E-Paper
Advertisement

ఫ్రీ బస్సుపై దుష్ప్రచారం..అది మహిళలపై కోపమా? సర్కార్‌ను బద్నాం చేసే వ్యూహమా? బండి కనకయ్య మాటలతో తొండి వాదన!

ఫ్రీ బస్సుపై దుష్ప్రచారం..అది మహిళలపై కోపమా? సర్కార్‌ను బద్నాం చేసే వ్యూహమా? బండి కనకయ్య మాటలతో తొండి వాదన!
Advertisement

బండి కనకయ్య ఇంట్లోని భార్యభర్తల గొడవ అది. మొగుడి మీద అలిగి ఆమె ఏటో వెళ్లిపోయింది. ఈ ఫ్రీ బస్సుల కారణంగానే ఆమె చెప్పుకుండా ఎటెటో తిరుగుతున్నదని, ఆమెను వెతకడానికి తనకు 2వేల రూపాయల వరకు ఖర్చయ్యిందని అతగాడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వద్ద మొరపెట్టుకున్నాడు.

‘ఈ ఫ్రీ బస్సు పథకం ఎత్తేయండి సార్‌..’ అని పనిలోపనిగా ఆ ఎమ్మెల్యేకు ఉచిత సలహా కూడా ఇచ్చేశాడు. ఇది జరిగింది సిద్దిపేటలోని ఓ కార్యక్రమంలో. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో తెగ తిప్పేస్తున్నారు. ఆ బండి కనకయ్య చెప్పింది అక్షరాల నిజమేనన్నట్టు.. ఆ ఉచిత సలహా మేమే ఇవ్వాలనుకున్నామనే విధంగా.. ఇది అనవసర పథకమైనట్టు.. ‘దీన్ని ఎత్తేయండి సార్‌..’ అని వీరు కూడా ప్రభుత్వానికి సలహాలిచ్చినట్టుగా కామెంట్లు కూడా జోడిస్తున్నారు.

Advertisement

ఈ వీడియోను షేర్‌ చేసి.. వైరల్ చేయాలనుకోవడమే.. ఈ పథకం పట్ల వారికున్న నెగిటివిటీకి నిదర్శనమనుకోవాలి. మహిళలకు అనవసరంగా ఈ పథకం పెట్టారనే కోణంలో కూడా మరికొందరు స్పందిస్తున్నారు. వాస్తవానికి, ఓ బండి కనకయ్య తన సంసారంలో తలెత్తిన చిక్కులను ఈ ఫ్రీ బస్సు పథకంతో ముడిపెట్టడమే సరైంది కాదు. తన అసహాయతను, తన భార్య మీద కోపాన్ని అలా ఆ వేదికగా  ప్రదర్శించాడుకుందాం.. ఆ ఒక్కడి అభిప్రాయాన్ని క్రోడీకరించి.. ‘మహిళలంతా కలిసి ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.. అనవసరంగా తిరుగుతున్నారు. సంసారాలను చెడగొట్టుకుంటున్నారు.. భర్తలపై అలిగి బస్సెక్కి పోతున్నారు..!’ అని అర్థం వచ్చేలా ఈ వీడియోను షేర్‌ చేయడం.. ఓ రకంగా పైశాచికానందం పొందడమే అవుతుంది.

ప్రతిపక్ష బీఆరెస్‌ పార్టీ కూడా ఈ పథకం పై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసింది. కానీ అసలే స్పందన రాలేదు. కేటీఆర్‌ కూడా తలతిక్కగా మాట్లాడాడు మహిళల పట్ల. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కేటీఆర్‌ చెంపలేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఈ పథకంపై బురద జల్లేందుకు సమయం వచ్చినప్పుడల్లా రెడీగా ఉంది బీఆరెస్‌. కానీ వాస్తవాలు తెలుసుకుని, ప్రాక్టికల్‌గా ఆలోచించేంత సీన్‌ ఆ పార్టీకి లేదని తెలిసిపోయింది.

Advertisement

ఈ ఫ్రీ బస్సు పథకం పేద, మధ్యతరగతి మహిళలకు ఎంతో బాసటగా ఉంటుంది. ఆ కుటుంబాల బడ్జెట్‌కు ఈ పథకం ఊతంగా నిలబడుతోంది. పనులకు వెళ్లే కూలీలు, చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుని బతికే మహిళలు, దూర ప్రాంతాలకు వెళ్లే వారికి..  ఆర్థికంగా  అండగా ఉంటున్నది. మహిళలకు ఆ చార్జీల పైసలు మిగిలితే.. వాటిని ఆ కుటుంబానికే ఉపయోగిస్తారు.

అంతిమంగా ఈ పథకం వల్ల ఆ కుటుంబానికి పరోక్ష ఆర్థిక భరోసా ఇస్తుందనే చెప్పాలి. ఎవరో ఏదో అన్నారని, మహిళలు పనీ పాటా లేకుండా తిరుగుతున్నారనే కామెంట్స్‌.. పురుషాధిక్య భావజాలానికి, పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక స్థితిపై అవగాహనలేని తనానికి, గుడ్డిగా కాంగ్రెస్‌ సర్కార్‌ను వ్యతిరేకించే విధానానికే అద్దం పడుతుంది.

మిగిలిన పథకాలన్నీ ఒకెత్తయితే.. ఈ ఒక్క పథకమే ఒక ఎత్తుగా సర్కార్‌కు మంచి పేరు తెచ్చిపెడతుందనడంలో అతిశయోక్తి లేదు. బీఆర్‌ఎస్‌ తన మ్యానిఫెస్టోలో ఈ ఫ్రీ బస్సు పథకాన్ని పెట్టకుండా ఎన్నికలకు పోగలదా? దీనికి ఆన్సర్ ఇస్తారా? రానున్న రోజుల్లో దీన్ని పిచ్చిగా వ్యతిరేకించిన పురుష రాజాలే చూస్తారు ఆ పార్టీ స్టాండ్‌ను.

Tags

Related News

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తప్పుడు సంకేతాలా? ఆ మంత్రుల పరపతికి పరోక్షంగా దెబ్బకొట్టే యత్నమా? బీఆరెస్‌ వ్యూహంలో భాగంగానే సురేఖ సారీ పాచికా?

కేంద్ర కరువు సాయం ప్యాకేజీపై పెదవి విరుపేనా? నాడు కేసీఆర్‌కు చేదు అనుభవం..! ఇప్పుడు 20వేల కరువు ప్యాకేజీలో ఎంతిస్తారో?

రాజీవ్‌ను సోనియా వద్దన్నారు! సోనియాను రాహుల్‌ వద్దన్నారు! ‘బిలాంగింగ్‌ .. ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ బుక్‌ నేపథ్యంలో కొత్త చర్చ!

దేశ రాజకీయాల్లో మళ్లీ బిఆర్‌ఎస్‌ ఎంట్రీ.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

ఇలాంటి స్పూర్తే మీ నుంచి కోరుకునేది అధ్యక్షా! జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన పీసీసీ చీఫ్‌ మెరుపు ధర్నా!

కాళేశ్వరం ఉంటే.. మళ్లీ తుమ్మిడిహట్టి ఎందుకు? వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

రజినీకాంత్ వదిలేసిన కల.. అల్లుడు ధనుష్ నిజం చేయబోతున్నారా?

Big Stories

Advertisement
×