E-Paper
Advertisement

Screen Time: ఫోన్ లేకుంటే బతకలేమా?.. మీ మొబైల్ అడిక్షన్‌కు చెక్ పెట్టే సింపుల్ ట్రిక్స్ ఇవే!

Screen Time: ఫోన్ లేకుంటే బతకలేమా?.. మీ మొబైల్ అడిక్షన్‌కు చెక్ పెట్టే సింపుల్ ట్రిక్స్ ఇవే!
Advertisement

Screen Time: ఫోన్ తో లేచి- ఫోన్ తో తింటూ ఫోనే తాగుతూ- ఫోనే లోకంగా బతికేస్తూ.. తిరిగి ఫోన్ తో పడుకుంటున్న జమానాలో ఉన్నాం. గుండె లేకుంటే బతుకుతామో లేదోగానీ, ఫోన్ లేనిదే బతకలేం అనే కండీషన్ కి వచ్చేశాం. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తోందో తెలుసా? మన భారతీయుల స్క్రీన్ టైం లక్ష కోట్ల గంటలట. ఏంటి ఆశ్చర్యకరంగా ఉంది కదూ? మరి స్క్రీన్ టైమ్ తగ్గించాలంటే మనమేం చేయాలి? నిపుణులు సూచిస్తున్న పరిష్కార మార్గాలేంటి?

టెకీ ఎక్స్ పర్ట్స్..

మొదట మీ స్క్రీన్ టైంలో ఏ ఫీచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారో గమనించమంటారు నిపుణులు. అందుకే ఇన్ స్టా, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి వాటిలో మీరు ఎక్కువగా దేనిపై గడుపుతారో ఐడెంటిఫై చేయాలి. వీటిపై ఒక డైలీ టైమ్ లిమిట్- సెట్ చేసుకోవాలి. ఆ టైం ఐపోగానే.. ఇక అది కూడా లాక్ అయిపోతుంది. ఇందువల్ల మీలో ఒక కంట్రోల్ వస్తుందని అంటారు టెకీ ఎక్స్ పర్ట్స్.

Advertisement

Also read: Urban Bill: జీహెచ్‌ఎంసీ చట్టం రద్దు.. సరికొత్త పాలనపై ముసాయిదా విడుదల!

పుస్తకాలు చదివే అలవాటు..

ఫోన్ వైబ్రేట్ అయినా, టోన్ వచ్చినా వెంటనే స్క్రీన్ వైపు చూడ్డం ఒక అలవాటుగా మారిపోతుంది. కాబట్టి అవసరమైన కాల్స్, మెసేజెస్ తప్ప.. మిగిలిన సోషల్ మీడియా నోటిఫికేషన్స్ ఆపమని చెబుతారు. ఫోన్ స్క్రీన్ ని గ్రేస్కేల్ మోడ్ లోకి మార్చండి. స్క్రీన్ రంగులు కోల్పోయాక ఫోన్ ని ఎక్కువ సేపు చూడాలనే ఆసక్తి తగ్గిపోతుందంటారు నిపుణులు. ప్రత్యామ్నయంగా పుస్తకాలు చదివే అలవాటు పెంచుకోవడం మరింత మేలు చేస్తుందని కూడా చెబుతారు.

నో ఫోన్ జోన్స్..

Advertisement

ఇంట్లో కూడా నో ఫోన్ జోన్స్ తో పాటు నో ఫోన్ టైమ్స్ అనే కల్చర్ శ్రీకారం చుట్టడం మంచిది. మరీ ముఖ్యంగా బెడ్ రూమ్ లోకి ఫోన్ నాట్ అలౌడ్ అనే నియమం పెట్టుకోవడం ఇంకా మేలు చేస్తుంది. కనీసం పడుకునే ముందు అరగంట నుంచే ఫోన్ ని పక్కన పెట్టడం మంచిదంటారు మానసిక వైద్య నిపుణులు. మరి మనోళ్లు ఈ పరిష్కార మార్గాలు అన్వేషిస్తారా? లేక అభ్యంతరకరమైన స్క్రీన్ టైం మరింత ఎక్కువ పెంచుతారా?

Also read: Vizag Metro: వైజాగ్ మెట్రోకు ఇంకా రాని క్లియరెన్స్.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా మారిన ప్రాజెక్ట్!

Related News

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

బొద్దింకలతో కలిసి మోడీకి బుద్ది చెప్పేందుకు! కాక్రోచ్‌ పార్టీ వేదికగా యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి ప్రకాశ్ రాజ్‌.. అంతిమ లక్ష్యం కేంద్రం మెడలు వంచడం..!

ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!

ఉపాధి హామీ పనుల్లో సంచలన రికార్డ్.. గత ఐదేళ్లలో ఇదే టాప్ హజరు శాతం

ఆ నలుగురు… ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు..! ప్రభుత్వ పతనంపై రాహుల్‌ శపథం..! ఆ నలుగురు టార్గెట్‌గా ఢిల్లీ ఆందోళన..

ఎలాన్ మస్క్ సంచలన పోస్ట్.. స్టార్‌లింక్ రాకపై భారత్‌లో మళ్లీ చెలరేగిన వివాదం!

Big Stories

Advertisement
×