Pahalgam Terror Attack : భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ లో ఎన్నో అందమైన ప్రాంతాలు ఉన్నాయి. టూరిస్ట్ లను ఎక్కువగా ఆకట్టుకునే ప్రాంతాలలో పహల్గామ్ ఒకటి.. భారత్ సింగపూర్ అని ఈ ప్రాంతానికి మరో పేరు ఉంది. పచ్చని చెట్లపై మంచు దుప్పటి వేసుకున్నట్లు ఎంతో అందంగా కనిపించే ఈ ప్రాంతం ఈ మధ్య రక్తంతో తడిసి ముద్దయింది. ఈనెల 22న ఆ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. దాదాపు 26 మంది అమాయకులు ఉగ్రవాదుల దాడికి బలయ్యారు. ఈ దారుణ దాడితో యావత్ భారత్ లోకం ఉలిక్కిపడింది. ఎంతోమంది కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులను వెంటనే ఉరితీయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇండియన్ సింగర్ భారత ప్రభుత్వానికి వ్యవతిరేఖంగా విమర్శలు చేసింది. తాజాగా ఆ సింగర్ పై కేసు నమోదు అయ్యింది. ఇంతకీ ఆ సింగర్ ఎవరు? ఆ చేసిన విమర్శలు ఏంటి అన్నది ఒకసారి తెలుసుకుందాం..
ఇండియన్ సింగర్ నేహా సింగ్ పై కేసు నమోదు..
ఇటీవల పహల్గామలో జరిగిన ఉగ్రదాడిపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.. సోషల్ మీడియా ఖాతా ద్వారా టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ తాజాగా భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్ మాత్రం ఉగ్రవాదులు దాడి చేయడానికి కారణం మన ప్రభుత్వమే అని విమర్శలు చేసింది. ఉగ్రదాడిలో ఇంటెలిజెన్స్ మరియు భద్రతా వైఫల్యం కారణంగా మోడీ ప్రభుత్వంపై దాడి చేస్తూ సోషల్ మీడియాలో “అభ్యంతరకరమైన” పోస్ట్ చేసింది. ఆ పోస్టు కాస్త వైరల్ అవ్వడంతో ఆమెపై కేసు నమోదు అయింది.
2019 పులావామా ఉగ్రదాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించిన తర్వాత, పహల్గామ్ దాడి పేరుతో పిఎం మోడీ ఇప్పుడు బీహార్‌లో ఓట్లు అడుగుతున్నారని ఆమె పేర్కొన్న వీడియోను పాకిస్థానీ జర్నలిస్టుల బృందం నడుపుతున్న ఎక్స్ హ్యాండిల్ రీపోస్ట్ చేయడంతో నేహాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది.. గతంలో ఈమె ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది.. అంటే ఈమెకు వివాదాలు కొత్తేమి కాదు.
Also Read :పద్మభూషణ్ బాలయ్య… ఈ రోజు నందమూరి ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చే డే..
నేహా తన X ఖాతాలో మతం, కులం పేరుతో ప్రజల మధ్య వివాదాలు ప్రేరేపించాలే ఉన్నాయని, అమాయకుల ప్రాణాలపై ఈమెకు కనీసం జాలి దయ కూడా లేదని ఈమెపై ఎఫ్ఐఆర్ నమోదయింది.. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పోస్ట్ లు విమర్శలకు దారి తీస్తున్నాయని ఆమె పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుల్వామా దాడి తర్వాత మాదిరిగానే.. పహల్గామ్ దాడి బాధితుల పేరుతో పిఎం మోడీ ఓట్లు అడుగుతారని ఆమె వాదించారు. 2023లో కాన్పూర్ దేహత్‌లో బహిష్కరణ డ్రైవ్‌లో తల్లీ కూతుళ్లిద్దరూ మరణించడంపై బీజేపీ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించింది. అలాగే ‘యుపి మే కా బా- సీజన్ 2’ పాటపై నేహాకు పోలీసు నోటీసు అందింది.. ఇక శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఆమెను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..