Big Stories

Indian Motor bikes beats China in Africa: ప్రపంచంలో దుమ్మురేపుతున్న ఇండియన్ టూ వీలర్స్.. ఆఫ్రికాలో 160 చైనా కంపెనీలు పరార్!

Indian Motor bikes beat China in Africa: చైనా, ఇండియా, ఇండోనేషియా, వియత్ నామ్, ఈ నాలుగు దేశాలు ప్రపంచంలో అన్నింటి కంటే ఎక్కువ టూ వీలర్స్ manufacturing, sales చేస్తున్నాయి. ఈ నాలుగింటిలో సొంతంగా పెద్ద టూ వీలర్ బ్రాండ్స్ ఉన్న దేశాలు.. చైనా, ఇండియా మాత్రమే. మిగతా రెండు.. ఇండోనేషియా, వియత్ నామ్‌లో జపాన్ కంపెనీలదే హవా.

- Advertisement -

చైనాలో పెద్ద చిన్న.. అన్నీ కలిపి 200కు పైగా మోటర్ సైకిల్ కంపెనీలున్నాయి. జపాన్‌లో 4 పెద్ద మోటర్ సైకిల్ బ్రాండ్స్ ఉన్నాయి. అదే ఇండియాలో అయితే మొత్తం 6 పెద్ద మోటర్ బైక్ బ్రాండ్స్ ఉన్నాయి.

- Advertisement -

2021 టూ వీలర్ సేల్స్ అండ్ రెవిన్యూ report చూస్తే..

ప్రపంచంలోని టాప్ 10 మోటర్ బైక్ కంపెనీలలో నాలుగు ఇండియన్ కంపెనీలే.. మూడు మాత్రం జపాన్ కంపెనీలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. చైనాలో 200 కంపెనీలున్నప్పటికీ.. ఒక్కటి కూడా ఈ లిస్ట్‌లో లేకపోవడం.

ఇండియన్ బ్రాండ్ మోటర్ బైక్స్‌కి.. ఈ టాప్ 10 లిస్టులో చోటు దక్కడానికి కారణం.. చూస్తే.. ఇండియాలో తయారయ్యే బైక్స్ కేవలం ఇండియాలోనే ఎక్కువ సేల్ అవడం కాదు.. ప్రపంచమంతగా export కావడం. ఇండియాలో అత్యధిక జనాభా ఈ మోటర్ బైక్స్‌పైనే ప్రయాణిస్తుంది.

ఇండియాలో అతిపెద్ద మోటార్ బైక్స్ బ్రాండ్.. Bajajకు వచ్చే ఆదాయంలో 50 percent వేరే countriesకు చేసే exports రూపంలోనే వస్తోంది. Bajaj కంపెనీ తయారు చేసే బైక్స్ 70 దేశాలలో సేల్ అవుతున్నాయి. అలాగే TVS 60 దేశాల్లో, HERO కంపెనీ 40 దేశాల్లో తమ బైక్స్ సేల్ చేస్తున్నాయి.

ఇండియన్ బైక్స్‌కు ఇతర దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో ఇండియన్ బైక్స్ రాజ్యమేలుతున్నాయి. అయితే ఆఫ్రికాలో ఇండియన్ బైక్స్ కంటే ముందు చైనాకు సంబంధించిన మొత్తం 200 కంపెనీలు తమ బైక్స్‌ని సేల్ చేసేవి.

కానీ 200 చైనీస్ కంపెనీలను కేవలం రెండు ఇండియన్ కంపెనీలు బజాజ్ , టివిఎస్ తమ రెండు మూడు బైక్ మాడల్స్‌తో TOUGH COMPETITION ఇచ్చాయి. ఈ దెబ్బకు తట్టుకోలేక 160 చైనా కంపెనీలు ఆఫ్రికాలో మూతబడ్డాయి. ఇప్పుడు ఆఫ్రికాలో 200 చైనా కంపెనీల్లో 40 కంపెనీలు బిజినెస్ చేస్తున్నాయి.

ఆఫ్రికాలో ఇండియన్ కంపెనీల హవా ఎలా మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ మోటర్ బైక్స్ మార్కెట్ ఎలా ఉంది? అనే అంశాలను ఓసారి చూద్దాం.


ఇండియాలో టోటల్ వెహికల్ సేల్స్‌లో 75 percent–two wheelers సేల్ అవుతున్నాయి. వీటిలో కూడా 100cc నుంచి 150cc రేంజ్ గల బైక్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి.

పైగా ఇండియాలో ఇండియన్ బ్రాండ్స్‌తో పాటు జపానీస్, యూరోపియన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. భారతదేశంలో మీరు ఎక్కడ చూసినా ప్రజలు ఎక్కువగా బైక్స్ పైనే ప్రయాణం చేస్తుంటారు. గ్రామాలు, సిటీస్, కొండ ప్రాంతాలు అని తేడా లేకుండా బైక్స్‌పై ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు.

ఇండియాలో motor bikes రంగంలో ఎన్నో challenges ఉన్నాయి. Indian geography, budget, commercial, mileage, service ఇలా అన్ని సవాళ్లను ఎదుర్కొనే విధంగా కంపెనీలు ఈ బైక్స్ తయారు చేస్తున్నాయి. ఇండియాలో 350cc లోపు ఉన్న బైక్స్ మాత్రమే సేల్ అవుతాయి.

ఇండియన్ economy, Geography.. diverseగా ఉండడంతో మోటర్ బైక్స్ కంపెనీలు కూడా diversifiedగా ఇన్ని వెరైటీలలో బైక్స్ తయారు చేస్తున్నాయి. అందుకే ఈ బైక్స్ మిగతా third world countriesకు కూడా ఉపయోగకరంగా మారాయి.

Third world countriesలో ముఖ్యంగా ఇండోనేషియా, వియత్నామ్, నైజిరియా, కొలంబియా, మెక్సికో దేశాల్లో ఇండియన్ బైక్స్‌ని ప్రజలు ఇష్టపడుతున్నారు.

For example TVS COMPANY– STAR CITY BIKEని… Sri Lanka, Coloumbia దేశాలలో export చేస్తోంది. ఆ దేశాలలో ప్రజల ఆదాయం తక్కువగా ఉండడంతో ఇండియన్ బైక్స్ వాళ్లకి అందుబాటు ధరలో లభిస్తున్నాయి. పైగా ఈ బైక్ maintenance తక్కవ ఖర్చులోనే అయిపోతుంది.

ఇంకో example bajaj pulsar. ఈ బైక్ Spain, Peru, Phillippines, Columbiaలో బాగా సేల్ అవుతోంది.

ఈ బైక్స్ తక్కువ బడ్జెట్‌లో మంచి reliability ఇస్తుండడంతో ఆ దేశాలలో ఈ బైక్స్‌కి మంచి డిమాండ్ ఉంది.

ఈ రెండు బైక్స్‌ తరువాత Hero splendor గురించి చెప్పుకోవాలి. splendor– ఇండియాలో అన్నిటి కంటే ఎక్కువగా సేల్ అయ్యే బైక్. ఈ బైక్‌కు ఇండియాలోనే కాదు నైజీరియా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీ లంక లాంటి దేశాలలో బాగా సేల్ అవుతోంది.


కానీ ఆఫ్రికాలో వచ్చేసరికి.. ఈ బైకులన్నీ ఒకవైపు Bajaj Boxer బైక్ ఒకవైపుగా పరిస్థితి ఏర్పడింది. 2000 దశాబ్దం ప్రారంభం వరకు ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా చైనా మోటార్ బైక్స్ మాత్రమే అమ్ముడయ్యేవి. దీనికి ప్రధాన కారణం.. ఆఫ్రికా దేశాలలోని పేదరికం. ఆఫ్రికాలో జపాన్ నుంచి హై క్వాలిటీ బైకులు.. కూడా import అవుతున్నాయి. కానీ జపనీస్ బైక్స్ చాలా costly కావడంతో పేద ఆఫ్రికన్లకు చైనా బైకులే దిక్కయ్యాయి.

కానీ చైనా బైక్స్‌తో ఆఫ్రికన్లు చాలా ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా చైనాలో తయారయ్యే బైక్స్ విడిభాగాలు మాత్రమే ఆఫ్రికా వచ్చేవి. ఆ విడిభాగాలను లోకల్ మెకానిక్‌ల వద్ద తీసుకుపోయి.. assemble చేయించుకోవాల్సిన పరిస్థితి. పైగా ఆఫ్రికాలోని ఎగుడు దిగుడు రోడ్ల కారణంగా ఈ బైక్స్ తరుచూ పాడయ్యేవి. దీనికి తోడు చైనా కంపెనీలు తమ బైక్స్ కోసం after sales serviceని ఆఫ్రికాలో ఏర్పాటు చేయలేదు. దారి మధ్యలో బైక్ రిపేర్ వస్తే.. ఇక అంతే సంగతులు.

ఈ పరిస్థితుల్లో ఇండియన్ కంపెనీలైన బజాజ్, TVS AFRCIA MARKETలో ఎంట్రీ ఇచ్చాయి. అయితే ప్రారంభంతో ఇండియన్ కంపెనీలు కూడా ఆఫ్రికా మార్కెట్‌ని అంచనా వేయడంలో తప్పుచేశాయి. చైనా లాగే తక్కువ క్వాలిటీ బైక్స్ ఎగుమతి చేసి.. after sales service పెట్టలేదు. అందుకే fail అయ్యాయి. కానీ తాము ఎక్కడ పొరపాటు చేశామనే అంశాన్ని పరిశీలించి.. ఆఫ్రికాలో ఎలాంటి బైకులు కావాలో తెలుసుకొని మళ్లీ రంగంలోకి దిగాయి.

అందుకే జపాన్ బైకు లాంటి క్వాలిటీ బైకుని.. చైనా బైకు ధరకు ఆఫ్రికాలో అందుబాటులోకి తీసుకొచ్చాయి. పైగా ఆఫ్రికా యువత, మెకానిక్‌లకు శిక్షణ ఇచ్చి అక్కడి డీలర్ల partnershipతో బైక్ రిపేర్ సర్వీసులు ప్రారంభించాయి.

ఇది చూసిన ఆఫ్రికన్లు.. జపాన్, చైనా బైకులని కాదని.. ఇండియా బైకుల మోజులో పడ్డారు. బజాజ్ బాక్సర్‌ ఇప్పుడు ఆఫ్రికాలో అత్యధికంగా సేల్ అయ్యే మోటార్ బైక్. దీనికి తోడు TVS కంపెనీ బైకులైనా HLX, Starcity బైకులు కూడా బాగా సేల్ అవుతున్నాయి.

ఆఫ్రికాలో బైకులంటే రోడ్లపై ఎంజాయ్ చేయడమే కాదు.. ఆఫ్రికన్లు టాక్సీలు, ఆంబులెన్సులకు కూడా బైకులని వాహనాలుగా వాడుతున్నారు. ఇండియన్ బైక్స్ క్వాలిటీగా ఉండడంతో ఆఫ్రికన్లు వాటిని సరుకు రవాణా చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు.

ఆఫ్రికన్లు ‘బోడా బొడా’ అంటే బైక్ టాక్సీల కోసం బజాజ్ బాక్సర్, TVS Starcityని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెలిసింది. బోడా బోడా టాక్సీ నడిపే వారు ఎక్కువగా పేదలే. అందుకే వారు సెకండ్ హ్యాండ్ బైక్స్‌ కొంటారు. బజాజ్ బాక్సర్ లక్షల కిలోమీటర్లు నడిపినా.. ఎక్కువ రిపేర్లు ఉండవు. అందుకే ఆఫ్రికాలోని మలావి దేశంలో బాక్సర్ సెకండ్ హ్యాండ్.. బైక్స్ బాగా అమ్ముడుపోతున్నాయి. మలావిలో రోడ్లు సరిగా లేకపోవడంతో అక్కడి ప్రజలు.. అందరూ బజాజ్ బాక్సర్ 150cc నే prefer చేస్తున్నారు.

చైనా బైకులు.. త్వరగా రిపేర్లు రావడంతో.. ఆఫ్రికన్లు ఇక చైనా కంపెనీ బైక్స్ వైపు చూడడం లేదు. ఈ కారణంగానే చైనాకు చెందిన 200 మోటార్ బైక్ కంపెనీలలో 160 కంపెనీలు ఆఫ్రికా నుంచి దుకాణం సర్దేశాయి. మిగతా 40 కంపెనీలు కూడా రేపో మాపో జెండా ఎత్తేసే స్థితిలో ఉన్నాయి.

వీటికి తోడు ఇండియా కంపెనీల goodwill వల్ల ఆఫ్రికాలో public transport కోసం బజాజ్ Maxima, TVS King ఆటో రిక్షాలు కూడా బాగా సేల్ అవుతున్నాయి.

Read More :  కతార్‌లో మరణ శిక్ష పడిన భారత నేవీ ఆఫీసర్లు విడుదల.. తెరవెనుక అసలేం జరిగింది?

So ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ మోటార్ బైక్స్ విజయం సాధిస్తున్నాయి. ఈ విజయం వెనుక ఉన్నది.. ఇండియన్ మెకానికల్ ఇంజినీర్స్ టాలెంట్..

అయితే ఇండియాలో మెకానికల్ ఇంజినీర్స్ సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఈ విషయంలో ‘Wheesl Emi’ కంపెనీ MD– Srinivas Kantheti(శ్రీనివాస్ కంతేఠి) ఆందోళన వ్యక్తం చేశారు. స్వతహాగా మెకానికల్ ఇంజినీర్ అయిన శ్రీనివాస్ ఒక Interviewలో మాట్లాడుతూ.. early 2000sలో తాను బజాజ్ కంపెనీలో HRగా పనిచేస్తున్నప్పుడు.. కంపెనీ కోసం 100 మెకానికల్ ఇంజినీర్స్ అవసరమయ్యారు. దీంతో బజాజ్ తరపున IIT Delhi studentsని job interview చేశానని అన్నారు. కానీ talented mechanical engineers దొరకలేదని.. దాదాపు 15 కాలేజీలలో Interview చేస్తే.. 10 మంది మాత్రమే Interviewలో select అయ్యారని తెలిపారు. అది కూడా మార్కెట్ కంటే 3 రెట్లు salary ఎక్కువ ఇచ్చి తీసుకున్నామని తెలిపారు. దీనికి కారణం చాలా మంది mechanical engineers.. ఇంజినీరింగ్ పూర్తి చేశాక.. కంప్యూటర్ కోడింగ్ జాబ్స్ వైపు వెళుతున్నారని అన్నారు. ఆ జాబ్స్‌లో high salaries ఉండడంతోనే students.. mechanical engineers కోసం రావడం లేదని చెప్పారు.

పైగా IITలో Interview చేస్తే.. toppers కనీసం plan and Elevation చూసి side view draft చేయలేకపోయారని ఆశ్చర్యంగా అన్నారు. అందుకే చిన్న చిన్న కాలేజీల్లో చదువుకున్న వారైనా సరే.. mechanical engineering passion ఉన్నవారిని .. english రాకపోయినా సరే.. టాలెంట్ ఉంటే చాలు అని తీసుకున్నామని చెప్పారు.

మరోవైపు అదే సమయంలో TVSకు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని అన్నారు.

ఇదంతా చూస్తుంటే.. ఒక విషయం క్లియర్‌గా చెప్పొచ్చు.. ఇండియాలో ఈ తరం students చాలామంది mechanical engineering పట్ల సీరియస్‌గా లేరని. ఒకవేళ mechanical engineers ఉన్నా.. వారికి కాలేజీల్లో Practical training ఇవ్వడం లేదు. లేదా సాలరీ తక్కువ కారణంగా students mechanical engineering తీసుకోవడం లేదు.

Two wheelers manufacturingలో చైనా కంటే ఇండియా ముందంజలో ఉన్నా.. ఈ రంగంలో టాప్‌లో ఉండాలంటే.. కొత్త కొత్త డిజైన్లు చేసే Talented mechanical engineers చాలా అవసరం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News