BigTV English

Chiranjeevi: చిరంజీవికి అందుకేనా అవార్డు?.. మోదీజీ ఏంటి సంగతి?

Chiranjeevi: చిరంజీవికి అందుకేనా అవార్డు?.. మోదీజీ ఏంటి సంగతి?

Chiranjeevi: పైపైన చూస్తే అంతా మామూలుగానే అనిపిస్తుంది. తరచి చూస్తే కానీ అర్థంకాదు లోలోన ఏం జరుగుతుందో. రాజకీయాల్లో మరీను. బయటకి ఒకలా, లోన ఇంకోలా. మెగాస్టార్ చిరంజీవి విషయంలోనూ ఏదో జరుగుతోందనే అనుమానం. మెగాస్టార్ కు లేటెస్ట్ గా జాతీయ స్థాయి అవార్డు రావడం వెనుక సంథింగ్ సంథింగ్ అనే ఊహాగానం.


ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్- 2022.. పురస్కారం చిరంజీవిని వరించడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం. ఆ అవార్డుకు మెగాస్టార్ వందకు వందశాతం అర్హుడు. అందులో నో డౌట్. చిరుకు పద్మ విభూషన్ ఇచ్చినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. అయితే, ఈ అవార్డు ఇచ్చిన సమయం, సందర్భమే రాజకీయ ఊహాగానాలకు ఛాన్స్ ఇస్తోంది. అవార్డు వెనుక ఇంకేదో ఉందనే అనుమానం కలిగిస్తోంది.

చిరంజీవిని ప్రతిష్టాత్మక పురస్కారం వరించడంపై ప్రధాని మోదీ సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇదే మోదీ.. ఇటీవల ఏపీ పర్యటనలో పవన్ కల్యాణ్ తో సమావేశమై పలు రాజకీయ అంశాలపై చర్చించారు. కేటాయించిన సమయాన్ని మించి.. అరగంటకు పైగా ముచ్చటించి.. పవన్ కు టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేనల మధ్య అధికారికంగా పొత్తు ఉంది. తెలంగాణ తర్వాత బీజేపీ నెక్ట్స్ ఫోకస్ ఏపీపైనే అంటున్నారు. జగన్ తో అనధికార మైత్రి కొనసాగుతున్నా.. ఆంధ్రాలో సొంతంగా ఎదగాలనేది కమలనాథుల వ్యూహం. అందుకు, పవనే వారికున్న బెస్ట్ ఆప్షన్.


ఆంధ్రప్రదేశ్ లో మెగా ఫ్యామిలీ అభిమాన బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీజేపీ వేగంగా ప్రజల్లోకి వెళ్లడానికి.. మెగా సపోర్ట్ షార్ట్ కట్. అందుకే, ఇటు పవన్ ను, అటు చిరంజీవిని తమవాడేనని చెప్పేలా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇటీవల అల్లూరి శతజయంతి వేడుకల్లోనూ చిరంజీవికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు మోదీ. లేటెస్ట్ గా, మెగాస్టార్ కి జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వడం.. మరింత దగ్గర కావడమే అంటున్నారు.

మెగా ఫ్యామిలీతో టచ్ లో ఉంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రజల ఆదరణ కూడా లభిస్తుందనేది కమలనాథుల అంచనా కావొచ్చు. ఏపీ, తెలంగాణ అనే కాదు.. చిరు ఇమేజ్ పాన్ ఇండియా రేంజ్. తమిళనాడు, కర్ణాటకలోనూ ఫుల్ పాపులారిటీ. అందుకే, దక్షిణాదిని పూర్తి స్థాయిలో జయించాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న కమలదళం.. చిరంజీవి రూపంలో సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసిందనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఆ లెక్కన మెగాస్టార్ రూపంలో బిగ్ టార్గెట్ నే ఎయిమ్ చేసినట్టుంది బీజేపీ.

ఇక, పవన్ కల్యాణ్ రాజకీయాలకు తగినవాడని, ఏదో ఒక రోజు ఉన్నత స్థానంలో చూస్తామంటూ అన్నయ్య చేసిన డైలాగ్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. రాజకీయంగా ఉన్నత స్థానం అంటే..? ఇంకేముంటుంది సీఎం కుర్చీనే కదా? సో, పవన్ కల్యాణ్ ని ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిగా చూస్తామనేది మెగాస్టార్ భావన కావొచ్చు. చిరంజీవి ప్రస్తుతానికి రాజకీయంగా న్యూట్రల్ గా ఉన్నా.. జగన్ తో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నా.. ఆయన మనసంతా తమ్ముడి మీదనే ఉంటుందనేది కాదనలేని వాస్తవం. ఇటు అన్నయ్య ఇమేజ్.. అటు తమ్ముడి పవర్.. రెండూ కలిస్తే..? అందుకే, ఆ అన్నాదమ్ముళ్లు ఇద్దరూ తమవారేననే మెసేజ్ ఇచ్చేలా.. బీజేపీ పవన్, చిరంజీవి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు.

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×