E-Paper
Advertisement

Ambani: కృష్ణ, పృథ్వీ.. అంబానీ ఇంట అచ్చమైన పేర్లు..

Ambani: కృష్ణ, పృథ్వీ.. అంబానీ ఇంట అచ్చమైన పేర్లు..
Advertisement

Ambani: దేశంలోకే అత్యంత ధనవంతుడు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి వెలలేని సంపద. అయినా, సింపుల్ గానే ఉంటారు. భారతీయత, ఆధ్యాత్మికతకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. గుజరాతీ వైశ్య కుటుంబం.. విలువలతో కూడిన జీవనం.. ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోని మంచితనం.. అంబానీ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. తాజాగా, ముకేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. ఆయన కూతురు ఈశా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ చిన్నారులకు పెట్టిన పేర్లలో మరోసారి భారతీయత ఉట్టిపడింది.

పిల్లలకు పేరు పెట్టడానికి చాలామంది చేసే పనేంటి? గూగుల్ లో వెతికి.. నోరు తిరగని పేరు సెలెక్ట్ చేసుకోవడం. ఆ పేరు ఎంత కొత్తగా ఉంటే అంత క్రేజ్ అనుకుంటారు. పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత గ్రేట్ అనుకుంటారు. చాలామందికి ఆ పేరుకున్న అర్థం ఏంటో కూడా తెలీకపోవచ్చు. పాష్ గా, మోడ్రన్ గా ఉందని పెట్టేస్తుంటారు. పాతకాలం పేర్లు పెట్టే సాహసం ఈ రోజుల్లో ఎవరూ చేయడం లేదు. దేవుడి పేర్లు పెట్టే అలవాటు చాలా తగ్గిపోయింది. గతంలో వీధికో శ్రీనివాస్, రాము, కృష్ణ, గోపాల్, లక్ష్మీ, రమ, తులసీ.. ఇలా ఉండేవారు. ఇప్పుడు అలాంటి పేర్లు వినిపించడం తక్కువే. ఇంతకీ అంబానీ వారసులకు ఎలాంటి పేర్లు పెట్టారు? తమ హోుదాకు తగ్గట్టు అల్ట్రా మోడ్రన్ నేమ్స్ పెట్టారా? ట్రెడిషనల్ పేర్లా?

Advertisement

ఈశా అంబానీ, ఆనంద్ పిరమాల్ జంటకు కవల పిల్లలు పుట్టారు. ఒకరు బాబు, ఇంకొకరు పాప. అమ్మాయి పేరు ఆదియా. బాబు పేరు కృష్ణ. అబ్బా.. ఎంతచక్కగా ఉన్నాయీ పేర్లు. కృష్ణ. ఈ కాలంలో కృష్ణ అనే పేరు పెట్టడమే తగ్గిపోయింది. సంపన్నుల ఇంట్లో అస్సలు ఊహించలేం. అలాంటిది అంబానీ మనవడికి కృష్ణ పేరు పెట్టారంటే.. లార్డ్ కృష్ణపై వారికున్న భక్తికి నిదర్శనం. గుజరాతీ కుటుంబం కావడంతో బేసిక్ గా కృష్ణుడిపై ఎక్కువ అభిమానమే ఉంటుంది. ఎంత భక్తి ఉన్నా లక్షల కోట్ల సంపద వారసుడికి అలా శ్రీకృష్ణుడి పేరు పెట్టడం అభినందనీయం.

ఇక, ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులు రెండేళ్ల క్రితం బాబుకు జన్మనిచ్చారు. ఆ పిల్లాడికి పృథ్వీ అని పేరు పెట్టారు. తండ్రి ఆకాశ్, తనయుడు పృథ్వీ. అంటే పంచభూతాల పేర్లు. ఇలా, అంబానీ కుటుంబం దేశంలోనే అత్యంత సంపన్న ఫ్యామిలీగా ఉంటూ.. వారి వారసుల పేర్లలో.. ఈశా, ఆకాశ్, అనంత్, పృథ్వీ, కృష్ణ, ఆదియా.. ఇలా సింప్లిసిటీ, భారతీయత కనబరచడం విశేషం.

Tags

Related News

ట్రంప్ మాస్టర్ స్ట్రోక్.. భారతీయులకు బిగ్ షాక్!

సభా సమరంలో ఓడినా.. ఇలా సబ్జెక్టుతో కొడతాం! కరెంటు కష్టాలపై సర్కార్‌ను నిలదీసిన బీఆరెస్‌!

సైలెంట్‌గా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ సీరియస్.. కాంగ్రెస్‌కు జై కొడతారా?

తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ దళిత్ వర్సెస్ దొరలు.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా!

అసెంబ్లీలో BRS వ్యూహం రివర్స్.. ప్రభుత్వం చేతికి చిక్కిన ప్రతిపక్షం!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

ఇక కురుక్షేత్రమే వచ్చే ఎన్నికల్లో నేనేంటో చూపిస్తా: జగన్

Big Stories

Advertisement
×