ఇజ్రాయెల్ వార్ ఫేర్ టెక్నాలజీ ని అమెరికా రష్యా కూడా అందుకోలేక పోతున్నాయా? ఒకప్పుడు ప్రపంచ యుద్ధ రంగాన్ని శాసించిన ఈ రెండు దేశాలు.. ఇప్పుడు ఇజ్రాయెల్ ముందు సిగ్గుతో తలొంచుకుంటున్నాయా? వార్ ఫీల్డ్ ని ఇజ్రాయెల్ అంత సింపుల్ చేసేస్తోందా? లైట్ వెయిట్ వెపన్స్ తో అట్టుడికిస్తోందా? అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యూచర్లో ఆయుధాల స్వరూపం మారొచ్చంటోన్న రఫెల్ఇజ్రాయెల్ తో ఏది మాములుగా ఉండదు. వాళ్లుగానీ గురి పెట్టారంటే ఎంత పెద్ద శతృ ఆయుధమైనా నేలరాలాల్సిందే. ప్రపంచంలో ఎక్కడైనా సరే తన శతృవు ఏ రూపంలో ఉన్నా సరే గుర్తించి.. దెబ్బ కొట్టగల సామర్ధ్యం ఈ దేశం సొంతం..
ఇజ్రాయెల్ వార్ టెక్నాలజీని అంచనా వేయడం చాలా చాలా కష్టం. పాకిస్థాన్ టెర్రరిస్టు పురిటిగడ్డ ఎలాగైందో.. ఆయుధ సాంకేతిక పరిజ్ఞానంలో అంతటి హెడ్ క్వార్టర్- ఇజ్రాయెల్.
IDF.. అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవన్ చేసే పని.. యుద్ధంలో కొత్త టెక్నాలజీ కనిపెట్టడం ఎలా? సరికొత్త ఆయుధాలను తయారు చేయడం ఎలా? సులభంగా శతృవును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించడం ఎలా? ఈ రీసెర్చ్ లో ఆరితేరిపోయిందీ దేశ సైనిక పరిశోధనా వ్యవస్థ.
వీళ్లు ఎంతగా రాటుదేలిపోయారంటే, ఇక్కడి రఫెల్ వంటి సంస్థలు కూడా అడ్వాన్స్డ్ వెపన్ టెక్నాలజీలో ముందుంటాయ్. ఒకప్పుడు రష్యా ఆయుధం కనిపెడితే అందుకు విరుగుడు అమెరికా కనిపెట్టేది. ఇప్పుడు సీన్ రివర్స్.. ఇజ్రాయెల్ ని చూసి కాపీకొట్టే కండీషన్లో ఉంది.. యూఎస్.
మొన్నటికి మొన్న ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ టెక్నాలజీ కనిపెడితే.. ట్రంప్ సర్కార్ దానికి నఖలుగా గోల్డెన్ డోమ్ టెక్నాలజీ కనిపెట్టింది. అదేమంటే మా దగ్గర ఇది వరకే రీగన్ కనిపెట్టిన స్టార్ వార్స్ టెక్నాలజీ ఉందని కలరింగ్ ఇచ్చుకోవల్సి వచ్చింది.
లేటెస్ట్ గా ఇజ్రాయెల్ లేజర్ టెక్నాలజీతో వార్ ఫీల్డ్ ని శాసించే స్తాయికి వచ్చింది. మీ దగ్గర పెద్ద పెద్ద యుద్ధ విమానాలుండొచ్చు. డ్రోన్లు ఇతర ఎన్నెన్నో ఆయుధాలు కోట్ల విలువైనవి ఉండొచ్చు. కానీ మా దగ్గరున్న చిన్న లేజర్ వెపన్ చాలు.. మిమల్ని నిలువునా కూల్చేస్తాం. కాల్చి బూడిద చేసేస్తామంటోంది ఇజ్రాయెల్.
ఈ సాంకేతికతను ఇజ్రాయెల్ కి చెందిన రఫెల్ సంస్థ అభివృద్ధి చేసింది. ముఖ్యంగా హిజ్బుల్లా నుంచి పెరుగుతోన్న డ్రోన్ల ముప్పును దృష్టిలో ఉంచుకుని.. దానికన్నా వేగమైన ఆయుధాన్ని కనుగొన్నామని ప్రకటించిందీ దేశ రక్షణ రంగ సంస్థ.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించిన దాన్నిబట్టీ చూస్తే.. ప్రస్తుత యుద్ధంలో ఈ దేశం వైమానిక రక్షణ వ్యవస్థతో పాటు లేజర్ సిస్టమ్ సైతం మొహరించింది. అంతే కాదు ఈ లేజర్ ఆయుధాలు అద్భుతంగా పని చేస్తున్నట్టు చెబుతోంది ఐడీఎఫ్.
శతృ ఆయుధాలను సమర్ధవంతంగా ఎదుర్కోవడం మాత్రమేకాదు.. పౌరుల ప్రాణాలు, జాతీయ ఆస్తులను సైతం రక్షించామని అంటోందీ దేశ రక్షణ వ్యవస్థ. డ్రోన్లను లేజర్ వెపన్ తో విజయంతంగా కూల్చిన దృశ్యాలను కూడా విడుదల చేసింది ఐడీఎఫ్.
రఫెల్ సంస్థ చైర్మన్ యువల్ స్టెయింట్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మొట్ట మొదటి సారి మోస్ట్ పవర్ఫుల్ లేజర్ ద్వారా ఇంటర్ సెప్టర్ గా వాడిన దేశంగా ఇజ్రాయెల్ మిగిలిందని సగర్వ ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ మూడు రకాల లేజర్ ఆయుధ వ్యవస్థ అభివృద్ధి చేసినట్టు చెప్పారాయన.
ఐరన్ బీం- ఎం. ఇందులో మొదటిది కాగా.. ఇది భారీ వాహనాలపై అమర్చే అత్యంత శక్తిమంతమైన లేజర్ ఆయుధం. కాగా యాభై కిలోవాట్ల లేజర్ ని ప్రయోగించి ఎనిమీ టార్గెట్ ఇట్టే రీచ్ కాగలదు. మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
లైట్ బీమ్.. ఇది ఐరన్ బీమ్ కి తేలిక పాటి వెర్షన్. చిన్న చిన్న వాహనాలపై కూడా దీన్ని అమర్చుకోవచ్చు. దీని పవర్ టెన్ కిలోవాట్ల రేంజ్ లో మాత్రమే ఉంటుంది. ఇది హై ఎనర్జీ లేజర్ ఆయుధంగా యూఏవీలు, డ్రోన్ల వంటి శతృ లక్ష్యాలపై సమర్ధవంతంగా పని చేస్తుంది. దీని ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. ఒకేసారి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పది టార్గెట్లను కూడా ఇట్టే ధ్వంసం చేస్తుంది.
ఇక మూడోది నేవల్ ఐరన్ డోమ్. యుద్ధ నౌకలపై అమర్చే విధంగా రూపొందించిన దీని పవర్ 100 కిలోవాట్స్. ఈ హై ఎనర్జీ లేజర్ యుద్ధ నౌకలకు ఎదురయ్యే సాచురేటెడ్ అటాక్స్ ను సమర్ధవంతంగా తిప్పి కొట్టగలదు. దీని ద్వారా ఇంటర్ సెప్షన్ కు అయ్యే ఖర్చు కూడా తక్కువగానే ఉంటుందని చెబుతోంది రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ కంపెనీ.
Also Read: కాస్కో పాక్.. ఖతర్నాక్ కుశ వస్తుంది.. S400 కాదు.. అంతకు మించి.. భద్రతలో ఎంత స్ట్రాంగ్ అంటే..
ప్రపంచంలో మొట్ట మొదట సారి.. వైమానిక ముప్పులను ఎదుర్కోడానికి మోస్ట్ పవర్ఫుల్ లేజర్ సిస్టమ్ వాడామని. ఇది వచ్చే రోజుల్లో అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోందని. ఖర్చు తక్కువతో.. ఎక్కువ విధ్వంసం సృష్టించగలదనీ.. చెబుతోందీ రక్షణ రంగ సంస్థ. ఇది వచ్చే రోజుల్లో ఆయుధాల స్వరూప స్వభావాలు పూర్తిగా మార్చేస్తుందని అంటోందీ ఇజ్రాయెలీ రక్షణ రంగ సంస్థ.