E-Paper
Advertisement

పార్టీ లైన్ దాటిన ఈటల.. సొంత ఇమేజ్ కోసమా? సొంత గూటి కోసమా?

పార్టీ లైన్ దాటిన ఈటల.. సొంత ఇమేజ్ కోసమా? సొంత గూటి కోసమా?
Advertisement

Etela Rajender: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఉద్యమ కాలం నాటి నుంచి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే, తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా బీజేపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ లైన్‌కు భిన్నంగా ఆయన మాట్లాడిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.

పార్టీ లైన్ వర్సెస్ ఈటల వాయిస్

Advertisement

బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద అవినీతి కూపమని, దీనివల్ల పైసా ఉపయోగం లేదని తెలంగాణ బీజేపీ మొదటి నుంచి గట్టిగా ప్రచారం చేస్తోంది. ఢిల్లీ పెద్దల నుంచి గల్లీ లీడర్ల వరకు ఇదే మాటను నమ్ముతున్నారు. కానీ, ఈటల రాజేందర్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. కాళేశ్వరం వల్ల తెలంగాణకు కొంత మేలు జరిగిందనే కోణంలో ఆయన మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకే అంశంపై పార్టీకి, కీలక నేతకు మధ్య పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించడంతో క్షేత్రస్థాయిలో కమలం కార్యకర్తలు తీవ్ర అయోమయంలో పడ్డారు.

Also Read: అయోధ్య హుండీ లెక్కింపు సిబ్బంది రాజీనామా.. వెలుగులోకి సంచలన విషయాలు!

Advertisement

సొంత ఇమేజ్ కోసమేనా?

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈటల పూర్తిగా బీజేపీ రంగును పులుముకోవడానికి ఇష్టపడట్లేదు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా తనకున్న పాత ఇమేజ్‌ను కాపాడుకోవడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ‘తెలంగాణ ఫస్ట్… తర్వాతే పార్టీ’ అనే నినాదాన్ని ఆయన ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీలో చేరినప్పటి నుంచి తనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత, గౌరవం దక్కలేదనే అసంతృప్తి ఈటలలో ఎప్పటి నుంచో ఉందనేది బహిరంగ రహస్యం.

భవిష్యత్తు వ్యూహం ఏంటి?

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. ఈటల తన భవిష్యత్తు కోసం కొత్త వ్యూహాలకు తెరలేపుతున్నారా అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో ఆయన నోట కాళేశ్వరంపై సానుకూల మాటలు రావడంతో.. ఆయన మళ్లీ గులాబీ గూటికి చేరతారా? లేక కొత్త దారి వెతుక్కుంటారా? అనే చర్చ జోరందుకుంది.

మరి ఈటల పాడిన ఈ సరికొత్త రాగంపై ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో, ఈ పరిణామాలు ఆయన్ను ఏ తీరానికి చేరుస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.

Also Read: వియత్నాం బోటు ప్రమాదంలో ఏపీ పర్యాటకులు.. రంగంలోకి దిగిన నారా లోకేష్!

Related News

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

Big Stories

Advertisement
×