Sushmita Sen: బాలీవుడ్‌లో ఆల్ టైమ్ హ్యాండ్‌సమ్ బ్యాచిలర్‌గా పేరు తెచ్చుకున్నాడు సల్మాన్ ఖాన్. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించి తనకంటూ భారీ ఫ్యాన్ బేస్, స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. తనను వెండితెరపై చూసే ప్రేక్షకుల్లో మాత్రమే కాదు.. తనతో కలిసి నటించే నటీమణుల్లో కూడా సల్మాన్ ఖాన్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఎంతోమంది హీరోయిన్లు ఓపెన్‌గా సల్మాన్ ఖాన్‌పైనే ఉన్న ఇష్టాన్ని బయటపెట్టారు. ఆ లిస్ట్‌లోకి తాజాగా మరొక సీనియర్ హీరోయిన్ కూడా యాడ్ అయ్యింది. తను మరెవరో కాదు.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ (Sushmita Sen). సల్మాన్ ఖాన్‌కు తనపై ఉన్న ఇష్టాన్ని చెప్తూ తనను ప్రేమించాననే విషయం బయటపెట్టింది సుస్మితా.
ప్రేమలో పడిపోయాను
సుస్మితా సేన్.. మాజీ విశ్వసుందరిగా కిరీటం దక్కించుకున్న తర్వాత తనకు బాలీవుడ్ నుండి ఆఫర్లు వచ్చాయి. అలా తను హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. తను హీరోయిన్‌గా మారిన తర్వాత తను చిన్నప్పటి నుండి ఇష్టపడే సల్మాన్ ఖాన్ కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ 1989లో విడుదలయిన ‘మైనే ప్యార్ కియా’లో సల్మాన్‌ను చూసి అప్పుడే ప్రేమలో పడిపోయిందట సుస్మితా. అంతే కాకుండా తన రూమ్ మొత్తం సల్మాన్ ఖాన్ సినిమా పోస్టర్లతోనే నిండిపోయిందని కూడా చెప్పుకొచ్చింది.
Also Read: ‘పుష్ప 2’ టికెట్స్ ఇచ్చారు, ‘బేబి జాన్’ చూడమన్నారు.. ఇదెక్కడి అన్యాయం.?
పోస్టర్స్‌తోనే ప్రేమ
‘‘నాకు చిన్నప్పుడు ఎంత పాకెట్ మనీ వస్తే అంత ఖర్చుపెట్టి నేను సల్మాన్ ఖాన్ పోస్టర్లు మాత్రమే కొనేదాన్ని. అదే సందర్భంలో మైనే ప్యార్ కియా విడుదలయ్యింది. అందుకే ఆ సినిమా నుండి స్పెషల్‌గా పావురం పోస్టర్ కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే అది సల్మాన్ ఖాన్ (Salman Khan) సినిమాలోది కాబట్టి. నేను చిన్నప్పుడు హోమ్ వర్క్ టైమ్‌కు చేయకపోతే ఆ పోస్టర్లు చించేస్తామని మా అమ్మ నాన్న బెదిరించేవారు. అలా నేనెప్పుడూ నా హోమ్ వర్క్‌ను టైమ్‌కు పూర్తి చేసేదాన్ని. అతడితో నేను ప్రేమలో పడిపోయాను’’ అంటూ సల్మాన్‌పైన ఇష్టాన్ని వివరించింది సుస్మితా సేన్. అంతే కాకుండా వారు కలిసి నటించిన ‘బీవీ నెంబర్ 1’ సినిమాలోని ఒక ఫన్నీ సంఘటనను కూడా గుర్తుచేసుకుంది.
అప్పటికప్పుడు సినిమా
‘‘బీవీ నెంబర్ 1 షూటింగ్ సమయంలో మేము ఫ్రెండ్స్ అయ్యాం. అలా నా రూమ్‌లో తన పోస్టర్లు ఉండేవి అన్న విషయం కూడా షేర్ చేసుకున్నాను. నేను 15 ఏళ్లు ఉన్నప్పటి ఫోటోను తను చూశానని, అప్పుడు నా వెనుక తన సినిమా పోస్టర్ ఉందని చెప్పాడు. తన సినిమాల్లో నాకు ఫేవరెట్ ఏది అని అడిగాడు. మైనే ప్యార్ కియా అని ఆలోచించకుండా చెప్పేశాను. అప్పుడే తను డేవిడ్ ధావన్ దగ్గరకు వెళ్లి మనం సుస్మితా సేన్‌తో మైనే ప్యార్ క్యూ కియా సినిమా తీస్తున్నామని చెప్పాడు. డేవిడ్ ధావన్ కూడా ఒప్పుకున్నాడు’’ అని గుర్తుచేసుకుంది. అలా సుస్మితా సేన్ కోసం ఏకంగా ‘మైనే ప్యార్ క్యూ కియా’ అనే సినిమా తీశాడు సల్మాన్ ఖాన్.