Mallika Sherawat: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలి అంటే ఎంతో కష్టమైన పని అని చెప్పాలి. ఒకవేళ అవకాశాలు వచ్చిన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం మరో కష్టతరమైన అంశం. ఇలా ఇండస్ట్రీలో నిలబడి మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ అదే సక్సెస్ లో కొనసాగుతూ స్టార్ డం నిలబెట్టుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హీరోయిన్ల విషయంలో ఇది మరింత కఠిన తరంగా ఉంటుందని చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎక్కువగా ఎదుర్కొనే ఇబ్బందులలో క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) ఇబ్బందులు కూడా ఒకటి. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే తప్పనిసరిగా దర్శక నిర్మాతలు లేదా హీరోలకు కమిట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుందని ఇదివరకు ఎంతో మంది తెలిపారు.
బోల్డ్ పాత్రలు చేయటమే తప్పా?
ఇలా ఇండస్ట్రీలో అగ్ర తారల నుంచి చిన్న హీరోయిన్ల వరకు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న హీరోయిన్లు ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నారు. అలా ఇండస్ట్రీకి దూరం కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. తాజాగా నటి మల్లికా షెరావత్ (Mallika Sherawat)సైతం ఇండస్ట్రీకి దూరంగా కావడానికి గల కారణాలను తెలియజేస్తూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎందుకు ఇండస్ట్రీకి దూరమయ్యారో తెలియచేశారు.
అవకాశాలు లేకుండా చేశారు…
తాను సినిమాలలో కాస్త బోల్డ్ పాత్రలలో(Bold Roles) నటించినంత మాత్రాన తన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుందని భావించడం పూర్తిగా తప్పని తెలిపార. వెండితెరపై తాను బోల్డ్ పాత్రలలో నటించడంతో ఎంతో మంది హీరోలు నన్ను రాత్రికి రమ్మని పిలిచేవారు. అలా పిలిస్తే నేనెందుకు వెళ్లాలి? సినిమాలలో ఆ విధంగా నటిస్తే ఆ హీరోలు చెప్పిన విధంగా నేను వినాలా.. ఇలా రాత్రికి రమ్మని పిలవడం వల్ల నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ హీరోలు చెప్పిన విధంగా వినకపోవడంతోనే నాకు సినిమా అవకాశాలు కూడా లేకుండా పోయాయి అంటూ ఎమోషనల్ అయ్యారు
నేను ఆ టైప్ కాదు..
సినిమాలలో బోల్డ్ పాత్రలలో నటిస్తే ఆ హీరోల ఆలోచనలను ఎప్పుడూ కూడా నేను అంగీకరించనని, నేను ఆ టైపు కాదు అంటూ ఈ సందర్భంగా మల్లికా షెరావత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇలా కమిట్మెంట్స్ ఇవ్వకపోవడం వల్లే ఉద్దేశపూర్వకంగా తనకు అవకాశాలు లేకుండా చేసి తనని ఇండస్ట్రీకి దూరం చేశారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా ఎంతోమంది సెలబ్రిటీలు సినిమా అవకాశాలను కోల్పోయి ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇక సోషల్ మీడియాలో కూడా మల్లికా షెరావత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
Also Read: Rana Daggubati: కట్టప్ప బాహుబలిని చంపకపోతే.. రానా మైండ్ బ్లోయింగ్ ఆన్సర్?