Hyderabad Future City: హైదరాబాద్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లబోతోంది. ఈ సిటీకి ఉన్న పవర్ అలాంటిది. నాలుగు శతాబ్దాల ఘనమైన చరిత్ర నుంచి అందమైన భవిష్యత్ దిశగా వెళ్లబోతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని విధంగా రోడ్ మ్యాప్ డిసైడ్ అయింది. భాగ్యనగర అభివృద్ధిలో గత పాలకుల నిర్ణయాలు ఒకెత్తు అయితే ఇప్పుడు చేపట్టబోయే కార్యక్రమాలు ఇంకో ఎత్తుగా నిలవబోతున్నాయి. ఎందుకంటే ఇది వైబ్రంట్ సిటీ. నెక్ట్ జెనరేషన్ సిటీ. అందుకే వరల్డ్ మ్యాప్ లోనే హైదరాబాద్ ఓ స్పెషాలిటీ.
నెక్ట్ లెవెల్ కు హైదరాబాద్ సిటీ షాన్
హైదరాబాద్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. మోస్ట్ వైబ్రంట్ సిటీ. విద్య, ఉద్యోగం, ఉపాధి ఇలా అన్నిటికీ కేరాఫ్ ఇది. ఓవైపు హిస్టారికల్ బ్యాక్ గ్రౌండ్, ఇంకోవైపు డైనమిక్ కెపాసిటీ ఈ నగరం సొంతం. మార్పులను స్వాగతిస్తుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండే భాగ్యనగరం వెరీ వెరీ స్పెషల్. ఎన్ని ప్రతికూల సిచ్యువేషన్స్ వచ్చినా తట్టుకుని నిలబడగలిగే సిటీ ఇదే. ఒక అవకాశాల గని. కొత్త ఉపాధిని సృష్టించే హబ్. అలాంటి నగరం నెక్ట్స్ లెవెల్ కు వెళ్తే ఎలా ఉంటుంది? సో సరిగ్గా ఈ ఫార్ములానే ఈ నగరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్లై చేస్తోంది. హైదరాబాద్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు ఇప్పటికే రోడ్ మ్యాప్ ఖరారు చేసింది. కథ మార్చబోతోంది.
బెటర్ ట్రాన్స్ పోర్టేషన్ కు రోడ్ మ్యాప్
ఉపాధి పెరిగినా కొద్దీ నగరంపై ఒత్తిడి పెరుగుతుంది. జనాభా పెరుగుతుంది. వాటికి తగ్గట్లు అవసరాలు పెరుగుతాయి. వసతులు కావాల్సి వస్తుంది. బెటర్ రోడ్లు, బెటర్ ట్రాన్స్ పోర్టేషన్ ఇవన్నీ ముఖ్యమే. అన్నిటినీ సమన్వయం చేస్తూ నెక్ట్ జెనరేషన్ అవకాశాలను కల్పించేలా హైదరాబాద్ ను రెడీ చేస్తున్నారు. కోర్ సిటీపై ఒత్తిడి తగ్గించేందుకు ఫోర్త్ సిటీ ప్రణాళికలు శరవేగంగా నడుస్తున్నాయి. దీంతో పాటే కోర్ సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మరిన్ని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు రాబోతున్నాయి. బెటర్ ట్రాన్స్ పోర్టేషన్ ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కాలుష్యం లేకుండా ఈవీలను ప్రోత్సహించడం, విస్తృత శ్రేణి అవకాశాలను సిద్ధం చేయడం వంటివి ప్రభుత్వానికి ప్రాధాన్య లక్ష్యాలుగా ఉన్నాయి.
గత 6 నెలల్లో రూ.58,481 కోట్ల విలువైన ఇండ్ల అమ్మకాలు
హైదరాబాద్ కు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఏ రంగం తీసుకున్నా ఢోకా లేదు. అంతటి స్టామినా మన నగరం సొంతం. రియల్ ఎస్టేట్ అయినా, ఉద్యోగాలైనా, ఏ రంగమైనా భాగ్యనగరం ది బెస్ట్ గా ఉంటోంది. ప్రపంచపరిణామాలతో ఒడిదొడుకులు ఉంటాయి తప్ప ఇక్కడ తగ్గేది ఏదీ లేదు. పడిపోయేది అంతకన్నా లేదు. ఓసారి రియల్ ఎస్టేట్ లెక్కలే చూద్దాం. సిటీలో రియల్ ఎస్టేట్ వృద్ధి గతేడాది కంటే పెరిగింది. బయట పడిపోయిందన్న ప్రచారం జరుగుతుంటే అధికారిక లెక్కలు మాత్రం వృద్ధి ఎంత ఉందో సూచిస్తున్నాయి.
ఈ ఏడాది జూన్ లోనే అమ్ముడైన ఇండ్ల వాల్యూ 4,288 కోట్లు
మెట్రోపాలిటిన్ పరిధిలో గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో ఇండ్ల అమ్మకాలు జరిగాయి. 6 నెలల్లో దాదాపు 58,481 కోట్ల రూపాయల విలువైన ఇండ్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది ఒక్క జూన్ నెలలోనే 4,288 కోట్ల విలువైన ఇండ్ల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయి. సో లెక్కలు ఎక్కడా తగ్గలేదు. ఇవన్నీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నమోదైన వివరాలే.
హైడ్రాతో రియల్ ఢమాల్ అన్నది వట్టిదే
హైదరాబాద్ భవిష్యత్ కోసం వచ్చిన కొత్త వ్యవస్థ హైడ్రా. దీంతో రియల్ ఎస్టేట్ ఢమాల్ అంటూ ప్రచారాలు జరిగాయి. అయితే అవన్నీ వట్టివే అని తాజా రియల్ ఎస్టేట్ లెక్కలతో తేలిపోయాయి. నిజానికి హైదరాబాద్ చెరువులను కాపాడే ఉద్దేశంతో వచ్చిన హైడ్రా.. చాలా వరకు అక్రమ నిర్మాణాలను తొలగించింది. ప్రభుత్వ భూములను కబ్జా చెర నుంచి విడిపించింది. గత 5 నెలల్లో హైడ్రా దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.
గతేడాది నవంబర్ లో 1,740 దరఖాస్తులు
అంటే ఆ లెక్కన ఆ భూమి ప్రజలకు ఉపయోగపడేదే. సో హైడ్రాతో రియల్ ఎస్టేట్ తగ్గిందనేది వాస్తవం కాదు. ఈ ఏడాది ఫస్టాఫ్ లో ఇండ్ల అమ్మకాల్లో ఐదేళ్లలో హైదరాబాద్ ఆల్ టైమ్ హై రికార్డ్ నమోదు చేసింది. భవన నిర్మాణాలు, అనుమతుల అప్లికేషన్లలో 20 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది నవంబర్ లో 1,740 దరఖాస్తులు రాగా ఈ ఏడాది 2,078లు అప్లికేషన్లు వచ్చాయి.
అప్లికేషన్ల క్లియరెన్స్ లో స్పీడ్ పెంచిన HMDA
అటు హెచ్‌ఎండీఏ కూడా అప్లికేషన్ల క్లియరెన్స్ లో స్పీడ్ పెంచింది. గతేడాది జులై నుంచి నవంబర్ తో పోలిస్తే ఈ ఏడాది అన్ని రకాల దరఖాస్తుల స్వీకరణలో 45 శాతం వృద్ధి కనిపించింది. 2023లో జులై నుంచి నవంబర్ మధ్య 1,326 అప్లికేషన్లు రాగా.. ఈ ఏడాది అదే సమయంలో 1,920 అందాయి. అప్లికేషన్ల పరిష్కారంలో 24 శాతం పెరుగుదల నమోదైంది. హెచ్‌ఎండీఏలో రానున్న ఏడాదిలో ప్యారడైజ్ సర్కిల్ నుంచి రెండు ఎలివేటెడ్ కారిడార్లకు మార్చిలో టెండర్లు ఆహ్వానించబోతున్నారు. ఓఆర్‌ఆర్ రావిర్యాల ఎగ్జిట్ 30 నుంచి ఫోర్త్‌సిటీ వరకు 42 కిలోమీటర్ల మేర 100 ఫీట్ రోడ్ నిర్మాణానికి భూసేకరణ మొదలు పెట్టేశారు.
H సిటీ పేరుతో చేపట్టిన ప్రాజెక్టులతో మహర్దశ
హైదరాబాద్ లో H సిటీ పేరుతో పెద్ద పెద్ద ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతోంది. ఈ లెక్కన నెక్ట్ లెవెల్ సిటీని ఆవిష్కరించబోతున్నారు. అదే జరిగితే సిటీ కథ మొత్తం మారిపోనుంది. హైదరాబాద్ సిటీ ఇన్నొవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో 38 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇటీవలే ప్రజాపాలన తొలి ఏడాది విజయోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ స్వయంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కూడా చేశారు. H సిటీ ప్రాజెక్టుల విలువ 7,032 కోట్ల రూపాయలుగా ఉంది. అటు సీఆర్‌ఎంపీ ఫేజ్-2 కింద 934 రోడ్లు, 1143 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేయనున్నారు.
రోడ్లకు రూ. 3,825 కోట్లు కేటాయింపు
వీటికి 3,825 కోట్లు కేటాయించారు. మరోవైపు స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద 40 పనులు చేపట్టగా వాటికి 667.28 కోట్ల రూపాయలు కేటాయించారు. అటు జాతీయ విపత్తు సహాయ నిధి కింద 291.80 కోట్లు కేటాయించారు. ఇందులో 41 పనులు చేపడుతున్నారు. ఇవన్నీ పూర్తియితే హైదరాబాద్ నెక్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయమే. ట్రాఫిక్ చిక్కులు ఉండవ్. ఉండడానికి ఢోకా ఉండదు. మరింత నివాస అనుకూలంగా సిటీ మారుతుంది. వీటికి తోడు ఫోర్త్ సిటీతో కోర్ సిటీపై ప్రెజర్ తగ్గుతుంది. మోర్ కంఫర్ట్, ఈజీ లివింగ్.. ఇదే షాన్ దార్ షహర్ హైదరాబాద్ లక్ష్యం.
H-సిటీ ప్రాజెక్టుతో వరల్డ్ క్లాస్ సిటీకి అడుగులు
హైదరాబాద్ ఓ పవర్ జెనరేషన్ హబ్. ఈ సిటీకి సూపర్ పవర్ ఉంది. స్టామినా బలంగా ఉంది. నెక్ట్స్ జెనరేషన్ పాజిటివ్ వే ఉంది. సో దీన్ని సరైన దిశలో కంటిన్యూ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే. హైదరాబాద్ డెవలప్ మెంట్ కోసం నయా యాక్షన్ ప్లాన్ ను సర్కార్ రెడీ చేసింది. రాజధానిని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు H-సిటీ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.
23 అభివృద్ధి పనులకు రూ. 6వేల కోట్లు
ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లకు సంబంధించిన 23 అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఏకంగా 6వేల కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చిందంటే ట్రాన్స్ పోర్టేషన్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. హెచ్-సిటీ ప్రాజెక్టుతో హైదరాబాద్ సిటీకి ప్రధాన సమస్యగా మారిన రోడ్లను పెద్ద ఎత్తున బాగు చేయనున్నారు. ట్రాఫిక్ కష్టాలను తీర్చడం, వరద ముంపును తప్పించేలా నగరం నలుమూలలా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్‌యూబీ, ఆర్‌వోబీలను నిర్మించనున్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ రూ.1,230కోట్లతో జంక్షన్ల అభివృద్ధి
అటు కేబీఆర్ పార్క్ చుట్టూ 1,230కోట్ల రూపాయలతో చేపట్టే జంక్షన్ల అభివృద్ధికి టెండర్లు పిలవబోతున్నారు. ఈ చౌరస్తాల విస్తరణకు 125 ప్రాంతాల్లో 4,100 కరెంట్ పోల్స్ అడ్డుగా ఉన్నాయి. వాటిని 3 నెలల్లో తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఇప్పటికే సూచనలు వెళ్లాయి. ఇటు సికింద్రాబాద్ జోన్‌లోని ఏవోసీ సెంటర్ చుట్టూ ఆల్టర్నేట్ రోడ్ల నిర్మాణం కోసం అత్యధికంగా 940 కోట్ల రూపాయల విడుదలకు అనుమతులు ఇచ్చారు.
శేరిలింగంపల్లి జోన్‌లో జంక్షన్లకు రూ. 837 కోట్లు
శేరిలింగంపల్లి జోన్‌లో ఖాజాగూడ, ఐఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల అభివృద్ధికి 837 కోట్లు, మియాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్ దాకా ఆరు లేన్ల ప్లైఓవర్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు మూడు లేన్లతో అండర్ పాస్ నిర్మాణానికి 530 కోట్లు రిలీజ్ చేశారు. ఎల్బీనగర్ జోన్‌లో TKR కమాన్ జంక్షన్ నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు ఆరు లేన్ల ఫ్లైఓవర్ కోసం 416 కోట్లు, ఖైరతాబాద్ జోన్ పరిధిలో రైతిబౌలి నుంచి నానల్ నగర్ జంక్షన్ వరకు మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 398 కోట్లు రిలీజ్ చేస్తూ పురపాలక శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సో నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ సిటీలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.
ఫ్యూచర్ సిటీ నిర్మాణం విప్లవాత్మక అడుగు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫ్యూచర్ సిటీని తెరపైకి తెచ్చింది. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఇది విప్లవాత్మక అడుగు. నెక్ట్స్ జెనరేషన్ సిటీ అంటే ఎలా ఉండాలో అలాగే దీన్ని రూపొందిస్తున్నారు. తెలంగాణకు రెవెన్యూ జెనరేషన్ సిటీ హైదరాబాదే. సో రైజింగ్ ఇక్కడి నుంచే మరింతగా మొదలు పెట్టి తెలంగాణ అంతటా విస్తరించేలా చేయడమే లక్ష్యం. మొదటగా రోడ్లు పూర్తయితే ఆటోమేటిక్ గా మిగితా వ్యవస్థలన్నీ వచ్చేస్తాయి.
ORR తరహాలో 330 ఫీట్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదన
అందుకోసమే ఫ్యూచర్ సిటీకి అద్భుతమైన రోడ్లు వేయబోతున్నారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకునేందుకు ఔటర్ తరహాలో 330 ఫీట్ల రోడ్ నిర్మించాలని ప్రతిపాదించారు. కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా రీజినల్ రింగురోడ్డు వరకూ 40 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తారు. వెయ్యి ఎకరాల ప్రైవేటు భూములు సేకరించబోతున్నారు. తొలిదశలో 458 ఎకరాలు సేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ రోడ్లు ఇప్పటి కోసమే కాకుండా భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా గ్రీన్ ఫీల్డ్ హైవేగా ఉండబోతోంది.
ఫ్యూచర్ సిటీలో ఏఐ, స్పోర్ట్స్, స్కిల్ వర్శిటీలు
ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు కొలువుదీరుతుండడంతో ఈ రోడ్ ఏర్పాటుకు నిర్ణయించారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి ఫ్యూచర్ సిటీ కీలకంగా మారుతుందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అలాగే హైదరాబాద్ సిటీ విస్తరణ కూడా ఇటువైపే ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. భవిష్యత్ ప్రణాళికలు, ట్రాఫిక్ అవసరాల ప్రకారం రోడ్ల లింకేజీ కోసం ప్రభుత్వం స్ట్రాటజిక్ గా వ్యవహరిస్తోంది. సో ఇవన్నీ పూర్తయితే నయా సిటీ మరో లెవెల్ లో ఉండడం ఖాయమే. ఇప్పటికే సైబరాబాద్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలు హైదరాబాద్ న్యూ సిటీకి కేరాఫ్ గా మారాయి. ఐటీకి సెంటరాఫ్ అట్రాక్షన్ గా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మరిన్ని రంగాలకు కేరాఫ్ గా మారబోతోంది. అందులోనే ఏఐ సిటీ, స్పోర్ట్స్ హబ్, ఇండస్ట్రియల్, స్కిల్ వర్శిటీ ఇవన్నీ రాబోతున్నాయి.
ఈ ఏడాది 56శాతం పెరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్
ఉపాధి విషయంలో హైదరాబాద్ ఓ పవర్ హబ్. డిమాండ్ ఏటికేడు పెరగడమే తప్ప తగ్గడం అంటూ ఉండదు. హైదరాబాద్ జీవితాన్ని నేర్పిస్తుంది. ఇది రాజధానికి వలస వచ్చిన వారికి ఇది చాలా మందికి అనుభవమే. ఇక్కడ ఉపాధికి ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ ఆఫీస్ స్పేస్ లీజింగే. హైదరాబాద్ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ కు బలమైన డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది మొత్తం మీద గ్రేడ్–A ఆఫీస్ స్పేస్ లీజింగ్ 56 శాతం పెరిగి 12.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ గా నమోదైనట్లు కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.
2025లోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఆల్ టైమ్ హై ఉండే ఛాన్స్
గత ఏడాది లీజు క్వాంటిటీ 8 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండగా, ఇప్పుడది భారీగా పెరిగింది. చెన్నై, ఢిల్లీ వంటి చోట్ల తగ్గుతుంటే మన దగ్గర మాత్రం జెట్ స్పీడ్ తో ఆఫీస్ స్పేస్ కు గిరాకీ పెరుగుతోంది. సాఫ్ట్ వేర్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలతో పాటు ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల నుంచి ఆఫీస్ స్థలాలకు ఈ ఏడాది డిమాండ్ ఎక్కువైనట్లు కొలియర్స్ ఇండియా రిపోర్ట్ చెబుతోంది. 2025లోనూ ఆఫీస్ స్పేస్ లీజింగ్ గరిష్ట స్థాయిలోనే కొనసాగొచ్చొని కూడా అంచనా వేసిందంటే మన సిటీ స్టామినా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా లీజింగ్ లోనూ టాప్
దేశవ్యాప్తంగా టాప్ – 8 సిటీల్లో లాజిస్టిక్స్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా లీజింగ్ ప్రస్తుత ఏడాది మొత్తం మీద 50 నుంచి 53 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉండొచ్చని కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ అంటోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో గతేడాది లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రియల్ వసతుల లీజింగ్ 53.57 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ వరకు లీజింగ్ ఈ నగరాల్లో 41 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీని అధిగమించినట్టు తెలిపింది. సో ఏ లెక్కన తీసుకున్నా హైదరాబాద్ కు మరింత మహర్దశ ఉండడం ఖాయమే. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో టాప్ సిటీగా ఎదగడానికి మరెంతో సమయం పట్టకపోవచ్చు. అందుకే హైదరాబాద్ షాన్ దార్ షహర్ ఎప్పటికీ.