E-Paper
Advertisement

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ట్విస్ట్.. కవితకు చట్టపరమైన కొత్త చిక్కులు?

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ట్విస్ట్..  కవితకు చట్టపరమైన కొత్త చిక్కులు?

Delhi Liquor Policy Case:  మరోసారి తెరపైకి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆ కేసులో ఊరట లభించిన మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటు దిశగా వేగం పెంచారు. బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ దూకుడు పెంచుతున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్‌లోని కవిత నివాసానికి సీబీఐ అధికారులు చేరుకుని హైకోర్టు నోటీసులు అందజేశారు. కింది కోర్టు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. దాంతో కథ మళ్లీ మొదటి కొస్తుందేమో అని జాగృతి శ్రేణులు, కవిత అభిమానుల్లో టెన్షన్ మొదలైందంట.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల ఊరట లభించిందనుకున్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చట్టపరమైన చిక్కులు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేసులో కవిత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్‌ సిసోదియా సహా 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ క్రమంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఉన్న కవిత నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన తాజా నోటీసులను అందజేశారు. ఆ సమయంలో కవిత ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో.. నోటీసులను ఆమె భర్త అనిల్ కుమార్‌కు అందజేసి, ఆమె ఎక్కడ ఉన్నారనే వివరాలను ఆరా తీశారు. దీంతో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.

Also Read: Ration Rice: జోరుగా అక్రమ రేషన్ దందా? పేదల బియ్యం కర్ణాటకకు.. అధికారుల నిఘా ఎక్కడ?

సీబీఐ హైకోర్టులో సవాలు

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని, ‘సౌత్ గ్రూప్’ తరపున కవిత కీలక పాత్ర పోషించారనే ఆరోపణలతో దర్యాప్తు సంస్థలు విచారణ జరిపాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌లో సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని ఈ కేసు నుండి విముక్తి కల్పిస్తూ క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే, ఈ తీర్పును సీబీఐ హైకోర్టులో సవాలు చేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లైంది. మార్చి 15, 2024న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, సాయంత్రం వేళ ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. తొలుత ఈడీ కస్టడీలో, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేయడంతో కవిత సుమారు ఐదున్నర నెలల పాటు తిహార్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్న కవితకు.. సీబీఐ హైకోర్టును ఆశ్రయించడం కొత్త తలనొప్పిగా మారిందంట. ఛార్జిషీట్‌లో పేర్కొన్న ఆధారాలను మరోసారి పరిశీలించాలని, కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని సీబీఐ పట్టుబడుతోంది.

సీబీఐ నోటీసుల విషయంపై ఎక్స్ వేదికగా స్పందించిన కవిత 

కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో ఊరల లభించడంతో తన రాజకీయ భవిష్యత్తుపై కసరత్తు మొదలుపెట్టారు. కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన ఆమె ఆ పనిలో బిజీబిజీగా గడుపుతున్నారు. లిక్కర్ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వచ్చానన్న కవిత.. బీఆర్ఎస్ నేతలు తనపై కేసు సమయంలో అండగా నిలవలేదని మండిపడుతున్నారు. తనను లిక్కర్ రాణి అని విమర్శించడంపై గులాబీ నేతలపై విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలను కూడా గట్గిగానే టార్గెట్ చేస్తూ… సొంత పొలిటికల్ ప్లాట్ ఫాం నిర్మించుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ క్రమంలో సీబీఐ నోటీసుల విషయంపై ఎక్స్ వేదికగా స్పందించిన కల్వకుంట్ల కవిత .. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టేసిన విషయాన్ని ప్రస్తావించారు. కేసు కొట్టేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను సైతం ఎంక్వయిరీ చేయాలని సైతం రౌస్ అవెన్యూ కోర్టు కామెంట్ చేసిందని గుర్తు చేస్తున్నారు.

ఢిల్లీ హైకోర్టు తిరిగి నోటీసులు

అయినా రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు పై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిందని, ఈ కేసు విచారణ ఈనెల 16న ఉన్నదన్న విషయాన్బీ సీబీఐ అధికారులు స్వయంగా తెలియచేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై తమ లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తున్నామని, విచారణలో సంపూర్ణంగా అధికారులకు సహకరిస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితను కింది కోర్టు నిర్దోషిగా ప్రకటించినప్పుడు జాగృతి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అమె నెలల తరబడి జైలులో ఉండటంతో ఆ సెంటిమెంట్ కొత్తపార్టీకి ప్లస్ అవుతుందని భావించాయి. అయితే ఇప్పుడు కథ మొదటి కొచ్చినట్లు ఢిల్లీ హైకోర్టు తిరిగి నోటీసులు జారీ చేయడంతో ఆమె అభిమానులు టెన్షన్ పడుతున్నారంట. ఆ క్రమంలో ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.

 Story By Apparao, Big tv 

Also Read:Keerthy Suresh: కీర్తి సురేష్ కొత్త మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్లానింగ్ అదుర్స్! 

Tags

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×