BigTV English
Advertisement

Enquiry on Kaleshwaram: తేలనున్న కాళేశ్వరం కహానీ.. కమిటీ రూల్స్ ఇవే!

Enquiry on Kaleshwaram: తేలనున్న కాళేశ్వరం కహానీ.. కమిటీ రూల్స్ ఇవే!
Enquiry On Kaleshwaram
Enquiry On Kaleshwaram Project

Enquiry On Kaleshwaram Project: మేడిపండు మేడిగడ్డే కాదు.. కాళేశ్వరం అక్రమాల పుట్ట త్వరలో బద్ధలు కానుంది.. ఇప్పటికే జ్యుడీషియల్ ఎంక్వైరీకి రేవంత్ సర్కార్ ఆదేశించగా.. నేడో, రేపో రంగంలోకి దిగనుంది జ్యూడీషియల్ కమిటీ.. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఏం తేలనుంది? అసలు ఎంక్వైరీ కమిటీ ఏఏ ఇష్యూస్‌పై ఫోకస్ చేయనుంది. విన్నారుగా.. ఆరోజు నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి.. ఏదైతే అనౌన్స్ చేశారో.. ఇప్పుడా మాటను నిలబెట్టుకున్నారు.  ఇప్పటికే జ్యూడీషియల్ ఎంక్వైరీకి ఆదేశాలు రిలీజ్‌ చేశారు.


కాళేశ్వరం కథేంటో తేల్చేందుకు విచారణ కమిటీ చైర్మన్‌గా అపాయింట్ అయిన.. జస్టిస్ పినాకి చంద్రఘోష్‌ ఇప్పటికే రాష్ట్ర అధికారులకు తాను రంగంలోకి దిగబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్న పినాకి చంద్రఘోష్‌తో ఇరిగేషన్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా.. ఈఎన్సీ నాగేందర్​రావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ మీట్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్‌ను స్పీడప్‌ చేయాలని రిక్వెస్ట్ చేశారు. దీంతో ఆయన త్వరలోనే హైదరాబాద్‌కు వస్తానని హామీ ఇచ్చారని తెలుస్తోంది.  మరి ఎంక్వైరీలో జస్టిస్ పినాకి ఏఏ ఇష్యూస్‌పై ఫోకస్ చేయనున్నారు? దీనికి సంబంధించి గవర్నమెంట్‌ కొన్ని ఆర్డర్స్‌ ఇష్యూ చేసింది. మొత్తం సెవెన్ ఇష్యూస్‌పై ఫోకస్‌ చేయాలని కోరింది.

అవేంటంటే.. ఫస్ట్ పాయింట్.. మూడు బ్యారేజీల డిజైన్లు.. వాటి నిర్మాణాల్లో లోపాలు.. బ్యారేజీల ఆపరేషన్లలో అవకతవకలు.. సెకండ్ పాయింట్.. టెండర్ల ప్రాసెస్​దగ్గరి నుంచి స్టార్ట్ చేస్తే.. బ్యారేజీలను పూర్తి చేసినట్టుగా కాంట్రాక్టర్లకు కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన టైమ్​లైన్​ వరకు.. ఈ మధ్య ఎలాంటి అక్రమాలు జరిగాయి.. ఫైనాన్షియల్‌ డిసిప్లేన్ ఉందా? లేదా? అన్ని వెలికి తీయాలి.. థర్డ్ పాయింట్.. ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో నిర్లక్ష్యం కారణంగానే బ్యారేజీలు కుంగాయా? దీనికి ఏ డిపార్ట్‌మెంట్‌ బాధ్యత వహించాలి? ఫోర్త్ పాయింట్.. క్వాలిటీ కంట్రోల్​లో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం ఉందా? ఫిఫ్త్‌ పాయింట్.. రూల్స్‌కు విరుద్ధంగా పనులను పూర్తి చేయడానికి గడువు పొడిగించడం.. పని పూర్తి చేయకపోయినా పూర్తైనట్టు సర్టిఫికేట్లు తీసుకున్నారా? ముందుగానే బ్యాంక్‌ గ్యారెంటీలను విడుదల చేశారా? సిక్త్ పాయింట్.. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ఖజానాపై పడిన ఆర్థిక భారం వంటి వాటిపై సమగ్ర విచారణ.. సెవెన్త్‌ పాయింట్.. ఈ ఆరు అంశాలు కాకుండా.. ప్రభుత్వం ఇంకా ఏదైనా అంశంపై విచారణ కోరితే చేయాలి.. ఓవరాల్ గా అసలు కాళేశ్వరంలో అక్రమాలకు అసలు కారకులు ఎవరు..?


Also Read: లోక్ సభ ఎన్నికలు.. సౌత్ లో సత్తా చాటేదెవరు ?

ఈ వ్యవహారం కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత ఆర్థిక భారం పడింది? అనే దానిని కూడా వెలికి తీయాలని కోరింది తెలంగాణ సర్కార్. ఇలా ఆరు అంశాలపై విచారణ జరపాలని జస్టిస్‌ పినాకిని కోరింది తెలంగాణ సర్కార్.. అంతేకాదు వెంటనే ప్రారంభించి, జూన్​ 30 నాటికి నివేదిక ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేసింది.. అధికారులు విచారించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసేస్తోంది.  భవన్‌లోని ఎనిమిదో ఫ్లోర్‌లో ఆఫీసును ఏర్పాటు చేయబోతున్నారు. ఏఈ నుంచి సీఈల వరకు అధికారులు, ముగ్గురు లాయర్లను కూడా నియమించనున్నారు. జ్యుడీషియల్ విచారణ జరిగితే చాలా విషయాలు బయటికి వస్తాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే తమకేం సంబంధం లేదంటున్నారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నేతలు. ఇచ్చిన డిజైన్ల ప్రకారమే నిర్మించామని చెతులేత్తేస్తున్నాయి.  నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థలు.. L&T, అఫ్కాన్స్‌ సంస్థలైతే కుంగిన పిల్లర్లకు తమకు సంబంధం లేదని ప్రభుత్వానికి లెటర్లు కూడా రాసేశాయి.

రిపేర్లు చేయాలంటే మళ్లీ ఒప్పందం చేసుకోండి అని కుండబద్ధలు కోట్టేసింది L&T  జ్యుడీషియల్ ఎంక్వైరీలో కాంట్రాక్ట్‌ సంస్థల బండారం కూడా బయటపడే అవకాశం ఉంది.. ఏ సంస్థకు ఎంతెంత డబ్బులు వెళ్లాయి? ఎలా వెళ్లాయి? పనులు పూర్తి చేశాకే తీసుకున్నారా? లేక పెద్దల సాయంతో ముందే వసూలు చేశారా? దీని కోసం ఎవరి చేతులనైనా తడిపారా? ప్రాజెక్టు అంచనాల పెంపు లాజికల్‌గానే జరిగిందా? లేక ఎవరి జేబులో నింపేందుకు పన్నిన కుట్రనా? అసలు ప్రాజెక్టు కుంగుబాటుకు అసలు కారణాలేంటి? అనే విషయాలు వెలుగులోకి రానున్నాయి. కమిటీ విచారణకు జూన్‌ 30 వరకు డెడ్‌లైన్ విధించడం కూడా ఓ ప్లస్ పాయింటే అని చెప్పాలి.

Also Read: టార్గెట్ 14 ఎంపీ సీట్లు.. ఇదే రేవంత్ వ్యూహం..

ఆ లోపు కుల్లం కుల్లా కాళేశ్వరం కథేంటో తేలిపోనుంది. మరోవైపు NDSA కమిటీ విచారణ ఇప్పటికే తుది దశకు వచ్చేసింది. ఈ రిపోర్ట్ కూడా ఇప్పుడు జ్యుడీషియల్ ఎంక్వైరీలో కీలకం కానుంది.. ఎందుకంటే ఎక్స్‌పర్ట్‌ కమిటీ రిపోర్ట్‌ను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుటుంది. కాళేశ్వరం గుట్టేంటో తేల్చడానికి నాట్ ఓన్లీ జ్యుడీషియల్ ఎంక్వైరీ.. సీబీఐను కూడా రంగంలోకి దించాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి.. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిల్స్‌ వచ్చిపడుతున్నాయి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, బి.రామ్మోహన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి.. కోదండరాం రెడ్డి, ముదుగంటి విశ్వనాథ రెడ్డి, బక్క జడ్సన్‌‌.. పిల్స్ వేశారు.. అయితే హైకోర్టు మాత్రం.. నెక్ట్స్‌ హియరింగ్‌ను ఈ మంత్ 8th కి పోస్ట్ పోన్ చేసింది. మరి హైకోర్టు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. సీబీఐ కూడా రంగంలోకి దిగే చాన్స్ ఉంది.

Tags

Related News

Donald Trump: ఎవరీ జొహ్రాన్‌ మమ్దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Suicide Incidents: బతకండ్రా బాబూ! అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారమా?

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Big Stories

×