E-Paper
Advertisement

Rayachoti Politics: రాయచోటిలో నిరసనలు.. టీడీపీ నేతలకు టెన్షన్.. ఎందుకంటే!

Rayachoti Politics: రాయచోటిలో నిరసనలు.. టీడీపీ నేతలకు టెన్షన్.. ఎందుకంటే!
Advertisement

Rayachoti Politics: ఏపీలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ అన్నమయ్య జిల్లా రూపురేఖలే మార్చేసింది.. మొన్నటి వరకు జిల్లా కేంద్రంగా ఉన్న ఆ నియోజకవర్గ కేంద్రాన్ని మారుస్తూ నూతన జిల్లా ఏర్పాటుకు క్యాబినెట్ అమోదం తెలపడంతో ఆ ప్రాంతం నిరసన జ్వాలలతో భగ్గుమంటోంది.. జిల్లాల పునర్వవ్యస్థీకరణతో ఆ మంత్రీ కన్నీరు పెడుతుంటే ప్రతిపక్ష, ప్రజా సంఘాలు మాత్రం వెనుకబడిన తమ ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమాధి కట్టింది అంటూ ఆరోపిస్తున్నాయి.. ఇంతకీ జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న మార్పులేంటి?.. ఎందుకు ఆ ప్రాంత ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు?

జిల్లాల పునర్విభజనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక‌దృష్టి
ఆంధ్రప్రదేశ్‌‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజనపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన, అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది.. అదే అన్నమయ్య జిల్లా రద్దు, జిల్లా కేంద్రం మార్పు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ మేరకు కీలక చర్చ జరిగింది. గత ప్రభుత్వం రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లా భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడింది. తాజా ప్రతిపాదనల ప్రకారం, అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేసి పొరుగు జిల్లాల్లో విలీనం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

వైఎస్‌ఆర్ కడప జిల్లాలో కలుస్తున్న రాజంపేట
రాజంపేటను వైఎస్ఆర్ కడప జిల్లాలో కలపడం, అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని కొత్తగా ఏర్పాటు కాబోయే మదనపల్లె జిల్లాలో విలీనం చేయడం, రైల్వే కోడూరును తిరుపతి జిల్లా పరిధిలోకి మార్చేందుకు క్యాబినెట్ అమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో క్యాబినెట్ సమావేశ సమయంలోనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. అయితే అయనను సమూదాయించిన సిఎం చంద్రబాబు రాయచోటి అభివృద్దిని తాను చూసుకుంటానని భరోసానిచ్చారు. ఈ నేపధ్యంలో అనంతరం మీడియా ముందుకు వచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి సైతం రాయచోటిని గత ప్రభుత్వ హాయంలో ఎవరికోసమో జిల్లా కేంద్రంగా చెయ్యలేదని, అన్ని నియోజకవర్గాలకు కేంద్రంగా ఉండటం వల్ల జిల్లా కేంద్రం చేశారని, ఇప్పుడు జిల్లా కేంద్రం పోవడం పట్ల ఎవరైనా తనను విమర్శిసిస్తే చూస్తూ ఉరుకునేది లేదని, యేడాదిలో రాయచోటిని అభివృద్ది చేసి చూపి తన మాట నిలుపుకుంటానన్నారు.

రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుందని హామీ ఇచ్చిన చంద్రబాబు
అయితే ఈ నిర్ఱయంపై ఇటు రాజంపేట, రైల్వేకోడూరులలో వ్యతిరేకత లేకపోయినా రాయచోటిలో మాత్రం అసంతృప్తి భగ్గుమంటోంది. రాయచోటికి ఎన్నికల సమయంలో వచ్చిన చంద్రబాబు రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో రాజంపేటకు వెళ్లిన చంద్రబాబు అక్కడా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను చేస్తానని ప్రకటించారు. అంతకుముందు అధికారంలోకి వచ్చాక మదనపల్లెను ప్రత్యేక జిల్లా చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే అందరిని గందరగోళంలో పడేసేలా హామీలు ఇఛ్చినా స్థానిక నాయకులు దానికి వంతపాడటంతో సమస్యగా మారలేదు. కానీ అధికారంలోకి వచ్చాకా ఇప్పుడు పునర్వవస్ధీకరణకు శ్రీకారం చుట్టడం… మంత్రివర్గ ఉపసంఘం కూడా పలు కీలక సూచనలు చెయ్యడంతో అన్నమయ్య జిల్లా భౌగోళిక ముఖచిత్రంలో భారీ మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి.

Advertisement

మీసం తీయించుకుంటానని శపధం చేసిన మంత్రి
ఈ నేపధ్యంలోనే రాజంపేట, రైల్వేకోడూరు వాసుల్లో ఆందోళనలు తీవ్రమవ్వడం, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటకు చెయ్యాలని డిమాండ్ తెరమీదకు రావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇటీవల మంత్రి రాంప్రసాదరెడ్డి సైతం జిల్లా కేంద్రం మారితే తాను మీసం తీయించుకుంటానని శపథం కూడా చేశారు. దీంతో రాయచోటి వాసుల్లో జిల్లా కేంద్రం మారదన్న థీమా వ్యక్తమైంది. కానీ ఇప్పుడు ఎవ్వరు ఉహించని పరిణామాలు చోటుసుకోవడంతో అందరిలోను గందరగోళం రేపాయట..

సీఎం తమను మోసం చేశారంటున్న రాజంపైట, రాయచోటి వాసులు
ఈ గందరగోళ పరిస్ధితుల నేపధ్యంలో సిఎం చంద్రబాబు తమను మోసం చేశారని రాజంపేట, రాయచోటి ప్రజలు భగ్గుమంటున్నారు. రాయచోటి జిల్లా కేంద్రం ముచ్చట మూణ్ణాళ్ల ముచ్చటగా మార్చారని, తమ జిల్లా కేంద్రం మార్చితే రాయచోటిని మదనపల్లెలో కాకుండా కడపలో కలపాలని రాయచోటి వాసులు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు తమ ప్రాంతానికి చెందిన అన్నమయ్య పేరును వాడుకుంటూ తమ ప్రాంతానికి రావలసిన జిల్లా కేంద్రాన్ని మరో ప్రాంతంలో ఎలా పెడతారని రాజంపేట వాసులు ప్రశ్నిస్తున్నారు. మదనపల్లె జిల్లా కేంద్రం చేసేందుకు అర్హహతలుంటే పార్లమెంట్ కేంద్రమైన తమ రాజంపేటకు ఎందుకు అర్హతలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. స్కూటీ బస్సు ఢీ.. స్పాట్‌లోనే భార్యాభర్తలిద్దరూ

ఇంకో వైపు అపారి ఖనిజ సంపదలు, ఉద్యాన పంటలు, విస్తారమైన ఎర్రచందనంతో తమ జిల్లాలో అంతర్బాగంగా ఉంటున్న రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలిపితే మా ప్రాంతం వెనకబడి పోతుందని ఉమ్మడి కడప జిల్లా వాసులు అంటున్నారు. అదును కోసం ఎదురుచుస్తున్న వైసీపీ కూడా ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహావేశాలను అదునుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తం మీద కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉమ్మడి కడప జిల్లాలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిడేలా చేసింది. రాయచోటిలో అప్పడే ఉద్యమ కార్యచరణకు శ్రీకారం చుట్టారు. రాజంపేటలోను ఇదే పరిస్ధితి కనిపిస్తోంది. మరి ఈ అసంతృప్తి, ఆగ్రహా జ్వాలలను కూటమి ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి.

Story By Ajay Kumar. Bigtv

Related News

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

Big Stories

Advertisement
×