E-Paper
Advertisement

కాంగ్రెస్‌ పెంచిన పింఛన్లపై విమర్శలు! పాతవి తొలగించి కొత్తవి ఇచ్చారని ప్రచారం..! కేసీఆర్‌ వస్తే 4వేలు ఇచ్చేవారని కామెంట్స్‌..!

కాంగ్రెస్‌ పెంచిన పింఛన్లపై విమర్శలు! పాతవి తొలగించి కొత్తవి ఇచ్చారని ప్రచారం..! కేసీఆర్‌ వస్తే 4వేలు ఇచ్చేవారని కామెంట్స్‌..!
Advertisement

తెలంగాణలో ప్రస్తుతం పింఛన్ రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ భారీ మొత్తంలో కొత్త పింఛన్లు ఇచ్చామని చెప్పుకునే లోపే.. బీఆర్ఎస్ ఈ ఈ అంశంపై ఎదురుదాడికి దిగుతోంది. రేవంత్‌ పెంచిన ఫింఛన్ల గొప్పేంటీ? అసలు అవి కొత్తవి కానే కావు.. పాత వాటికే కొత్త కలరింగిస్తున్నారనే కొత్త వాదనను తెర మీదకు తెస్తున్నారు. కాంగ్రెస్ ను ఇరకాటంలో పెడుతున్నారు.

కేసీఆర్‌ సర్కార్‌ రూ. 200 ఉన్న పింఛన్‌ను రెండు వేలకు పెంచింది. వికలాంగులకు 4 వేలుగా చేశారు. మూడో టర్ము ఎన్నికలొచ్చే సరికి ఈ పింఛన్ల ఎన్నికల ప్రచారం కీలక భూమిక పోషించింది. బీఆరెస్‌, కాంగ్రెస్‌ తమ మ్యానిఫెస్టోలలో దీనికి ప్రయార్టీ ఇచ్చారు. ప్రజలను వెంటనే ప్రభావితం చేసే పథకం కావడంతో పాటు, ఎక్కువ మందికి పింఛన్ సౌకర్యం లభించే అవకాశం ఉండటంతో మెజారిటీ జనాన్ని ఆకర్షించవచ్చనే రాజకీయ కోణం కూడా బాగా పనిచేసింది.

Advertisement

కాంగ్రెస్‌ సర్కార్‌ చేయూత పేరుతో ఒకేసారి రూ. 4వేలకు పింఛన్లు పెంచి ఇస్తామన్నారు. వికలాంగుల పింఛన్‌ను రూ. 6వేలు చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన ఎన్నికల హామీలలో బాగా ప్రభావం చూపిన వాటిల్లో ఇదే నెంబర్‌ వన్ అని చెప్పాలి. కానీ, పింఛన్‌ పెంపులో కాంగ్రెస్‌తో పోటీ పడలేకపోయింది బీఆరెస్‌.

అప్పటికే కేసీఆర్‌ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి బడ్జెట్‌పై పెనుభారం మోపారు. అంతకు ముందున్న పథకాలూ భారంగానే ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ నుంచి బీఆరెస్‌గా పార్టీ పేరును మార్చిన కేసీఆర్‌.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ప్రకటించుకుని.. ఈ దళితబంధుకు శ్రీకారం చుట్టారనే ప్రచారం జరిగింది.

Advertisement

జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ కూడా దళితుల కోసం ఇలా ఆలోచించలేదని, అది కేసీఆర్‌తోనే సాధ్యమయ్యిందని ఆ పార్టీ నేతలతో ప్రచారం చేయించుకున్నారు. కేసీఆర్‌ లాంటి నేత .. దేశ్‌ కీ నేతగా మారితే.. దేశ ప్రజల జీవితాలు వెలిగిపోతాయని కూడా ఢంకా బజాయించింది గులాబీ సేన.  ఇక కాంగ్రెస్‌.. పింఛన్‌ను 4వేలకు పెంచుతామనగానే, బీఆరెస్‌ వెంటనే తాము కూడా డబుల్‌ చేస్తామని మాత్రం చెప్పలేకపోయింది. కానీ తమకు మళ్లీ అధికారం ఇస్తే.. ఐదేళ్లలో 4వేల వరకు పెంచుతూ పోతామన్నారు. అంటే ఏడాదికి 500 చొప్పున నాలుగేళ్లలో రెండు వేలు పెంచడం ద్వారా మొత్తం 4వేల పింఛన్‌ను ఇస్తామని చెప్పుకున్నారు.

కానీ డబుల్‌ పింఛన్‌ వైపే జనాలు మొగ్గు చూపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్‌ పై పెదవి విరిచారు. పింఛన్ల పెంపుపై టైమ్‌ అడిగారు. ఇప్పుడు మూడేండ్ల తరువాత 4.50 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేసింది సర్కార్.  ఈనెల 19 నుంచి కొత్త లబ్దిదారుల ఖాతాల్లో రూ. 2వేల చొప్పున పింఛన్‌ జమ అవుతోంది. అయితే ఈ కొత్త పింఛన్లు ఇచ్చామనే ప్రచారాన్ని కాంగ్రెస్‌ ఇంకా ముమ్మరం చేయకముందే బీఆరెస్‌ ఎదురుదాడికి దిగుతోంది.

కేటీఆర్‌, హరీశ్‌ రావులిద్దరు ఈ పింఛన్లపై ప్రత్యేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. రేవంత్ సర్కార్ కొత్త పింఛన్లు ఇచ్చిందనే సానుకూలత ప్రజల్లో కలగనీయకుండా… తమదైన పింఛన్‌ రాజకీయానికి తెరలేపారు. తాము అధికారం నుంచి దిగిపోయేటప్పుడు ఉన్న 44 లక్షల పింఛన్లే ఇప్పుడున్నాయని, బడ్జెట్‌ కూడా పెరగలేదని, ఇప్పుడు కొత్తవి అని చెబుతున్నవి తొలగించి.. మళ్లీ చేర్చిన పింఛన్లేనని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.

అంతేకాదు,  మళ్లీ కేసీఆర్‌ను గెలిపించుకుని ఉంటే.. బీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఇప్పటికే మీకు రూ. 4వేల పింఛన్‌ వచ్చేది..అని జనాల్లో డబుల్ పింఛన్‌ అంశాన్ని మరుగున పడనీయకుండా చేస్తున్నారు. తాము మళ్లీ అధికారంలోకి రాగానే వెంటనే రూ. 4వేల పింఛన్‌ ఇస్తామనే పరోక్ష హామీ ఇప్పట్నుంచే మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది ఆ పార్టీ. ఈ పరిణామం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టేలాగే ఉందంటున్నారు.

Tags

Related News

పెనం మీద నుంచి పొయ్యిలోకి నిజామాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌! నేతల తీరుతో అధిష్టానానికి తలవంపులు..! మాజీ మంత్రి కామెంట్స్‌తో తీవ్ర చర్చ

జెన్‌జీని తక్కువ అంచనా వేశా! జంతర్‌ మంతర్‌ తరువాత వారి శక్తిని కళ్లారా చూసినా..! నేతలెవరూ వారితో పెట్టుకోవద్దని తెలుసుకున్నా!

నా పాలనకు వందకు 60 మార్కులు.. రెండేళ్లలో మరిన్ని మార్కులు సాధిస్తానని నమ్మకం ఉంది..! సంక్షేమ పథకాలపై చర్చోపచర్చలు!

మాటకు మాట.. సీఎం సభ తరువాత ఆ ఇద్దరూ స్పందిస్తున్న వైనం..! కలిసి తిప్పికొట్టే వ్యూహంతో ముందుకు..!

బీఆరెస్‌కు గతమే.. భవిష్యత్‌ లేదు..! కేసీఆర్‌కు ప్రాణం పోస్తే బానిసత్వాన్ని కొని తెచ్చుకున్నట్టే..! రేవంత్‌ వాదనలతో కొత్త చర్చ..!

బీజేపీ బిగ్ ఆపరేషన్.. ఆ మూడు కార్పొరేషన్లపై బీజేపీ గురి..?

ఓటుకు పదివేలిచ్చినా తీసుకోండి..! ఈసారి పొరపాటు చేయకుండా మనకే ఓటేయండి! కేసీఆర్‌ను ఓడగొట్టి తప్పు చేశారు..!

Big Stories

Advertisement
×