Chittoor: రాష్టంలో ఉన్న దేవాలయాలకు ధర్మకర్తల మండల్లు నియమించడంలో విపరీతమైన జాప్యం జరగడంతో ఆలయాల్లో అధికారుల పెత్తనంతో పాటు స్థానికంగా కొంతమంది పెత్తనంతో కూటమికి చెడ్డపేరు వస్తుందంట..తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.ఈదిశలో పాలక మండల్ల నియామకం వెంటనే చేయాలని కూటమి నేతలు ప్రభుత్వ పెద్దలకు విజ్ణప్తి చేస్తున్నారు..ఆలయాలలో అక్రమదందాకు రుచి మరిగిన కొంతమంది సర్వశక్తులు ఒడ్డి పాలకమండల్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది.. అయితే పార్టీ కోసం పని చేయని వారికి పదవులు ఇస్తే సహించేది లేదని తెలుగుతమ్ముళ్లు అల్టిమేటం ఇస్తున్నారు..
ఆలయాలకు పాలకమండళ్లు నియమించని ప్రభుత్వం
రాష్టంలో తిరుమల ఆలయానికి తప్ప మిగతా ఏ ఆలయానికి కూడా పాలకమండళ్ల నియామకం ప్రభుత్వం చేపట్టలేదు..దీంతో పాలక మండళ్ల నియామకం కోసం కూటమి నేతలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది..ఉమ్మడి చిత్తూరు లో ప్రముఖ దేవాలయాలు అయిన కాణిపాకం, కాళహస్తి దేవాలయాలకు స్థానిక ఎమ్మెల్యేలు పాలకమండళ్ల లిస్టులను ఇప్పటికే పంపారు.. ఇక తిరుపతిలో గంగమ్మ అలయానికి కూడా జాబితా ను పంపారు.. అయితే పుంగనూరు నియోజకవర్గంలోని బోయకొండ ఆలయానికి మాత్రం పెద్ద ఎత్తున లాబీయింగ్ వ్యవహారం నడుస్తుంది.పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని లాబీయింగ్ తో వ్యవహారాలు నడిపే వారి హాడావుడి ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు
వేగంగా అభివృద్ది చెందుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వెలసిన బోయకొండ గంగమ్మ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది.. కర్నాటకతో పాటు రాయలసీమ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.ఆది , మంగళ వారాల్లో 25నుంచి ముప్పయి వేల మంది భక్తులు వస్తుంటారు. మాములు రోజులలో 10 వేలమందిభక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు..ఆలయ ఆదాయం ఏడాదికి 14 కోట్లు మేర ఉంటుంది. దీంతో పాటు సుమారు వెయ్యి మంది వరకు అమ్మవారి ఆలయం వలన ఉపాధి పోందుతుంటారు..ఇలాంటి ఆలయ పాలక మండలి పదవి కోసం పార్టీకి పనిచేయ్యని వారు హాడావుడి చేస్తుండటం టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదంట
టీడీపీకి భారీగా ఖర్చు పెట్టిన లక్ష్మీపతిరాజు
పుంగనూరు ఎంఎల్ ఎ పెద్దిరెడ్డి తన అనుచరులకు 2019- 24 మద్య కాలంలో పెద్ద పీట వేసారు..2024 ఎన్నికల్లో చౌడేపల్లికి చెందిన లక్ష్మిపతిరాజు టిడిపికి బారీ ఎత్తున ఖర్చు పెట్టడమే కాకుండా మండలంలో టిడిపికి మెజార్టీ తెప్పించారు. స్థానికంగా ఉన్న బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన బెంగుళూరులో రియల్ వ్యాపారం చేస్తూ గత ఐదు సంవత్సరాలు టీడీపీ కోసం పనిచేసారు. ఆయనకు ఆలయ పాలకమండలి ఛైర్మన్ పదవి ఇవ్వాలని ఇన్‌చార్జ్ చల్లాబాబు రెడ్డితో పాటు స్థానిక నేతలు సీఎం చంద్రబాబుని ఇప్పటికే కోరారంట.
గొడవల సమయంలో క్యాడర్ కుటుంబాలకు అండగా నిలిచిన లక్షీపతి
పుంగనూరు భైపాస్ లో జరిగిన గొడవల కేసులో టిడిపి క్యాడర్ అండర్‌గ్రౌండ్లో ఉంటే లక్ష్మిపతిరాజు వారి కుటుంబసభ్యులతో నిరంతరం టచ్ లో ఉండి వారి సమస్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకు పోవడమే కాకుండా తన చేతనైన సాయం చేసారంట. ఆలయ అభివృద్దికి తనకున్న పరిచయాలతో బయట నుంచి విరాళాలు తెచ్చి మరింత అభివృద్ది చేస్తానని రాజు అంటున్నారంట. ఆయన పట్ల పార్టీలో వ్యతిరేకత లేక పోయిననప్పటికి కాంగ్రెస్ హయాంలో పాలక మండలి చైర్మన్‌గా పనిచేసిన ఎస్.కే.రమణారెడ్డి పాత పరిచయాలతో రంగంలోకి దిగారు..2009 నుంచి 2014 వరకు రమణారెడ్డి,అయన బార్య రతీదేవిలు బోయకొండ ఆలయ చైర్మన్ గా పనిచేసారు.
రమణారెడ్డిపై అవినీతి ఆరోపణలతో కేసు నమోదు
అప్పట్లో రమణారెడ్డి విరాళాలు వసూలు చేసి తమ స్వంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు కేసు కూడా నమోదు అయింది. ఇష్టానుసారం విరాళాలు వసూలు చేసినట్లు దేవాదాయ శాఖ కూడా నిర్ధారించింది. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో టిడిపిలో చేరి కేసుల నుంచి తప్పించుకున్నారని అంటున్నారు. 2009లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడిగా అయన నియోజకవర్గంలో చక్రం తిప్పారు. తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి సియం కావడంతో అయన పంచకు చేరారు. 2014లో కాంగ్రెస్ తరపున పోటీచేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున అనుషారెడ్డికి మద్దతుగా పనిచేసారు. అనుషారెడ్డి వైసీపీలో చేరడంతో 2024 ఎన్నికల్లో టీడీపీకి పని చేయలేదని తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.
కిరణ్, అమర్‌నాథ్ రెడ్డిల సిఫార్సులు ఉన్నాయని ప్రచారం
ఇక ఇప్పుడు మాజీ సీఎం కిరణ్ కూమార్ రెడ్డి, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి సిఫార్సులు తనకు ఉన్నాయని రమణారెడ్డి అంటున్నారంట. గత ఎన్నికలలో పుంగనూరులో టీడీపీ కోసం పనిచేయకుండా రమణారెడ్డి సైలెంట్ అయ్యారు. ఎందుకు పనిచేయ్యలేదని ప్రశ్నిస్తే అభ్యర్థి చల్లాబాబు రెడ్డి తనకు ఇష్టం లేదని అంటున్నారంట. ఆ క్రమంలో ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో కనిపించకుండా పోయిన వ్యక్తి ఇప్పుడు బొయకొండ గంగమ్మ ఆలయానికి చైర్మన్ పోస్టు అడగటం ఎంత వరకు సమంజమని అంటున్నారు. అయితే తాను పెద్దిరెడ్డి బాధితుడని కాబట్టి తనకు ఖచ్చితంగా చైర్మన్ పదవి ఇప్పించాలని కిరణ్ వద్ద ఆయన వత్తిడి తెస్తున్నారంట. అయితే మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి మాత్రం తాను ఎవ్వరిని సిపార్సు చేయడం లేదంటున్నారు.
డీసీసీబీ ప్రెసిడెంట్ ఎంపికపై అగ్రహంగా ఉన్న తమ్ముళ్లు
ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు చిత్తూరు జిల్లా డిసిసిబి ప్రెసిడెంట్ ఎంపికపై అగ్రహం ఉన్నారంట..అమాస రాజశేఖర్ రెడ్డికి పదవి ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు..పార్టీకి ఎక్కడా పనిచేయని వ్యక్తికి కేవలం మాజీ సియం కిరణ్ కూమార్ రెడ్డి చెప్పారని ఇచ్చారని, తాజాగా మరోపదవి అయన చెప్పిన వారికి ఎందుకివ్వాలని ప్రశ్నిస్తున్నారంట..పార్టీకి పనిచేయకుండా హైదరాబాద్ లో ఉంటు నాయకుల చుట్టు తిరుగుతూ ఎన్నికలలో ఎందుకు పనిచేయలేదంటే అభ్యర్థి తనకు ఇష్టం లేదని చెప్పేవారికి పదువులు కోసం సిపార్స్ చేసే వారు అలోచించాలని అంటున్నారంట పుంగనూరు తెలుగు తమ్ముళ్లు..
Also Read: మోదీ మంత్రం.. స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందా?
ఆలయం వద్ద పొట్టేలు తలల అమ్మకాలు..
అయితే స్థానిక ఓ చోటా నేత తన అనుచరుడికి చైర్మన్ పోస్టు ఇప్పించి తాను పబ్బం గడుపుకోవడానికి యత్నిస్తున్నట్లు సమాచారం..గత పంచాయితీ ఎన్నికలలో వైసీపీతో వంత పాడిన అతను ఇప్పుడు నియోజకవర్గంలో దందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు..చివరకు గంగమ్మఆలయం వద్ద దుకాణాలు,పూజ సామాగ్రి అమ్మకాలతో పాటు బలులు ఇచ్చే పోట్టేలు తలలు అమ్మకాలు.. అన్ని చోట్ల దందా చేస్తున్నాడంట ..ఈ ఆదాయం రుచి మరిగిన అయన తాను అనుచరుడికి చైర్మన్ గిరి ఇప్పించి తాను దందా నడపడానికి ప్లాన్ చేసుకున్నాడంట..ఎన్నికలలో పార్టీ కోసం ఖర్చు పెట్టిన వారికి పదవులు ఇస్తే మరింతంగా పార్టీ అభివృద్దికి కృషి చేస్తారని కాని వారిని కాదని లాబీయిస్టులకు ,గుడి వద్ద సైతం చిల్లర్లకు అశపడేవారికి ఇస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మరి టీడీపీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.