E-Paper
Advertisement

గౌడులో గౌడు.. రేవంతు గౌడు… మ‌న‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంతు గౌడు..!

గౌడులో గౌడు.. రేవంతు గౌడు… మ‌న‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంతు గౌడు..!
Advertisement

అది ఉద్య‌మ వీరుడు .. స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం. ధైర్యానికి చిహ్నం, స్థైర్యానికి మ‌రో రూపు, వీర‌త్వానికి నిద‌ర్శ‌నం ఆ నిలువు విగ్ర‌హం సాక్షిగా పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ త‌న బానిస‌త్వాన్ని చాటుకున్న‌ట్టే మాట్లాడ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సీఎం రేవంత్‌రెడ్డిని ప‌దే ప‌దే గౌడుగా సంబోధించ‌డం ద్వారా ఆయ‌న మ‌న్న‌న‌లు పొందాల‌నుకున్నాడో.. ఆయ‌నను మ‌చ్చిక చేసుకోవ‌డం ద్వారా ప‌ద‌విని పదికాలాలు ప‌దిలం చేసుకోవాల‌కున్నాడో కానీ, బ‌హుజ‌నుల స‌త్తా అంటూనే త‌న చేవ‌లేని మాట‌ల‌తో అక్క‌డున్న వారిని మాత్రం తీవ్ర నిరాశ ప‌రిచారు గౌడు గారు.

Advertisement

ఆయ‌న ఓ గౌడులా ఆలోచిస్తారు కాబ‌ట్టి.. ఆయ‌న‌ను రేవంత్ గౌడు అని సంబోధిస్తున్న‌ట్టుగా కూడా స‌మ‌ర్థించుకున్నాడు. ఇదేం మ‌హేశ్‌కు కొత్త కాదు.. గ‌తంలో కూడా రేవంత్ రెడ్డిని గౌడ్‌లా సంబోధించి మ‌న్న‌న‌లు పొందే ప్ర‌య‌త్నం చేశాడు. రేవంత్ కూడా ఖుషీ అయి.. త‌న‌ను ముదిరాజుల‌లో ముదిరాజుగా, మాదిగ‌ల‌లో మాదిగ‌గా త‌నను పోల్చుతున్నార‌ని చెప్పుకున్నాడు సీఎం.

ఆయ‌న‌కు బాగానే ఉంది కానీ, బీసీల రాజ్యాధికారం, బీసీ సీఎం అనే నినాదాల‌ను బ‌లాన్ని చేకూర్చే ప‌నుల‌ను అట‌కెక్కించి.. మీ పాదాల కింద మా ప‌ద‌వులు ప‌దిలంగా ఉంటే చాలు అనే భావ‌నే మ‌హేశ్ మాట‌ల ద్వారా వ్య‌క్త‌మ‌వుతుంద‌నే అభిప్రాయాలు చాలా మందిలో క‌లిగిందంటే ఆశ్చ‌ర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

Advertisement

రేవంతేమో.. బీసీల లెక్క‌లు తీసింది మేమేనంటాడు.. సామాజిక న్యాయ‌మే నా ఎజెండా అంటాడు..దీనికి పూర్తి భిన్నంగా బహిరంగ వేదిక‌ల మీదే.. మ‌రోసారీ నేనే సీఎం అని ప్ర‌క‌టించుకుంటాడు. స‌రే, మ‌ళ్లీ నువ్వే సీఎం అవుదామ‌నే ఆశ ఉండొచ్చు.. దానికి సంబంధించిన ప్లానింగ్ నీకు ఉండొచ్చు.. కానీ అలా వేదిక‌లనెక్కి మ‌రీ ప్ర‌క‌టించుకోవ‌డం మూలంగా మీ పార్టీలో సీఎం అభ్య‌ర్థుల నోరు మూపించ‌డానికి ప‌నికొస్తుందేమో గానీ, ప్ర‌జా తీర్పును, బీసీ వాదాన్ని కూడా కాల‌రాసిన‌ట్టుగా ఓ మెసేజ్‌ను వ‌దిలిన‌ట్టు కాదా?

ఇవ‌న్నీ ప‌ట్టించుకునే స్థితిలో ఇప్పుడున్న స‌ర్కార్ లేదు. అందుకే రేవంత్ ద‌య ఉంటే చాలు అన్నీ ఉన్న‌ట్టే అనుకున్న‌ట్టున్నాడు మ‌హేశ్‌. ఎలాగూ సీఎం అయ్యేదీ లేద‌ని కూడా ఫిక్స‌యిపోయాడేమో..? అయితే గియితే డిప్యూటీ సీఎం కావాల‌నుకుంటున్నాడు. దీనికి రేవంత్ గౌడు ద‌య కావాలి అందుకే అలా గౌడులో క‌లిపేసుకున్న‌ట్టున్నాడు.

వాస్త‌వానికి, మధుయాష్కీని ప‌క్క‌న‌బెట్టి.. మ‌హేశ్‌ను పీసీసీ చీఫ్ చేసిందే రేవంత్ గౌడు… అందుకే అలా త‌న కులాన్నే రేవంత్‌కు ఆపాదించ‌డం మూలంగా… మ‌రింత ఉన్న‌త ప‌ద‌వులు వ‌స్తాయ‌నే భావ‌న కూడా కావొచ్చు. బీసీకి వ‌స్తే మంచిదే కదా..? దీని కోసం రేవంత్‌ను కాసేపు గౌడు అనుకుంటే ఆ గౌడుల కొంప‌లేమ‌న్న మునుగుతాయా? బీసీల మ‌ర్యాదేమ‌న్నా త‌గ్గుతుందా? అనుకుని ఉంటాడు. అంతే. మ‌నం కూడా అట్ల‌నే అనుకోవాలె.

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×