Subham Movie : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరికీ కూడా అభిమాన హీరోయిన్ సమంత అని చెప్పాలి. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది. ఆ సినిమా తర్వాత సమంత స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ ,ఎన్టీఆర్ వంటి హీరోలతోపాటు నటించే అవకాశం సమంతకు దక్కింది. కేవలం తెలుగు మాత్రమే పరిమితం అయిపోకుండా మిగతా భాషల్లో కూడా సినిమాలు చేస్తూ కెరియర్ లో ముందుకు అడుగులు వేసింది.
లేడీ ఓరియంటెడ్ సినిమాలు
హీరోయిన్గా మంచి సక్సెస్ వచ్చిన తర్వాత చాలామంది లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెడతారు. అలానే సమంత కూడా యశోద, శకుంతలం వంటి సినిమాలు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద యశోద సినిమా మంచి సక్సెస్ సాధించింది కానీ శకుంతలం సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. గుణశేఖర్ కెరియర్ కూడా ఈ సినిమా పెద్ద మైనస్ గా మారింది. ఇక సమంత విషయానికొస్తే మంచి పేరు తీసుకొచ్చిన సిరీస్ అంటే ఫ్యామిలీ మెన్. ఈ సిరీస్ తర్వాత సమంత స్టార్డం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి జీవితంలో ఎత్తుపల్లాలు ఉన్నట్లే సమంత జీవితంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. వాటన్నిటిని అధిగమించి ఇప్పుడు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా కూడా తాను అడుగులు వేస్తుంది.
Also Read : HBD Sandeep Kishan: రోజూ 350మందికి అన్నదానం.. త్వరలో పేదల కోసం మరో పనికి శ్రీకారం..!
నిర్మాతగా సక్సెస్
సమంత నిర్మాతగా రూపొందిన సినిమా శుభం. ఈ సినిమాకి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు క్లోజ్ అయినట్టే. జీ ఛానెల్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొంది. నెట్ఫ్లిక్స్ సంస్థతో ఓటీటీ బేరాలు ఓ కొలిక్కి వచ్చినట్టే తెలుస్తుంది. ఈ రెండు డీల్స్‌తోనే ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్ సొంతం చేసుకోబోతోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సమంత నిర్మాతగా వేసిన తొలి అడుగు సక్సెస్ అయినట్టే. ఈరోజు హైదరాబాద్ లో మూడు థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్ షోలు ఉన్నాయి. మూడూ హౌస్ ఫుల్స్ అయ్యాయి. మరిన్ని థియేటర్లు ఓపెన్ అయ్యే ఛాన్సుంది. ఇకపోతే ఈ సినిమా మొదటిసారి చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అనే దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన స్పీచ్ లో కూడా తెలిపాడు.
Also Read : Shrasti Verma on Jani Master : జానీపై పోరాటం చేయకపోతే చచ్చిపోయే దాన్ని… శ్రేష్టి వర్మ సంచలన కామెంట్