KCR Big Shock to Armoor Jeevan Reddy: గెటవుట్ ఫ్రం మై ఫామ్‌హౌస్… నా బిడ్డ ఓటమికి కారణం నువ్వే.. అని మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై గులాబీబాస్ ఫైర్ అయ్యారంట.. అందుకే జీవన్‌రెడ్డి ఫామ్ హౌస్ కి చాలా రోజులుగా దూరం ఉంటున్నారట. కవిత ఎంపీగా పోటీ చేసినప్పుడు తనకు ఎమ్మెల్యేలు సహకరించలేదని బహిరంగంగా చెప్పిన.. ఆ ఒక్క మాట ఇప్పుడు బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది. కవితకు సన్నిహితంగా ఉంటూ, కేసీఆర్‌కి నమ్మిన బంటుగా వ్యవహరించిన జీవన్‌రెడ్డి నిజామాబాద్ జిల్లాలో కవిత ఆధిపత్యాన్ని ఒప్పుకోలేక ఆమె ఓటమికి పావులు కదిపారని ఆమె వర్గం భావిస్తోందంట. ఆ క్రమంలో ఆమె ఓటమి కారకులు ఆ ఒక్క నేతేనా? ఇంకెవరైనా ఉన్నారా అని కోణంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైందట.
కేసీఆర్‌కి వీరవిధేయుడ్ని అని ప్రచారం చేసుకున్న జీవన్ రెడ్డి
గులాబీ పార్టి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి వీరవిధేయుడ్ని అని తనకు తాను ప్రచారం చేసుకునే నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ ఎమ్ఎల్ఎ జీవన్ రెడ్డిని కేసీఆర్ తన ఫాంహౌస్ నుంచి గెటవుట్ అంటూ బయటకు గెంటేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్ఎల్ఎ అధికార కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్ గా మారి వెలగబెట్టిన వ్యవహారాలపై చర్చించుకుంటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే కాదు కేసీఆర్ సైతం విస్తుపోయినట్టు సమాచారం. కేసీఆర్ చరిశ్మ కవిత ప్రచారాలతో వరుసగా రెండుసార్లు ఎమ్ఎల్ఎగా గెలుపొందిన సదరు నేత అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారని ఇప్పటికి అన్ని వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు
తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. జీవన్ రెడ్డిగా కవిత ఓటమిలోనూ కీలక పాత్ర పోషించారని ఆరోపనలు వస్తున్నాయి. తాజాగా కేసీఆర్ కన్నెర్ర చేసి ఫౌమ్ హౌస్ నుంచి బయటకు వెళ్లగొట్టిన మాజీ ఎమ్ఎల్ఎ జీవన్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమి పాలు కావటంలో కీలక పాత్ర పోషించనట్లు నాటి నుంచే చర్చ జరుగుతుంది. కవిత ఓటమి తర్వాత అయిన తన మందే మగాదులతో హైదరాబాద్, గోవా, దుబాయ్ లలో దావాతులు చేసుకున్నట్లు జీవన్ రెడ్డి అనుచరులే అంటున్నారట. కవిత ఓటమి తర్వాత జిల్లాకు చెందిన మరికొందరు మాజీ ఎమ్ఎల్ఎలు కూడా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహారాలు
అయితే మాజీ ఎమ్ఎల్ఎ జీవన్ రెడ్డి అక్రమ వ్యవహారాలు, అతన్ని ఫాహౌస్ నుంచి గెంటెసిన వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో అడ్డు అదుపు లేకుండా దోచుకుని రాజ్యాంగేతర శక్తిగా వ్యవహారిస్తూ విచ్చలవిడిగా భూదందాలు, దౌర్జాన్యాలకు పాల్పడిన అతన్ని నియోజకవర్గ ప్రజలు గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం చేశారు. ఇప్పటికి అయిన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఎదుర్కోంటున్నారు. ఓటమి తర్వాత జీవన్ రెడ్డి ఎదో చుట్టుపు చూపుగా అది కూడా ఎవరికి తెలియకుండా ఆర్మూర్ వచ్చిపోతున్నారట. అది కూడా తన ఆస్తుల సంరక్షణ కోసమే అంటున్నారు.
కవిత చెప్తున్న దయ్యాల లిస్టులో జీవన్ రెడ్డి..
సదురు మాజీ ఎమ్ఎల్ఎ ప్రతిరోజూ కేసీఆర్ కుటుంబంతో ఫాహౌస్‌లో ఉంటున్నారని అంతా భావించారు. అయితే పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఎవరు ఊహించని రీతిలో ఉండటంతో పార్టీ శ్రేణులు ఆశ్చర్చపోతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో జీవన్ రెడ్డి అడ్డగోల వ్యవహారాలు నడిపినవారు ఓటమి తర్వాత పార్టీని గాలికి వదిలేసారట.. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని గతకొంత కాలంగా కవిత ఆరోపణలు చేస్తున్నారు. ఆ లిస్టులో మాజీ ఎమ్ఎల్ఎలు షకీల్, జీవన్ రెడ్డిలు కూడా ఉన్నారంటున్నారు. సిఎంఆర్ బియ్యం కుంబకోణంలో షకీల్ తప్పించుకుని తిరుగుతుండగా.. మూడో స్థానంలో ఓటమి పాలయిన మరో మాజీ ఎమ్ఎల్ఎ జీవన్ రెడ్డి నియోజకవర్గంలో కనిపించకపోవటంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: నంద్యాల జిల్లాలో సీఎం నేడు చంద్రబాబు పర్యటన
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో అధికాంలో ఉన్న బీజేపీలతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్న మాజీ ఎమ్ఎల్ఎ జీవన్ రెడ్డి సొంతపార్టి వ్యవహారాలు తనకు ఏమి సంబందాలు లేదంనట్టు వ్యవహరిస్తున్నాడని పార్టి శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు కనీసం ప్రెస్ మీట్ సైతం పెట్టలేదని దాంతో పాటు అనేక అంశాలు కేసీఆర్ దృష్టికి రావటంతో ఆయన జీవన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.
Story By Rami Reddy, Bigtv