BigTV English

Mobile Offers @ Rs 1599: వర్త్ వర్మ వర్త్.. రూ.1599 లకే కొత్త 5జీ ఫోన్.. 50MP కెమెరా కూడా!

Mobile Offers @ Rs 1599: వర్త్ వర్మ వర్త్.. రూ.1599 లకే కొత్త 5జీ ఫోన్.. 50MP కెమెరా కూడా!

POCO M6 5G Mobile Offer @ Rs 1599: ఇప్పుడంతా 5జీ మయమైపోయింది. దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్కే నడుస్తోంది. దీంతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీలు సైతం 4జీ నుంచి 5జీకి షిఫ్ట్ అయ్యాయి. ఇందులో భాగంగానే కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. అయితే మార్కెట్‌లోకి వచ్చినవన్నీ దాదాపు రూ. 20 వేలకు పైగా ధరతో రిలీజ్ అయి ఫోన్ ప్రియులకి షాక్ ఇస్తున్నాయి. అందువల్ల బడ్జెట్ ధరలో 5జీ ఫోన్‌ను కొనుక్కుందామనుకున్న వారు వారి ప్లాన్‌ను మార్చుకుంటున్నారు.


అలాంటి వారికి ఓ గుడ్‌ న్యూస్. మీరు ఊహించని అతి తక్కువ ధరలో కొత్త 5జీ ఫోన్‌ను ఇప్పుడు ఈజీగా కొనుక్కోవచ్చు. అంతేకాదు అద్భుతమైన ఫీచర్లతో కూడా ఆ ఫోన్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. మరి అది ఏ ఫోన్.. ఎంత ధరకు వస్తుంది.. ఎందులో కొనుక్కోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పోకో ఫోన్‌లపై మంచి ఆఫర్లు పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ పోకో ఎం6 5జీ (POCO M6 5G) పై ఎవరూ ఊహించని డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఈ మొబైల్ 4జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్‌ను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.


Also Read: 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్.. 8/256 జీబీ వేరియం‌ట్‌ రూ.8,999కే..

దీని అసలు ధర రూ.12,999 ఉండగా.. ఇప్పుడు 38 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.7,999 ధరకే ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5% వరకు క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. అంతేకాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.6,400 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో ఈ 5జీ ఫోన్‌ను కేవలం రూ. 1599లకే సొంతం చేసుకోవచ్చు. అందువల్ల బడ్జెట్ ధరలో కొత్త 5జీ ఫోన్‌ను కొనుక్కోవాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తుంటే ఇదే మంచి ఛాన్స్ అని చెప్పాలి.

అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. ఈ కొత్త 5జీ ఫోన్ కొనుక్కోవాలంటే ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ కానీ హ్యాంగింగ్ కానీ ఉండకూడదు. అలాగే పిన్‌కోడ్ బట్టి కూడా వాల్యూ మారే అవకాశం ఉంది. అందువల్ల దీనిని కొనుక్కునే ముందు ఒకసారి ఇవన్నీ చెక్ చేసి కొనుక్కోవాలి. లేదంటే మరింత అమౌంట్ మీ జేబులోంచి పెట్టాల్సి ఉంటుంది.

ఇది 6.74 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో 50 మెగా పిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇక ఫోన్ ముందు బాగంలో 5 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఆఫర్స్ అన్నీ బ్లాక్ కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Related News

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Gaming Phone: 16GB ర్యామ్, 120W ఛార్జింగ్ గల రియల్‌మి గేమింగ్ ఫోన్.. అమెజాన్ ఫెస్టివల్‌లో ₹18,000 ధర తగ్గింపు!

Flipkart Budget Phones: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. ₹20,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే..

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Big Stories

×