India Mock Drill: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పహల్గాం దాడికి భారత్ గట్టిగా సమాధానం చెప్పింది. టెర్రరిస్ట్‌లను టార్గెట్ చేసుకొని 9 శిబిరాలపై దాడి చేసింది. ఇప్పుడే కాదు.. పాకిస్తాన్, ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడిన ప్రతీసారి భారత్ గట్టిగానే బదులిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాక్ డిల్ ప్రోగ్రాంని కాశ్మీర్ ప్రాంతంలో మాత్రమే రద్దు చేసింది. మిగతా ప్రాంతాల్లో యధావిథిగా నిర్వహించనుంది.
దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో ఢిఫెన్స్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో డిఫెన్స్ ఢ్రిల్స్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్, విశాఖపట్నం, సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ DRDO, మౌలాలి NFCలో డిఫెన్స్ బృందాలు మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు రెడీ అయ్యాయి.
కాగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో ఏం జరుగుతుందన్నది నెక్ట్స్ మ్యాటర్. కానీ జనాన్ని అలర్ట్ చేయడం చాలా కీలకం. ముఖ్యంగా పాకిస్తాన్‌కు ఇటు బంగ్లాదేశ్ కు సరిహద్దు రాష్ట్రాలపై చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇవే చాలా సెన్సిటివ్ ఏరియాస్. మిసైల్స్ అయినా.. యుద్ధ ట్యాంకర్లైనా ఈజీగా విధ్వంసం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకే దేశవ్యాప్తంగా 244 చోట్ల మే 7న మాక్ డ్రిల్ నిర్వహించబోతోందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
యుద్ధం వస్తే ఎలా ఉండాలి.. ఎంతటి అలర్ట్ నెస్ అవసరం.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు ఇవన్నీ చెప్పేలా చేయడమే మాక్ డ్రిల్ ఉద్దేశం. అంతే కాదు.. మన కంట్రోల్ రూమ్స్, భద్రతా వ్యవస్థలు పర్ ఫెక్ట్ గా ఉన్నాయా.. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ర్యాపిడ్ స్పీడ్ లో రియాక్ట్ అవుతున్నాయా అన్నది తెలుసుకునే ఉద్దేశంతో ఈ భారీ మాక్ డ్రిల్‌కు ప్లాన్ చేశారు.
కంట్రోల్ రూమ్‌ల పనితీరును పరీక్షించుకోవడం కూడా ముఖ్యమే. కంట్రోల్ రూమ్‌లు, షాడో కంట్రోల్ రూమ్‌ల మధ్య కోఆర్డినేషన్, రియాక్షన్ కెపాసిటీని పరీక్షించడం వంటివి తాజా మాక్ డ్రిల్స్ లో చేయబోతున్నారు. వీటితో పాటే ఫైర్, రెస్క్యూ ఆపరేషన్‌లు, ఇతరత్రావి టెస్ట్ చేస్తారు. ఈ డ్రిల్స్ 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత మళ్లీ ఇప్పుడే నిర్వహిస్తున్నారు. ఈ చర్యలతో శత్రు దాడుల టైంలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో గందరగోళాన్ని తగ్గించడం, భయాందోళనలను నివారించడం, జనాన్ని కాపాడడం లక్ష్యంగా డ్రిల్స్ ఉండబోతున్నాయి.
ఈ డ్రిల్స్ జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ వంటి సరిహద్దు రాష్ట్రాలతో సహా మొత్తంగా 244 చోట్ల జరగబోతున్నాయి. ఈ డ్రిల్‌లు యుద్ధానికి సిద్ధమవుతున్నామని సూచించవు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండటానికి దేశ రక్షణకు ముందస్తు చర్యగా చూడాలి.
Also Read: దాడి చేస్తామని రాత్రే హింట్ ఇచ్చిన భారత్.. వీడియో చూస్తే గూస్ బంప్స్ పక్కా
రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలు కేటగిరి 1 జోన్ లో ఉన్నాయి. అంటే ఇవి హైరిస్క్ జోన్స్ అన్న మాట. ఎందుకంటే పాకిస్తాన్ లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ క్షిపణుల్ని ఈ సరిహద్దు రాష్ట్రాలపై ఈజీగా ప్రయోగించగలదు. అందుకే ఎయిర్ స్ట్రైక్స్ జరిగితే ఎలా ఉండాలో ఇక్కడ పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ, హైదరాబాద్ కేటగిరి 2 జోన్ లో ఉన్నాయి. అసోం, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు కేటగిరి టూలో ఉన్నాయి.