BigTV English

Daggubati Purandeswari: కేంద్ర స్థాయిలో దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ ఇచ్చే పదవి ఇదేనా?

Daggubati Purandeswari: కేంద్ర స్థాయిలో దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ ఇచ్చే పదవి ఇదేనా?

Daggubati Purandeswari: చిన్నమ్మకు పెద్ద పెదవి రాబోతోందా..? అందుకే కమలం అధిష్టానం ఆమెను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిందా..? పెహల్గామ్ అటాక్‌పై అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడే అవకాశాన్ని ఇప్పటికే ఆమెకు కల్పించిన బీజేపీ అగ్రనేతలు.. ఢిల్లీ స్థాయిలో మరింత కీరోల్ ఇవ్వబోతున్నారా..? ఇంతకీ ఈ మొత్తం వ్యవహారంలో కాషాయ పార్టీ ఆలోచన ఏంటి..?


దగ్గుబాటి పురందేశ్వరికి పెద్ద పదవి రాబోతోందా..?

దగ్గుబాటి పురందేశ్వరి..! రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. ఇలాంటి లీడర్‌కు రాబోయే రోజుల్లో పెద్ద పదవి ఇవ్వాలని భావిస్తోందట బీజేపీ అధిష్టానం. ఇదే విషయంపై కమలం పార్టీ ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందట. ఎన్టీఆర్ కూతురుగా, నందమూరి బాలకృష్ణ సోదరిగా, సీఎం చంద్రబాబు బంధువుగా.. ఇలా అనేక కోణాల్లో రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమైన మహిళా నేత పురందేశ్వరి. కాంగ్రెస్‌ పార్టీ తరఫున 2004, 2009 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారామె. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేంద్రమంత్రిగానూ బాధ్యతలు నిర్వహించారామె.


ఏపీ విభజన తర్వాత బీజేపీలోకి ఎంట్రీ

రాష్ట్ర విభజన, అనంతర పరిణామాల్లో హస్తం పార్టీకి రాజీనామా చేసిన పురందేశ్వరి.. బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైనా.. పార్టీలో పలు పదవులు నిర్వహించారు. 2023 జులై 4న ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారామె. 2024 ఎన్నికల్లో రాజమహేంద్రవరం నుంచి ఎంపీగా బరిలో దిగి బంపర్ విక్టరీ కొట్టారు పురందేశ్వరి. అధికార, విపక్షాల మధ్య చావో రేవో అన్నట్లు సాగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. కూటమి పార్టీల విజయానికి తన వంతు కృషి చేశారు పురందేశ్వరి. అసలు.. రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పాటయ్యే విషయంలో పురందేశ్వరి సైతం గట్టి ప్రయత్నాలే చేశారట. రాష్ట్ర పార్టీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు టికెట్ల కేటాయింపులోనూ వ్యూహాత్మకంగా ఆమె వ్యవహరించారన్న ప్రచారం సాగింది. ఏపీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు, మూడు ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకోవడంలో పురందేశ్వరి కష్టం ఎంతో ఉందంటారు పార్టీ నాయకులు.

అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశం..

కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు పురందేశ్వరి. ఏవైనా ముఖ్యమైన అంశాలపై మాట్లాడాలన్నా కసరత్తు చేసి మరీ పూర్తి పరిజ్ఞానంతో మాట్లాడతారన్న పేరు పొందారు పురందేశ్వరి. దీంతో.. ఇటీవలె ఆమెకు అంతర్జాతీయ వేదికలపై మాట్లాడే అవకాశం కల్పించింది మోడీ సర్కారు. పెహల్గామ్ దాడి అనంతర పరిణామాల్లో పాకిస్తాన్ కుయుక్తుల్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు కేంద్రం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఓ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించారు పురందేశ్వరి. ఈ బృందాలే ఫ్రాన్స్, యూకే, ఈయూ, ఇటలీ, డెన్మార్క్, జర్మనీ దేశాల్లో పర్యటించి దాయాది వైఖరిని ప్రపంచ దేశాల ముందు ఎండగట్టాయి. అలా చూస్తే కేంద్రంలోనూ చిన్నమ్మకు పెద్ద పలుకుబడే ఉందన్న మాట విన్పిస్తోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ నియామకం

అయితే.. పార్టీలో, నాయకుల్లో మంచి పేరు సంపాదించుకున్న దగ్గుబాటి పురందేశ్వరి స్థానంలో ఇటీవలె మాధవ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది బీజేపీ అధిష్టానం. దీంతో.. ఈ మార్పు దేనికి సంకేతం అన్న చర్చలు ఏపీలో విస్తృతంగా నడుస్తున్నాయి. హస్తిన వర్గాల నుంచి వస్తున్న సమాచారం, జరుగుతున్న ప్రచారం చూస్తే చిన్నమ్మకు పెద్ద పదవి ఇచ్చేందుకే కమలనాథులు యోచిస్తున్నారట. ఇందుకు కారణాలను ఓసారి పరిశీలిస్తే.. ఏపీలో ప్రస్తుతం కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కమలనాథులు. రాబోయే రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. దీంతో.. అనేక ఆప్షన్లు పరిశీలించిన కాషాయ పార్టీ పెద్దలు పురందేశ్వరికి కీలక పదవి అప్పగిస్తే ఏపీలో పార్టీ మరింతగా బలపడుతుందని భావిస్తున్నారట.

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో పురందేశ్వరి

ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో పురందేశ్వరి పేరు బలంగా విన్పిస్తోంది. ఈసారి కమలనాథులు మహిళలకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారట. ఇందులో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడుకు చెందిన వానతి శ్రీనివాసన్‌తోపాటు పురందేశ్వరి పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. అయితే.. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కేటాయించాలంటే పార్టీలో కనీసం 15 ఏళ్లు పనిచేసి ఉండాలి. అలాగని బీజేపీ పెద్దలు తలుచుకుంటే ఆ రూల్ ఏమీ అడ్డంకి కాబోదన్న మాట విన్పిస్తోంది. ఒక వేళ.. ఆ ఛాన్స్ చేజారితే.. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి రేసులోనూ పురందేశ్వరి పేరు విన్పిస్తోంది. పురందేశ్వరి కోసం పలు ఆప్షన్లు చూస్తున్న కాషాయ పార్టీ పెద్దలు చివరకు ఏ ఛాన్స్ ఇస్తారన్నది అందరిలోనూ ఆసక్తిని..అంతకు మించిన ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

 

    Related News

    Drinking Water Project: ఒక్క ప్రాజెక్ట్‌తో హైదరాబాద్‌కు తాగునీటికి నో ఢోకా.. ఎలా అంటే..!

    AP Liquor Scam: వైసీపీలో గుబులు.. లిక్కర్ స్కాంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

    kavitha Political Future: రాజీనామా తర్వాత కవిత సైలెంట్..! జాతీయ పార్టీలో చేరతారా?

    Tadipatri Politics: జేసీ యాక్షన్ ప్లాన్..! పెద్దారెడ్డికి మళ్లీ షాక్..

    GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

    Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

    ×