Maheshbabu:సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో ‘ఎస్ఎస్ఎంబీ 29’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా మహేష్ బాబు నుండి వచ్చే సినిమాలు ప్రస్తుతం ఏవీ లేకపోవడంతో ఆయన అభిమానులు ‘ఖలేజా’ సినిమాను మే 30వ తేదీన రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా రికార్డులు సృష్టించింది. సినిమా ఓపెనింగ్ రోజే రూ.5కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. ఖలేజా సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)దర్శకత్వం వహించగా.. అనుష్క శెట్టి (Anushka Shetty) హీరోయిన్ గా నటించింది. అప్పట్లో కలెక్షన్ల పరంగా అనుకున్నంత సక్సెస్ సాధించకపోయినా.. ఇప్పుడు రీ రిలీజ్ లో మాత్రం నిర్మాతలకు భారీ కలెక్షన్లు వచ్చి పడుతున్నాయి.
ఐదు సెకండ్లే.. కానీ అందరి దృష్టిని ఆకర్షించిన దిలావర్ సింగ్ భార్య..
ఇక ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ లో ట్రెండ్ సృష్టిస్తున్న వేళ ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించిన వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందులో ఒకరు ఈ సినిమాలో దిలావర్ సింగ్ భార్యగా నటించిన అమ్మాయి మరొకసారి వైరల్ గా మారింది. ఈ సినిమాలో కొన్ని సెకన్ల పాటూ కనిపించినా.. తన అందంతో ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. దీంతో ఈమె పేరు అలాగే ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈమె పేరు దివ్య మేరీ సిరియాక్(Divya Mary Cyriac) . సినిమా అంతా యాక్షన్ ఎ కామెడీ సీన్లతో సాగితే ఈమె సీన్ కొద్దిపాటిదైనా కళ్ళకి బాగా కనబడుతుంది. మహేష్ బాబు చెక్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆమె రొట్టెలు చేసుకుంటూ ఉంటుంది. తన నేచురల్ లుక్ తో అక్కడే హైలెట్ అవుతుంది. అప్పటినుంచి ఆమె నేచురల్ లుక్ కి ఫిదా అయిన ఆడియన్స్ ఈమె గురించి తెలుసుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఈమెకు ఒకటి రెండు సినిమాలలో అవకాశాలు వస్తాయనుకున్నారు కానీ అది జరగలేదు. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ అందర్నీ ఆకట్టుకునే ఈమె ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలిచింది.
ALSO READ; Nayanthara: 100 కోట్లు ఇచ్చినా… ఆ హీరో పక్కన్న చెయ్యను… నయన్ ఓపెన్ స్టేట్మెంట్..!
ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
ఇకపోతే ఈమె బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ఈమె ఒక ముంబై మోడల్. ముంబైలోనే సెటిల్ అయ్యింది. ఫారిన్ లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసే ఈమెకు ఖలేజా సినిమాలో అవకాశం లభించింది. ఇక ఈ సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు ఇకపోతే ఈమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈమెకు ఈ ఏడాది జనవరిలో పెళ్లి అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ఏ సినిమాలో నటించలేదు కానీ ఇలా సోషల్ మీడియాలో ఫోటోలు మాత్రం షేర్ చేస్తూ అభిమానులకు చేరువయ్యింది.