YS Jagan: రప్పా.. రప్పా.. డైలాగ్‌పై పేటెంట్ తీసుకున్నట్లు దాన్నే స్లోగన్‌గా మార్చేసుకుంటున్నారు వైసీపీ నేతలు … జగన్ సైతం ఆ డైలాగ్ వాడకాన్ని సమర్ధించడంతో ఆయనతో వీరతాళ్లు వేయించుకోవడానికి ఎవరికి వారు ఆ పుష్ఫ డైలాగ్ తెగ రిపీట్ చేస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు వరకు ఆ డైలాగ్ వాడుతూ కార్యకర్తలను రెచ్చ గొడుతూ.. పోలీసులకు వార్నింగులిస్తున్నారు. అసలు వైసీపీ నేతల సినీ స్టైల్ మాస్ పాలిటిక్స్ వెనుక వ్యూహమేంటి? ప్రజల్లో ఉనికి కాపాడుకోవడానికి పాట్లా? క్యాడర్‌ను కాపాడుకోవడానికి ఇదే రూటు అనుకుంటున్నారా?
కృష్ణా జిల్లా వైసీపీ సమావేశాల్లో మాజీ మంత్రి దూకుడు
కృష్ణా జిల్లాలో బాబు షూరిటీ మోసం కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ మంత్రి పేర్ని నాని రప్పా.. రప్పా.. డైలాగ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు.. మీరు కూడా రప్పా.. రప్పా.. అంటున్నారు. ఏదైన పని చేయాలంటే రప్పా రప్పా అనటం కాదు.. చీకట్లో కన్ను కొడితే పనై పోవాలంటున్న పేర్ని నాని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. మూడు నాలుగు రోజులుగా పేర్ని నాని ఎక్కడకు వెళ్లిన అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు.
కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్‌రెడ్డి వార్నింగులు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైసీపీ కార్యకర్తల విసృత సమావేశంలో మాజీ ఎమ్ఎల్‌ఎ కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి అదే సినిమా స్టైల్లో డైలాగులు వల్లవేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరచకాలు సృష్టిస్తున్నారని కూటమి నాయకులకు వత్తసుపలుకుతున్న అధికారలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని భారీ వార్నింగ్ ఇచ్చారు. 2.0 వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ నాయకుల బ్రతుకులు ఎలా ఉంటాయో చూస్తాం కొడకాల్లారా.. అని చెలరేగిపోయారు ఓబుల్ రెడ్డి.
ఆదిమూలపు సురేష్‌కు రప్పా.. రప్పా.. పూనకం
మరోవైపు దూకుడు రాజాకీయాలకు దూరంగా ఉండే వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్ సైతం రప్పా.. రప్పా.. పూనకం రావడం విశేషం. ప్రకాశం జిల్లా కొండెటీ వైసీపీ ఇన్‌ఛార్జ్ ఆదిమూలపు సురేష్ పార్టీ సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలను రెచ్చగోడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి కొండేపీ నియోజకవర్గంలో మరో లెక్క అంటూ కార్యకర్తలను ఉద్దేషించి అయిన మాట్లాడి కాంట్రవర్సిలో ఇరుక్కున్నారు.
సిఐని జైల్లో పెట్టించి, ఊచలు లెక్క పెట్టిస్తామని హెచ్చరిక
అంభేద్కర్ కొనసిమా జిల్లా అమలాపురంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అదే మంత్రం ఎత్తుకున్నారు. ఆప్లోలో రూరల్ సీఐ ప్రశాంత్ కూమార్ పై అనుచిత వ్యాఖ్యాలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తిన అయిన రాబోయేది వైసీపీ ప్రభుత్వం అని సీఐని జైల్లో పెట్టించి ఊచలు లెక్కపెట్టేస్తానని హెచ్చరించారు.
Also Read: నడిగూడెంలో కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ఒకవైపు కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేప పతకాలు ఎంత వరకు అమలు జరిగాయో తెలుసుకుని అర్హత కలిగి ఉన్నప్పటికి సంక్షేమ పతకాల లబ్ది పొందలేని వారికి సంక్షేమ పతకాలు అములు చేసేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్ఎల్ఎ, మంత్రులు వాడ వాడకు.. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పతకాల అమలుతో పాటు స్థానిక సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. గెలిచిన తర్వాత ఏసీ గదులకు సొంత కార్యాలయాలకు, దూరపు నగరాలకు పరిమితమయిన నేతలు ప్రజల్లోకి వెళ్లటం మొదలు పెట్టారు.
విద్రోహ దినంతో వైసీపీకి దక్కని ఆశించిన ఫలితం
దీంతో ప్రజల్లో కూటమి నేతలకు మంచి ఆధారణ లభిస్తుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక అమలు చేస్తున్న సంక్షేమ పతకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు రాబోయే నాలుగు సంవత్సరాలు చేయబోయే కార్యక్రమాలను నేతలు జనానికి వివరిస్తున్నారు. స్థానిక సమస్యలను కూడా నేతలు తెలుసుకుని అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో ప్రజల్లో మంచి ఆధారణ లభిస్తోందట. అది గమనించిన వైసీపీ అధిష్టానం టీడీపీ మ్యానుపేస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ పతకాలను అమలు చేయలేదని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించింది. దీంతో విద్రోహ దినం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆశించిన ఫలితం రాలేదు.
Story By Rami Reddy, Bigtv