాదాపు చివరి దశలో ఉందని ఆమె అన్నారు. ఈ క్రమంలో త్వరలోనే రేట్లను తగ్గించే నిర్ణయం తీసుకుంటామని నిర్మలా సీతారామన్ చెప్పడం విశేషం.
తాజాగా ‘ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్న క్రమంలో వెల్లడించారు. ఈ క్రమంలో జూలై 1, 2017న జీఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు 15.8 శాతం ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేటు (RNR) 2023 నాటికి 11.4 శాతానికి తగ్గింది. ఇది మరింత తగ్గుతుందని భావిస్తున్నట్లు నిర్మలా అన్నారు. ఆమె నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ 2021 సెప్టెంబర్‌లో మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసి, రేట్లను హేతుబద్ధీకరించడానికి, శ్లాబులలో మార్పులను సూచించడానికి కృషి చేస్తోంది.
Watch Live: Smt @nsitharaman's fire-side chat at The Economic Times Awards for Corporate Excellence (@ETAwards) in Mumbai, Maharashtra.#ETAwards #25YearsofETAwards @DeloitteIndia @EconomicTimes https://t.co/75p1ocpp0g
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) March 8, 2025
జీఎస్టీ తగ్గింపు అంశంపై మా మంత్రుల బృందం అద్భుతంగా పని చేసిందని, ఇప్పుడు ఈ దశ చివరి స్థాయికి చేరిందన్నారు. ఆ క్రమంలో ప్రతి గ్రూప్ పనిని మరోసారి సమీక్షించడానికి చొరవ తీసుకుంటుమన్నారు. ఆ తర్వాత దానిని కౌన్సిల్‌కు తీసుకెళ్లి, తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేట్లను హేతుబద్ధీకరించడంపై మరికొంత పని చేయాల్సి ఉందని ఆమె స్పష్టం చేశారు.
Read Also: EPFO Update: ఈపీఎఫ్ఓ బిగ్ అప్డేట్.. అలా జరిగితే మీ ఫ్యామిలీకి రూ. 7 లక్షలు..
జీఎస్టీ శ్లాబ్‌లను మార్చాలని డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం జీఎస్టీ కింద నాలుగు శ్లాబ్‌లు ఉన్నాయి. 5%, 12%, 18%, 28%. కొన్ని విలాసవంతమైన వస్తువులపై ప్రత్యేకంగా సెస్సు విధించే నిబంధన కూడా ఉంది. ఇదే సమయంలో జీఎస్టీ శ్లాబుల సంఖ్యను 4 నుంచి 3కి తగ్గించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు ప్రభుత్వంపై డిమాండ్, వినియోగాన్ని పెంచాలనే ఒత్తిడి కూడా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జీఎస్టీ కౌన్సిల్ రేట్లను తగ్గించాలని పరిశీలిస్తున్నారు. 12 శాతం జీఎస్టీ రేటు శ్లాబ్‌ను రద్దు చేయడం ద్వారా ఈ స్లాబ్ కింద వచ్చే వస్తువులను 5% లేదా 18% శ్లాబ్‌లో ఉంచే అవకాశం ఉంది. ఈ కసరత్తు జీఎస్టీ రేటు నిర్మాణాన్ని హేతుబద్ధీకరిస్తూ వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా చేయనున్నారు.
ఈ పరిణామాలు జీఎస్టీ రేట్ల తగ్గింపు, శ్లాబుల హేతుబద్ధీకరణపై ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తుందని చెప్పవచ్చు. వినియోగాన్ని పెంచడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పన్ను విధానాన్ని అందించవచ్చు. ఈ క్రమంలో జీఎస్టీ రేట్ల తగ్గింపు గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు, దేశ ఆర్థిక వ్యవస్థపై పాజిటివ్ ప్రభావం చూపిస్తాయని ఆశించవచ్చు
Read Also: PAN Card 2.0: పాన్ కార్డ్ 2.0కు అప్లై చేశారా లేదా.. ఇలా ఈజీగా చేసుకోవచ్చు..