BigTV English

Paytm agents threats to a man: హైదరాబాద్‌.. ఈఎంఐ ఇష్యూ, కత్తితో బెదిరించిన పేటీఎం ఏజెంట్లు

Paytm agents threats to a man: హైదరాబాద్‌.. ఈఎంఐ ఇష్యూ, కత్తితో బెదిరించిన పేటీఎం ఏజెంట్లు

Paytm agents threats to a man(Hyderabad news today): హైదరాబాద్‌లో పట్టపగలు పేటీఎం ఏజెంట్లు ఓ వ్యక్తిని కత్తితో బెదిరించారు. ఈఎంఐ ఎందుకు కట్టలేదని సదరు వ్యక్తిని ప్రశ్నించారు. ఈలోగా అతడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నేరుగా కత్తి తీసి బెదిరించే ప్రయత్నం చేశారు. ఈలోగా చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకోగానే అక్కడి నుంచి పేటీఎం ఏజెంట్లు పరారయ్యారు.


సంచలనం రేపిన ఈ ఘటన మీర్‌పేట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. అసలు డీటేల్స్‌లోకి వెళ్తే.. గుర్రంగూడకు చెందిన అశోక్-డేవిడ్ లు జాయింట్‌గా బేకరీ నడుపుతున్నారు. దీన్ని పెద్దది చేసేందుకు పేటీఎంలో దాదాపు ఆరులక్షల వరకు రుణం తీసుకున్నారు. వాయిదా రూపంలో లక్షా 60 వేల వరకు చెల్లించారు. అయితే బేకరీలో నష్టాలు మొదలయ్యాయి. చివరకు రుణం చెల్లించలేకపోయారు.

శుక్రవారం అశోక్-డేవిడ్ లు ఫ్యామిలీతో కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా పేటీఎం రికవరీ ఏజెంట్లు అక్కడికి వచ్చారు. డబ్బు విషయంలో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బాధితుల నుంచి సరైన సమాచారం రాకపోవడంతో కత్తితో బెదిరించే ప్రయత్నం చేశారు. వీలైనంత తొందరగా తీర్చాలని లేకుండా ఇబ్బందులు తప్పవని బెదిరించారు.


ALSO READ: బొగ్గు రాజకీయం.. కేటీఆర్ చెప్పినదానిలో నిజమెంత ?

చుట్టుపక్కలవాళ్లు అక్కడికి చేరుకోవడంతో వెంటనే రికవరీ ఏజెంట్లు పరారయ్యారు. చివరకు అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేటీఎం రికవరీ ఏజెంట్లపై కేసు నమోదు చేశారు పోలీసులు.

 

Tags

Related News

Weather News: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, జాగ్రత్తగా ఉండడి..!

Microsoft Office: ఆఫీస్ నెలరోజుల అద్దె రూ.5.4 కోట్లు.. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ రికార్డ్ బ్రేక్

Gachibowli News: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల నుంచి 25 ప్లాట్లను అద్దెకు తీసుకుని.. చివరకు?

KTR: కేంద్రంలో 2 కోట్లు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్.. అన్ని వట్టి మాటలేనా..? కేటీఆర్ ఫైర్

Khairatabad Ganesh: విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపతి.. ఈసారి ఎన్ని అడుగులంటే..

Wife beats husband: భర్తను చితక్కొట్టిన భార్య.. ఏడుస్తూ పోలీసులకు ఆశ్రయించిన భర్త

Big Stories

×