BigTV English

Indian players: బాక్సింగ్ డే టెస్ట్ లో నల్ల బ్యాండ్లతో భారత క్రికెటర్లు

Indian players: బాక్సింగ్ డే టెస్ట్ లో నల్ల బ్యాండ్లతో భారత క్రికెటర్లు

Indian players: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మేల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండవ రోజు టీమిండియా ప్లేయర్లు నల్లటి ఆర్మ్ బ్యాండ్ లతో {Indian players} బరిలోకి దిగారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపంగా ఎడమ చేతికి ఈ నల్లని బ్యాడ్జీలు ధరించారు. 92 ఏళ్ల డాక్టర్ మన్మోహన్ సింగ్ వయో సంబంధిత సమస్యల కారణంగా గురువారం రాత్రి 9:51 గంటల ప్రాంతంలో కన్నుమూశారు.


Also Read: Khalistan Supporters: బాక్సింగ్ డే టెస్టులో కలకలం.. మ్యాచ్ అడ్డుకునేందుకు ఖలిస్థానీల కుట్రలు?

ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు {Indian players} ఆయనకు నివాళులు అర్పిస్తూ చేతికి నల్ల బ్యాడ్జీలు ధరించారు. భారత ఆర్థిక విధివిధానాలపై మన్మోహన్ సింగ్ చెరగని ముద్రవేశారు. ఆర్బిఐ గవర్నర్ గా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఆధునిక ప్రపంచంలో భారత్ ని ఒక బలమైన ఆర్థిక శక్తిగా నిలబడేలా చేశారు. మన్మోహన్ సింగ్ ఓ గొప్ప ఆర్థికవేత్త. ఆయన 2004 నుండి 2014 వరకు భారతదేశ ప్రధానిగా ఉన్నారు.


పైకి మృదుస్వభావిలా కనిపించినా.. మన్మోహన్ సింగ్ దేశం కోసం తీసుకునే నిర్ణయాలలో అత్యంత కఠినంగా వ్యవహరించారు. ఇక భారత క్రికెట్ జట్టు {Indian players} ఆయన మృతికి సంతాపంగా నల్ల బ్యాండ్ ధరించి మైదానంలోకి ఆడడానికి బయలుదేరినప్పుడు నివాళులర్పించింది. మరోవైపు అనేకమంది ఇతర ఆటగాళ్లు కూడా మన్మోహన్ సింగ్ కి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.

వారిలో హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ సహా పలువురు {Indian players} ఉన్నారు. ఇక రెండవ రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో బూమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా 3, ఆకాష్ దీప్ 2, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు కేవలం 8 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.

Also Read: Rohit Sharma – Yashasvi Jaiswal: ఓరేయ్ గల్లీ క్రికెట్ ఆడుతున్నావా.. జైస్వాల్ కు రోహిత్ వార్నింగ్ ?

గత రెండు టెస్ట్ మ్యాచ్ లలోని నాలుగు ఇన్నింగ్స్ లలో మిడిల్ ఆర్డర్ లో వచ్చిన రోహిత్ శర్మ.. ఈ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో మాత్రం ఓపెనర్ గా వచ్చాడు. అయినప్పటికీ నిరాశపరిచాడు. కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పాట్ కమీన్స్ బౌలింగ్ లో బోలాండ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా కేవలం 24 పరుగులు మాత్రమే చేసి కమీన్స్ బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం {Indian players} యశస్వి జైస్వాల్ (23*), విరాట్ కోహ్లీ (1*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక్కడే ఈ రెండు వికెట్లు పడగొట్టాడు.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×