Crime News: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు వరుస బలవన్మరణాలు ఆగడం లేదు. చిన్న చిన్న విషయాలకే మరణం వరకు వెళుతున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. నిన్న సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని తనూషా మహాలక్ష్మి ఉరేసుకొని బలవన్మరానికి పాల్పడింది.
Also Read: కూటమిలో కోట్లాట.. రాయుడు హత్య వివాదంలో బొజ్జల?
మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన తనూషాను చూసేందుకు సోమావారం సాయంత్రం తన తండ్రి పాఠశాలకు వచ్చాడు. ఇంతలోనే ఆమె ఎవరు లేని సమయంలో రాత్రి 11 గంటలకు హాస్టల్ గది నుండి కింద క్లాస్ రూమ్‌కి వచ్చి ఫ్యాన్‌కు చున్నీ కట్టి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థులు పాఠశాల సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తనూషా రీడింగ్ హాల్‌లొనే చదివినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. అందరితో ఆనందంగా ఉండే తనూషా మృతో తోటి విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఆమె తండ్రి వచ్చాకే.. ఆమె హ్యతకు పాల్పడటంతో తండ్రికి, కూతురికి ఏమైనా వివాదం అయ్యిందా? లేదంటే ఇంకా ఏదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.