BigTV English

Ganta Vs Vishnu: భగ్గుమన్న విభేదాలు.. గంటా VS విష్ణు

Ganta Vs Vishnu: భగ్గుమన్న విభేదాలు.. గంటా VS విష్ణు

Ganta Vs Vishnu: విశాఖ జిల్లాలో భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజుల ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. కూటమి పార్టీలకు చెందిన ఆ సీనియర్ల మధ్య నేరుగా వైరం లేదు. అలా అని ఇద్దరి మధ్య సఖ్యత, స్నేహం కూడా లేదు. చుట్టూ ఇతర శాసనసభ్యులు, రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు ఉన్నారన్న విషయం కూడా పట్టించుకోకుండా విష్ణుకుమార్‌రాజుపై గంటా బహిరంగంగా ఫైర్ అవ్వడం, దాదాపు వార్నింగ్ ఇచ్చినంత పని చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఇంతకీ ఆ మాజీ మంత్రికి, ఎమ్మెల్యేకి మధ్య గొడవకు కారణం ఏంటి?… వార్నింగ్ ఇచ్చుకునేంతలా ఏం జరిగింది?


విష్ణుకుమార్‌రాజుపై ఫైర్ అయిన గంట శ్రీనివాసరావు

నా నియోజకవర్గంలో మీ జోక్యం ఏంటి, నాకు తెలియకుండా కలెక్టర్ కు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటి… ఇంకోసారి ఇలా చేస్తే పద్ధతిగా ఉండదు… మీ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే ఊరుకుంటారా ..అంటూ సూటిగా స్వీట్‌గా విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజుకు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు…


అందరూ చూస్తుండగానే చిర్రుబుర్రలాడిన గంట

ఈ వార్నింగ్ ఏదో నాలుగు గోడల మధ్య జరిగిన సమావేశంలో ఇచ్చింది కాదు… మీడియా సమక్షంలో ఇతర రాజకీయ నాయకులు, సామాన్య కార్యకర్తలు చూస్తుండగానే గంటా ఫైర్ అయ్యారు. తాజాగా విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ అవిశ్వాసం తీర్మానానికి సంబంధించిన సమావేశం శనివారం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడానికి వచ్చిన కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పార్టీ అనుచరులు చూస్తుండగానే విష్ణుకుమార్‌రాజుపై గంటా ఫైర్ అయ్యారు.

విశాఖ ఫిలిం నగర్ క్లబ్ లీజుపై కలెక్టర్‌కు విష్ణు ఫిర్యాదు

విశాఖ ఫిలిం నగర్ క్లబ్ లీజు వ్యవహారానికి సంబంధించి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కలెక్టర్ కు ఫిర్యాదు చేయడమే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఫిలింనగర్ క్లబ్ లీజు వ్యవహారంపై విశాఖ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు… విశాఖ ఫిలింనగర్ క్లబ్ ఉన్నదేమో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో… తనకుతెలియకుండా విష్ణుకుమార్‌రాజు క్లబ్ లీజ్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారన్న విషయం తెలియడంతో గంటా ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు…

తన సెగ్మెంట్లో జోక్యం చేసుకోవడంపై గంట ఆగ్రహం

తోటి ప్రజా ప్రతినిధులు, సామాన్య ప్రజలు చూస్తుండగానే జీవీఎంసీ ముందు కారులో కూర్చుని, కాలు కింద కూడా పెట్టకుండా గంటా శ్రీనివాసరావు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడానికి మీరు ఎవరు? మీ నియోజకవర్గానికి వస్తే ఊరుకుంటారా… అసలు నాకు తెలియకుండా కలెక్టర్ కు ఫిలింనగర్ క్లబ్ మీద ఫిర్యాదు చేయడానికి మీరెవరు.?.. ఇంకోసారి ఇలా చేస్తే సహించేది లేదు అంటూ మీడియా కెమెరాల ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు…

తడబడుతూ సమాదాయించే ప్రయత్నం చేసిన బీజేపీ ఎమ్మెల్యే

గంటా శ్రీనివాసరావు గట్టిగా మాట్లాడుతుంటే విష్ణుకుమార్ రాజు మాత్రం నెమ్మదిగా సమాధానం ఇస్తూ తడబడాల్సి వచ్చింది. ఫిర్యాదు చేసిన సమయంలో మీరు అందుబాటులో లేకపోవడం వల్లే చెప్పలేదని గంటాని సముదాయించే ప్రయత్నం చేశారు… గంటా శ్రీనివాసరావు సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నట్లు మాట్లాడుతుంటే విష్ణుకుమారరాజు ఆయన కారు దగ్గర నుంచుని తడబడుతూ సమాధానం చెప్పడం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్ గా మారింది

విశాఖ నార్త్‌లో విష్ణు దూకుడుకు గంటా బ్రేకులు వేస్తున్నారని ప్రచారం

గంటా గట్టిగా మాట్లాడుతూంటే విష్ణు నెమ్మదిగా మాట్లాడుతుండడం… క్షణాల్లో అదంతా మీడియాలో రావడం, వైరల్ అవ్వడం చకచకా జరిగిపోయాయి …. సాటి ఎమ్మెల్యే మీద రోడ్డు మీద గంటా ఈ విధంగా వ్యవహరించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు… ఇక సాటి నాయకులు గంటాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన ఆగకుండా కారులో వెళ్ళిపోయారు. అసలు ఎందుకు అలా గంటా ఆవేశపడ్డారు, ఎందుకు విష్ణు మీద ఘాటు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది చర్చనీయాంశంగా మారింది… ఫిల్మ్ నగర్ క్లబ్ విషయంలో ఎందుకు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ పడి ఆసక్తి చూపుతున్నారన్నది మరో చర్చకు దారితీస్తుంది… ముఖ్యంగా విశాఖ నార్త్‌లో విష్ణు దూకుడుకు గంటా బ్రేకులు వేస్తున్నారు అన్న పుకారులు షికారు చేస్తున తరుణంలో.. విష్ణు మీద గంటా ఫైర్ అవ్వడం అగ్గికి అజ్యం పోసినట్లైంది

2019లో విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచిన గంట

ఈ వ్యవహారంతో కూటమి ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదనే చర్చ స్టార్ట్ అయింది… 2019లో విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు గెలిచారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో గంటాకు సొంత క్యాడర్ ఉంది. అయితే 2024లో గంటా ఉత్తర నియోజకవర్గం నుంచి భీమిలీకి షిఫ్ట్ అయ్యారు.. పొత్తులో భాగంగా ఉత్తరం సీటు బీజేపీ ఇవ్వడంతో విష్ణుకుమార్‌ రాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. విష్ణు నియోజకవర్గం వ్యవహారాల్లో గంటా అనుచరులు జోక్యం చేసుకుంటున్నారనే టాక్ నడుస్తుంది.. దానికి బదులుగా గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో విష్ణు వేలు పెట్టారంటున్నారు

క్లబ్ వ్యవహారాలపై అసెంబ్లీలో ప్రస్తావించిన విష్ణు

ఫిలిం నగర్ క్లబ్‌లో జరిగిన అవినీతి అక్రమాలు, లీజు వ్యవహారాలతో పాటు ఈ మధ్య కాలంలో చర్చకు దారి తీసిన రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంఫై బిజెపి ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఈ మధ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఫిలిం నగర్ క్లబ్ ప్రక్షాళనతో పాటు రామానాయుడు స్టూడియో భూములను వెనక్కి తీసుకోవాలని ప్రతిపాదించారు. అదే గంటా శ్రీనివాసరావు ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తుంది.. గంటా శ్రీనివాసరావుకు సినీ పరిశ్రమతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి . సినీ నిర్మాత కూడా అయిన ఆయన తన కొడుకును హీరోగా కూడా పరిచయం చేశారు..

అలాగే చిరంజీవి కుటుంబంతో గంటా శ్రీనివాసుకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి… సినీ పరిశ్రమతో ఇంత దగ్గర సంబంధాలు ఉన్న గంటా శ్రీనివాసరావుకు తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఫిలింనగర్ క్లబ్ పై, రామానాయుడు స్టూడియో భూములపై విష్ణుకుమార్‌రాజు ప్రభుత్వానికి, అధికారులకు ఫిర్యాదులు చేయడం నచ్చకపోవడం వల్లే అంత సీరియస్ అయ్యారంట … ఆ భూములు వ్యవహారంపై విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో మాట్లాడిన సమయంలో గంట సైలెంట్ గా ఉండిపోవడం గమనార్హం

అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నప్పుడు సైలెంట్‌గా ఉండిపోయిన గంటా

అదలా ఉంటే కూటమి ఎమ్మెల్యేలు ఇలా తమ విభేదాలను బమహిర్గం చేసుకోవడంపై ఇప్పుడు చర్చ సాగుతోంది….ఏమైనా ఉంటే నాలుగు గోడల మధ్య చర్చించుకుంటే పోయేది కదా అంటున్నారు. ఈ విధంగా రచ్చకెక్కడం వల్ల కార్యకర్తల మధ్య కూడా అపోహలకు దారి తీస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఇలా అంతర్గత అంశాలను ప్రజాప్రతినిధులు రోడ్డుపైకి తీసుకువస్తే ..కూటమిలో లుకలుకలు ఉన్నాయన్న సంగతి కూడా అందరికీ చెప్పినట్లు అవుతుందని అంటున్నారు. ఇప్పటికే కూటమిలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని వైసీపీ ప్రచారం చేస్తోంది.

Also Read: వైసీపీలో టెన్షన్ టెన్షన్.. నెక్స్ట్ ఎవరు ?

కూటమిలో అంతర్గత కుమ్ములాటలపై వైసీపీ ప్రచార

ఒక వైపు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ళ పాటు కూటమి కలిసి ఉండి అధికారంలో కొనసాగుతుందని ప్రకటనలు చేస్తున్నారు. కానీ విశాఖలో పరిస్థితి చూస్తే అలా లేదని అంటున్నారు .ఈ విధంగా వివాదాలు పెంచుకుంటూ పోతే కూటమి ఇబ్బందులలో పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ కలిసి కూర్చుని కూటమిలో ఐక్యతకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు సూచిస్తున్నాయి

Related News

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

Big Stories

×