E-Paper
Advertisement

Telangana Politics: దానం, కడియం రాజీనామా? మళ్లీ పోటీ చెయ్యొచ్చా!

Telangana Politics: దానం, కడియం రాజీనామా? మళ్లీ పోటీ చెయ్యొచ్చా!

Telangana Politics: బీఆర్ఎస్ టికెట్‌తో గెలిచి కాంగ్రెస్‌కు జై కొట్టిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరయింపులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ ఆ పది మంది ఎమ్మెల్యేల విచారణ కూడా ప్రారంభించారు. అయితే పార్టీ ఫిరయించిన ఎమ్మెల్యే పై అనర్హత వేటు పడితే ఏమౌతుంది..? అనర్హత వేటు పడితే అభ్యర్థి ఎమ్మెల్యే గా మరోసారి ఉప ఎన్నికలో పోటీ చేయడానికి ఉంటుందా…? లేదా..? ఉంటే ఎప్పుడు ఉంటుంది..?? లేదా రాజీనామా చేయడం మేలా..??వీటన్నిటికీ సమాధానం అంతుపట్టక వారి అనుచరులు జుట్లు పీక్కుంటున్నారంట..

తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులు
తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పై పెద్ద చర్చే నడుస్తోంది. బీఆర్ఎస్ లో గెలిచి అధికార పార్టీలోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన టాపిక్ ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా?..లేదా ఎమ్మెల్యే సభ్యత్వానికి వారే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారా?..రాజీనామా చేస్తే ఉప ఎన్నికలో వీరే అభ్యర్థులుగా ఉంటారు.. మరి అనర్హత వేటు పడితే కూడా వీరికి పోటీ చేసే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలైంది.

స్పీకర్ పై సీరియస్‌గా రియాక్ట్ అయిన సుప్రీం కోర్టు
ఇప్పటికే స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌పై పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ల అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు సీరియస్‌గా రియాక్ట్ అయింది.. అక్టోబర్ 30లోపు స్పీకర్ నిర్ణయం స్పష్టం చేయాలని ఆదేశించింది. దాంతో పార్టీ ఫిరయించిన ఎమ్మెల్యేలకు నోటీసు లు ఇచ్చి స్పీకర్ విచారణ చేస్తున్నారు.. పార్టీ ఫిరయించిన 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది నోటీసు లకు రిప్లై ఇచ్చి విచారణకు హాజరైయ్యారు..ఈ నెల 20వ తేదీ వరకు 8 మంది ఎమ్మెల్యే ల విచారణ కూడా పూర్తి చేశారు..సుప్రీం గడువు అక్టోబర్ 30 తేదీ కే ముగియడం తో స్పీకర్ కార్యాలయం మరింత సమయం కావాలని సుప్రీం కోర్టు ఆశ్రయించడంతో.. సుప్రీం కోర్టు మరో 4 వారాల సమయం ఇస్తూనే స్పీకర్ కార్యాలయంపై కాస్త గరం అయ్యింది. పార్టీ మారిన వారు న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకుంటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.. ఆ క్రమంలో 10 మంది ఎమ్మెల్యేలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్‌ఘనపూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి నోటీసులకు రిప్లై ఇవ్వకపోవడంతో స్పీకర్ కార్యాలయం మరోసారి వారికి నోటీసులు ఇచ్చి ఈ నెల 23వ తేదీ వరకు తన ముందు వివరణతో ఉండాలని ఆదేశించింది.

నోటీసులు అందిన వెంటనే ఢిల్లీ వెళ్లిన దానం నాగేందర్
స్పీకర్ నోటీసులు అందిన వెంటనే దానం నాగేందర్ ఢిల్లీ వెళ్ళారు.. అనంతరం నేరుగా స్పీకర్ ని కలిసి తనకు మరింత సమయం కావాలని కోరారు.. ఇక కడియం శ్రీహరి స్పీకర్ ఇచ్చిన గడువు కంటే ముందు స్పీకర్ ని కలిసి మరింత సమయం కావాలని కోరడం జరిగింది.. వీరిద్దరి వినతికి స్పీకర్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యే లో దానం నాగేందర్ పార్టీ ఫిరయించి ఏకంగా కాంగ్రెస్ సింబల్ పై ఎంపీ గా పోటీ చేశారు.. కడియం శ్రీహరి ఎంపీ ఎన్నికలో కూతురు కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఎన్నికలో ప్రచారం చేశారు.

ఆ క్రమంలో తెలంగాణలో ప్రస్తుతం పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వివాదం పీక్స్ కు చేరింది. దీనిపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టు స్పీకర్ పై సీరియస్ అయ్యింది. మీరు చర్యలు తీసుకుంటారా..? లేదా తాము తీసుకొవాలా అని ప్రశ్నలు సంధించింది. ఇటీవల కడియం శ్రీహరి స్పీకర్ కు తనకు మరికొంత సమయం కావాలని గడువు కోరారు. తాజాగా.. దానం నాగేందర్ సైతం అనర్హత నోటీసులపై రియాక్ట్ కావడనికి సమయం కావాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు లేఖను రాయడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కడియం శ్రీహరిని టెక్నికల్ అంశాలతో వేటు నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దానం, కడియంలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?
అయితే.. దానం నాగేందర్ మాత్రం ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ నేతల్ని కలిశారని, పదవి హమీ కూడా తీసుకున్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. మరోవైపు ఖైరతాబాద్ పరిధిలో ఉపఎన్నిక ఖాయమని , అనర్హత బదులు తానే పదవికి రాజీనామా చేసేందుకు దానం నాగేందర్ రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. ప్రస్తుతం దానం నాగేందర్, కడియం శ్రీహరి ఎపిసోడ్ మాత్రం రాజకీయంగా రచ్చగా మారింది. మరోవైపు.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10మంది ఎమ్మెల్యేల్లో దానం, కడియంల పరిస్థితి కొంచెం వేరుగా ఉందని చెప్పుకొవచ్చు.దాంతో వీరి పై తప్పకుండా టు పడుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది..

Also Read: నెల్లూరు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం!

ఐతే పార్టీ ఫిరాయించిన అంశంపై అనర్హత వేటు పడితే..అనర్హత పడిన తర్వాత వచ్చే ఉపఎన్నికలో పోటీ చేయడానికి అవకాశం ఉండదు .. అదే అనర్హత వేటు పడకముందే వీరిద్దరూ రాజీనామా చేస్తే స్పీకర్ అమోదిస్తే వీరిద్దరూ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి అర్హులే.. మరి పార్టీ, ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది..దానం, కడియం ఆలోచన ఎలా ఉంది..అనే చర్చ రాజకీయ వర్గలో జోరుగా నడుస్తోంది. మరి ఇద్దరి పై అనర్హత పడుతుందా? అంతకంటే ముందే రాజీనామా చేస్తారా?? అసలు అనర్హత పడే అవకాశం ఉందా..లేదా? ఇవ్వనీ తెలియాలంటే మాత్రం ఇంకో 4 వరాలు వేచి చూడాల్సిందే.

Story By Apparao, Bigtv

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×