Big Stories

Air Asia & Air India Express : విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. టిక్కెట్ ధరలు భారీ తగ్గింపు

Air Asia And Air India Express Offers: ఎయిర్ ఏషియా ప్రయాణికులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. జీరో బేస్ ఫేర్ వద్ద టిక్కెట్లను అందిస్తోంది. చెక్-ఇన్ బ్యాగేజీ రహిత ప్రయాణం కోసం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ధరలతో ప్రయాణికులను ఆకర్షిస్తోంది.

- Advertisement -

అసౌకర్యం లేకుండా ఉండేందుకు , తక్కువ ధరకే టిక్కెట్ పొందేందుకు చాలా ముందుగానే విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవడం ఒక సాధారణ పద్ధతి. అయితే ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లు కొన్ని అద్భుతమైన ఆఫర్లు ప్రకటించాయి. ఈ తగ్గింపులతో ప్రయాణికులు ఆనందంగా ఉన్నారు. ఎయిర్ ఏషియా కేవలం రూ. జీరో బేస్ ఫేర్ వద్ద టిక్కెట్లను అందిస్తోంది. విమాన ప్రయాణికులకు డబ్బులను మిగులుస్తుంది. ఈ ఆఫర్‌లను పొందేందుకు టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.

- Advertisement -

త్వరగా విహారయాత్రకు ప్లాన్ చేస్తున్నా ఈ ఎయిర్‌లైన్స్‌లో ప్రతిఒక్కరికీ ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి. ఈ అద్భుతమైన ఆఫర్ల ప్రయోజనాన్ని పొందండి. ప్రయాణ అనుభవాన్ని మరింత ఆనందదాయకంగా చేసుకోండి.

ఎయిర్ ఏషియా బిగ్ బేస్ ఫేర్ సేల్..
ఎయిర్ ఏషియా జీరో బేస్ ఫేర్ సీట్ల బిగ్ సేల్ క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రమోషన్ ద్వారా ప్రయాణికులు కేవలం రూ. జీరో నుంచి బేస్ ఫేర్‌తో విమానాలను బుక్ చేసుకోవచ్చు. జీరో బేస్ ఫేర్ కు ప్రయాణికులు విమానాశ్రయ పన్ను, సంబంధిత రుసుములు మాత్రమే చెల్లించాలి. తద్వారా వారు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే అవకాశం కలుగుతుంది.

Read More: భారత్ కార్ల మార్కట్‌లోకి మిత్సుబిషి..

ప్రయాణికులు విశాఖపట్నం, జైపూర్, త్రివేండ్రం, అహ్మదాబాద్‌తోసహా భారతదేశంలోని వివిధ నగరాల నుంచి కౌలాలంపూర్‌కు నేరుగా విమానాలను బుక్ చేసుకోవచ్చు. బ్యాంకాక్‌కు వెళ్లాలనుకునే వారికి ఎయిర్ ఏషియా లక్నో, గౌహతి నగరాల నుంచి సీటు కోసం ఎలాంటి ఖర్చు లేకుండా నేరుగా విమాన సర్వీసులను అందుబాటులో ఉంచింది. అదనంగా ప్రయాణికులు కౌలాలంపూర్ నుంచి మరిన్ని అంతర్జాతీయ విమానాలను ఎంచుకోవచ్చు.

బుకింగ్ వివరాలు..
ట్రావెల్ ఔత్సాహికులు 2024 జూన్ 18 -2024 సెప్టెంబర్ 1 మధ్య ప్రయాణం కోసం 2024 ఫిబ్రవరి 25 లోపు తమ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం ద్వారా ఈ అద్భుతమైన సేల్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ఆ సంస్థ వెబ్‌సైట్‌, యాప్ ను ఉపయోగించుకోవచ్చు.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆఫర్లు..
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ‘ఎక్స్‌ప్రెస్ లైట్’ ఛార్జీలను ప్రవేశపెట్టింది. ఇందులో చెక్-ఇన్ బ్యాగేజీ లేకుండా ప్రయాణించే ప్రయాణికులకు ఎయిర్‌లైన్ తక్కువ ధరలకు టిక్కెట్లు అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్‌లో ప్రయాణికులు 7 కిలోల క్యాబిన్ బ్యాగేజీని తీసుకెళ్లవచ్చు. అదనంగా 3 కిలోలు ఉచితంగా ప్రీ-బుక్ చేసుకోవచ్చని ఎయిర్‌లైన్స్ తెలిపింది.

అదనపు 3 కిలోల క్యాబిన్ లగేజీని ప్రీ-బుక్ చేసుకునే అవకాశంతోపాటు, ప్రయాణికులు అదనపు లగేజీని తర్వాత చెక్ ఇన్ చేయవలసి వస్తే తగ్గించిన అదనపు “చెక్-ఇన్ బ్యాగేజీ” పరిమితులను కూడా ప్రీ-బుక్ చేయవచ్చు. విమానయాన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికులు చెక్-ఇన్ బ్యాగేజీని కేవలం దేశీయ విమానాల్లో 15 కిలోలకు రూ. 1000 , అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు రూ. 1300.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇలా ట్వీట్ చేసింది. “#Xpress Liteతో మీ ప్రయాణాలను తేలిక చేసుకోండి. ప్రత్యేక క్యాబిన్ బ్యాగ్ కు మాత్రమే ఛార్జీలు. మరింత ఆదా చేసుకోండి. క్యూ లేదు. 7 కిలోల క్యాబిన్ సామాను తీసుకెళ్లండి. అదనంగా 3 కిలోలు ఉచితంగా బుక్ చేసుకోండి”

ప్రయాణికులు తమ వెబ్‌సైట్‌లోగానీ యాప్‌లో ఈ ఆఫర్లను తెలుసుకోవచ్చు. విమానాశ్రయంలోని ఎయిర్‌లైన్ కౌంటర్‌లలో చెక్-ఇన్ బ్యాగేజీ సేవలను కూడా కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News