E-Paper
Advertisement

ఎవరా టాలీవుడ్ హీరో? డీఎస్పీ భీమ్‌రెడ్డి డైరీలో దొరికిన ‘రూ.3 కోట్ల’ సీక్రెట్ డీల్!

ఎవరా టాలీవుడ్ హీరో? డీఎస్పీ భీమ్‌రెడ్డి డైరీలో దొరికిన ‘రూ.3 కోట్ల’ సీక్రెట్ డీల్!
Advertisement

Bheem Reddy: ఏసీబీ రిమాండ్ రిపోర్టులో డీఎస్పీ భీమ్‌రెడ్డికి సంబంధించిన షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. ఫ్యామిలీ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ హీరోతో… మణికొండలోని ఓ విలువైన ఆస్తి కొనుగోలు కోసం భీమ్‌రెడ్డి డీల్ కుదుర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం దాదాపు 3 కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా కూడా ఇచ్చారట. ఈ లావాదేవీల వివరాలన్నీ భీమ్‌రెడ్డి తన పర్సనల్ డైరీలో రాసి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ డైరీనే ఏసీబీకి కీలక ఆధారంగా మారింది.

ముక్కున వేలేసుకున్న అధికారులు

Advertisement

అంతేకాదు… ఆస్తుల విషయంలో భీమ్‌రెడ్డి ఎంత పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించాడో చూసి అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. బినామీల పేర్లపై ఆస్తులు కొనే ముందే, అవసరమైతే వాటిని వెనక్కి తీసుకునేలా ‘క్యాన్సిలేషన్ డీడ్లపై’ ముందే సంతకాలు చేయించుకున్నాడు. ఇలాంటివి దాదాపు 30కి పైగా డాక్యుమెంట్లు ఆయన ఇంట్లో దొరకడం సంచలనం రేపుతోంది.

కమర్షియల్ ప్రాజెక్టుల వెనుక భీమ్‌రెడ్డి హస్తం..?

Advertisement

ఇక మణికొండ మర్రిచెట్టు జంక్షన్ దగ్గర కడుతున్న భారీ కమర్షియల్ ప్రాజెక్టుల వెనుక కూడా భీమ్‌రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖ నిషేధిత జాబితాలో పెట్టిన భూముల్లో… ఎలాంటి పర్మిషన్లు లేకుండానే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన రెండు పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించినట్లు తెలుస్తోంది. భీమ్‌రెడ్డి అండ చూసుకునే సదరు బిల్డర్.. ప్రీ లాంచ్ పేరుతో జనం నుంచి ఏకంగా 800 కోట్ల రూపాయలు వసూలు చేశాడనే ప్రచారం జరుగుతోంది. ఆ బిల్డింగ్స్‌లోనే భీమ్‌రెడ్డి పేరుతో 500 చదరపు అడుగుల స్థలం ఉన్నట్లు ఏసీబీ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.

కేసును సీరియస్‌గా తీసుకున్న ఏసీబీ అధికారులు

మొత్తానికి ఈ కేసు… కేవలం ఒక డీఎస్పీ అక్రమాస్తుల దగ్గరే ఆగిపోలేదు. సినీ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ మాఫియా, బినామీ లావాదేవీల వరకు దీని నెట్‌వర్క్ విస్తరించినట్లు స్పష్టమవుతోంది. దీంతో ఏసీబీ అధికారులు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెంతమంది పెద్దల పేర్లు బయటకు వస్తాయో? ఈ అవినీతి సామ్రాజ్యం ఇంకెంత పెద్దదో చూడాలి.

Related News

ప్లానింగ్‌ లోపం.. జంతర్‌మంతర్‌ 2.0 విఫలం! ప్రచారార్బాటాలకే పరిమితమైన సీజేపీ.. కేంద్రం అలర్ట్‌గా ఉందని తెలిసినా.. తిప్పికొట్టే వ్యూహంలో ఫెయిల్‌..!

కొత్త పార్టీతో తొలి ఎన్నికను ఎదుర్కొనేందుకు రెడీ అయిన కవిత! తొలి ప్రయత్నంలోనే హేమాహేమీలతో ఢీ అంటే ఢీ..! ఏమిటా వ్యూహం..?

ఎండాకాలంలో కనిపించే ఆలయం.. ఈసారి అక్టోబర్‌లోనే దర్శనం.. దేనికి సంకేతం?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. ఆరు వారాల్లో నోటిఫికేషన్‌!

వరి రైతు నోటికాడి ధరను కొల్లగొట్టిన మిల్లర్‌ గద్దలు! ఎంఎస్‌పీ కన్నా వెయ్యి అదనంగా చెల్లిస్తున్న వ్యాపారులకు ధమ్కీ! ఎలా కొంటారని బెదిరించిన మిల్లర్ల అసోసియేషన్‌..!

రాబోయే ఎన్నికలపై.. సీఎం రేవంత్ వేసిన బిగ్ పొలిటికల్ ప్లాన్ ఇదే!

కేసీఆర్‌ ఉన్నప్పుడే గౌరమ్మా..! బతుకంతా పచ్చగ ఉండే గౌరమ్మా..! రెండు పాటలను విడుదల చేసిన బీఆరెస్‌ పార్టీ..!

చంద్రుడిపై ఐదు మెరుపులు.. ఆర్టెమిస్-2 వ్యోమగాములు గుర్తించిన వింత ఏంటి?

Big Stories

Advertisement
×