God Is Real: దేవుడు ఉన్నాడా? ఇప్పటివరకు దీనికి సమాధానం లేదు. భగవంతుడిని నమ్మేవాళ్లు.. ఉన్నారంటారు. నమ్మనివాళ్లు.. లేడంటారు. అయితే.. ఓ గణిత ఫార్ములాతో.. దేవుడు ఉన్నాడని రుజువు చేయగలమంటున్నాడు ఓ సైంటిస్ట్. ఒక్క ఫార్ములా దేవుడి ఉనికిని డిసైడ్ చేస్తుందా?
దేవుడు ఉన్నాడా?
దేవుడి ఉనికిని నమ్మాలా? వద్దా?
భగవంతుడు ఉన్నాడా అనే దానికి.. నిర్దిష్టమైన సమాధానం లేదు. దేవుడి ఉనికిని నమ్మడమనేది.. వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దేవుడి నమ్మేవారు.. భగవంతుడి ఉనికి ఉందంటారు. నమ్మనివారు.. దేవుడి ఉనికికి శాస్త్రీయమైన ఆధారాలు లేవని వాదిస్తారు. అలా.. ఇప్పటివరకు దేవుడి ఉనికిని నిరూపించేందుకు, నిరాకరించేందుకు ఎన్నో వాదనలు జరిగాయి. దేవుడి విషయంలో.. ఒక్కో మతం.. ఒక్కో విధంగా నమ్ముతుంది. హిందూ మతంలో దేవుడు అనేక రూపాల్లో ఉన్నాడని నమ్ముతారు. అదే.. ఇస్లాంలో అయితే ఒకే ఒక దేవుడు ఉన్నాడని నమ్ముతారు. క్రైస్తవంలో అయితే.. దేవుడు పరిశుద్ధ ఆత్మగా ఉన్నాడంటారు. అందువల్ల.. దేవుడి విషయంలో.. ఎవరి నమ్మకాలు వారివి. దేవుడి ఉనికిని నమ్మాలా? వద్దా? అనేది.. వారి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కానీ.. దీనికి స్పష్టమైన సమాధానం లేదు.
దేవుడు ఉన్నాడనేందుకు ఆధారాలు లేవనే వాదన
దేవుడి ఉనికి విషయంలో.. అనేక వాదనలున్నాయి. భగవంతుడు ఉన్నాడనేందుకు ఆధారాలు లేవని కొందరు అంటారు. అసలు దేవుడు ఉన్నాడా? లేడా? అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో చెప్పడం కష్టమని మరికొందరు వాదిస్తారు. అయితే.. ఇందుగలడు అందు లేదనే సందేహం వలదన్నట్లుగా.. ప్రతి అణువులో భగవంతుడు ఉంటాడనేది మరో నమ్మకం. ఈ విశ్వం పుట్టుక నుంచి దేవుడి ఉనికి చుట్టూ ఎన్నో చర్చలు జరిగాయి. దేవుడు అంటే నమ్మకం అనే వాళ్లు కొందరు.. ఆశ అనే వాళ్లు ఇంకొందరు.. మూఢ నమ్మకం అనే వాళ్లు మరికొందరు.. ఎవరి అభిప్రాయం ఏదైనా దేవుడు అనే పదం మనందరిపై ప్రత్యేకమైన ముద్ర వేసింది.
విశ్వం మూలం కనుగొనే స్థితికి చేరుకున్న సైన్స్
ప్రస్తుతం శాస్త్ర విజ్ఞానం విస్తరించింది. విశ్వం మూలం కనుగొనే స్థితికి మన సైన్స్ చేరుకుంది. శాస్త్ర విజ్ఞానం పెరిగేకొద్దీ.. ఆధ్యాత్మిక భావనలు తగ్గుతుంటాయని చెబుతుంటారు. అందుకు తగ్గట్లుగానే.. రోజు రోజుకు దైవం అనే భావన తగ్గుతోంది. హేతువాదం పెరుగుతోంది. దీనికి తోడు.. నాస్తికత్వం కూడా తోడైంది. అయితే.. దైవం ఉందా? లేదా? అనే భావనకి.. ఇప్పటికీ ఎవరూ రుజువులు తెలియజేయలేదు. దైవం లేదని కొందరు వాదిస్తుంటే.. దేవుడి ఉనికి ఉందని ఇంకొందరు వాదిస్తుంటారు. నిజంగానే దేవుడు గనక ఉంటే.. ఆయన ఉనికిని రుజువు చేయాలని హేతువాదులు వాదిస్తారు. ఇక.. అలాంటి చర్చకు.. ఇక పుల్‌స్టాప్ పడబోతుందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఓ శాస్త్రవేత్త మాటలు విన్నాక.. దేవుడిని చూపించొచ్చా.. దైవం ఉనికి ప్రదర్శించొచ్చా అనే చర్చ మొదలైంది.
దేవుడు ఉన్నాడా? అనే ప్రశ్నకు సమాధానం వెతికిన శాస్త్రవేత్త!
దేవుడు ఉన్నాడా? లేడా? అనే సమాధానం లేని ప్రశ్నకు.. సమాధానం వెతికాడు ఓ శాస్త్రవేత్త. భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని.. ఓ గణిత ఫార్ములాతో రుజువు చేయగలమని శాస్త్రవేత్త ముందుకొచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్.. సంచలన విషయాలపై అధ్యయం చేశారు. ఆయనే.. దేవుడి ఉనికి సంబంధించిన ప్రస్తావన తెచ్చారు. దేవుడు ఉన్నాడని చెప్పేందుకు.. గణిత ఫార్ములాకు మించిన ఆధారం మరొకటి ఉండదనేది ఆయన వాదన.
దేవుడు ఉన్నాడా? లేడా?
దేవుడు ఉన్నాడా? లేడా? అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం కనుగొనేందుకు.. శతాబ్దాలుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో.. ఆస్తికులు, నాస్తికుల మధ్య వాదనలకు కొదవలేదు. అయితే.. ఈ ప్రశ్నకు సమాధానం సైన్స్, మ్యాథ్స్‌లో దాగుందా? హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్ట్ చెబుతున్నదేంటి? దేవుడి ఉనికిని.. గణిత సూత్రం నిరూపించగలదని ఆయన చెప్పిన మాటలు కొత్త చర్చకు దారితీశాయి.
గణిత సూత్రం దేవుడి ఉనికిని నిరూపిస్తుందా?
సైన్స్.. ఎప్పుడూ మతానికి విరుద్ధంగా కనిపిస్తుంది. కానీ.. ఓ గణిత సూత్రం దేవుడి ఉనికిని నిరూపించగలదని హార్వర్డ్ శాస్త్రవేత్త విల్లీ సూన్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జీవం పుట్టుకకు కచ్చితమైన, నిర్దిష్టమైన పరిస్థితులు అనుకూలించిన విధానాన్ని గమనిస్తే.. అవేమీ యాదృచ్ఛికమైనవిగా కనిపించడం లేదన్నది సూన్ వాదన. ఈ సువిశాల విశ్వం.. ఉద్దేశపూర్వకంగానే పుట్టుకొచ్చిందని.. వ్యతిరేక పదార్థం ఇది నిజమేనని సూచిస్తోందని వివరిస్తున్నారు.
విశ్వం ఉద్దేశపూర్వకంగానే పుట్టుకొచ్చిందనే వాదన
జీవం మనుగడ సాగించటానికి వీలుగానే.. విశ్వాన్ని రచించినట్టు యాంటీమ్యాటర్ ఉనికి, దీని నిష్పత్తి సూచిస్తోందని అంటున్నారు. మహా విస్ఫోటనం జరిగినప్పుడు పదార్థం, వ్యతిరేక పదార్థం రెండూ పుట్టుకొచ్చాయి. పదార్థం కన్నా వ్యతిరేక పదార్థం తక్కువ మోతాదులో ఏర్పడటమే జీవం పుట్టుకకు దోహదం చేసింది. పదార్థం, వ్యతిరేక పదార్థం ఆవేశాలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఇవి రెండూ సమాన మోతాదుల్లో ఉండి ఉంటే ఒకదాన్ని మరొకటి రద్దు చేసుకునేవి. అందువల్ల ఈ రెండింటి మధ్య అసమతుల్యం కావాలనే జరిగినట్టుగా కనిపిస్తోందని సైంటిస్ట్ విల్లీ సూన్ చెబుతున్నారు.
విల్లీ సూన్ ప్రధాన సూత్రం.. ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్
విల్లీ సూన్ ప్రతిపాదన వెనుకున్న ప్రధాన సూత్రం.. ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్. సరళంగా చెప్పాలంటే.. విశ్వాన్ని నియంత్రించే భౌతిక సూత్రాలన్నీ ఒకదానితో మరొకటి అత్యంత కచ్చితత్వంతో ఇమిడిపోయేలా ఉన్నాయి. వీటిని రూపొందించడం వెనక ఏదో శక్తి ఉండే ఉండాలి. అంటే.. భౌతిక నియమాలు, సూత్రాలను.. ఇంత అందంగా నిర్మించడం.. యాదృచ్ఛికంగా జరగదనేది సూన్ వాదన. ఇదే భావాన్ని.. గణిత ఫార్ములాలో మిళితం చేస్తే.. దేవుడు ఉన్నాడని రుజువు చేయొచ్చన్నారు.
భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక వాదానికి మధ్య అదృశ్య లింక్
ఇలాంటి ఫార్ములా.. సైన్స్‌కు, మతానికి వారధిగా నిలుస్తుందన్నారు. జీవ జాలానికి ప్రాణం పోసేలా భౌతిక సూత్రాలన్నీ ఏర్పాటయ్యాయని ఆయన తెలిపారు. గురుత్వాకర్షణ శక్తి మొదలు, మ్యాటర్, యాంటీ మ్యాటర్ మధ్య నిష్పత్తి వరకు అన్నీ.. జీవజాలానికి ప్రాణం పోసేలా ఉన్నాయన్నారు డాక్టర్ విల్లీ సూన్. మ్యాటర్, యాంటీమ్యాటర్ మధ్య అద్భుతమైన అసమతౌల్యత ఏర్పాటు వెనక.. ఏదో శక్తి ఉందన్నారు. మనం చూస్తున్న భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక వాదానికి మధ్య ఉన్న అదృశ్య లింక్.. గణిత ఫార్ములానే కాగలదన్నారు.
ఈ సమస్త విశ్వాన్ని దేవుడే నడిపిస్తున్నాడా?లేదా?
ఈ సమస్త విశ్వాన్ని.. దేవుడే నడిపిస్తున్నాడా? లేదా? అనే సంగతి పక్కనబెడితే.. ఏదో శక్తి మాత్రం కచ్చితంగా ఈ ప్రపంచం వెనక ఉందన్నది చాలామంది అభిప్రాయం. అయితే.. సూన్ కూడా ఇప్పుడలాంటి చర్చే తీసుకొచ్చారు. ఓ గణిత సూత్రం దేవుడి ఉనికిని నిరూపించగలదని హార్వర్డ్ శాస్త్రవేత్త చెప్పడం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేస్తోంది. విశ్వంలోని వివిధ మూలకాలు.. అంశాల్ని చూసినప్పుడు.. ఏదో అత్యున్నత శక్తి పని చేస్తున్నట్లు చెప్తారు. దీనికి ఉదాహరణగా గురుత్వాకర్షణ సమాన స్థితిలో ఉండటం ఆయన వాదనకు బలం చేకూరేలా చేస్తుంది.
1932లోనే వ్యతిరేక పదార్ధం ఉనికి నిర్ధారణ
గురుత్వాకర్షణశక్తి బలహీనంగా ఉంటే.. నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు ఏర్పడేవి కాదు కదా.. గురుత్వాకర్షణ శక్తి బలంగా ఉండే క్రిష్ణబిలంలో విశ్వం కుప్పకూలిపోయేది కదా అన్నది మరో ప్రశ్న. నిజానికి.. వ్యతిరేక పదార్థం ఉనికిని.. 1932లోనే నిర్ధారించినప్పటికీ.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ డిరాక్ అంతకన్నా ముందే.. దానిని యాదృచ్ఛికంగా గుర్తించారు. ఫాదర్ ఆఫ్ యాంటీ మ్యాటర్‌గా పేరొందిన ఆయన.. కొన్ని రేణువులు కాంతి కన్నా ఎక్కువ వేగంతో ఎందుకు కదులుతాయో తెలుసుకోవటానికి ప్రయత్నించారు.
పకృతి నియమాలే దేవుడి పని అనుకోవచ్చని శాస్త్రవేత్తల వాదన
డిరాక్, విల్లీ సూన్ వాదనలు ఎలా ఉన్నా.. ప్రకృతి నియమాలే దేవుడి పని అనుకోవచ్చని ఇంకొందరు శాస్త్రవేత్తల వాదన. అయితే.. అది దేవుడిని నిర్వచించడం వరకే పరిమితమవుతుందని.. నిజంగా దేవుడు ఉన్నాడనేది నిరూపించదని అంటున్నారు. ఏదేమైనా.. దేవుడు ఉన్నాడా? లేడా? అనే ప్రశ్నకు.. ఓ గణిత ఫార్ములా సమాధానంగా నిలుస్తుందంటే చాలా మంది నమ్మకపోవచ్చు. కానీ.. మనం ఏది నమ్ముతున్నాం అనేదే అసలు పాయింట్.