Project Kusha: ఇకపై మనం కూడా ఒక రష్యన్ మేడ్ ఎస్ ఫోర్ హండ్రడ్ తరహాలో ఒక రక్షణ రంగ వ్యవస్థ స్వదేశీ విజ్ఞానంతో చేయనున్నామా? మరి దీని ప్రత్యేకతలేంటి? రష్యా తాయారీకీ దీనికి సంబంధమేంటి? ఆ డీటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వచ్చే ఏడాది- ఏడాదిన్నర లోగా పూర్తి
ఈ వాయు రక్షణ వ్యవస్థ నమూనాను వచ్చే ఏడాది నుంచి ఏడాదిన్నర కాలంలో పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు మన రక్షణరంగ అధికారులు. మన స్వదేశీ ఎస్ 400 నమూనా తయారీ పూర్తయితే.. దీన్ని 12 నుంచి 36 నెలల వరకూ ట్రయిల్స్ వేస్తారు. ఈ టెస్టింగ్ లో పాస్ అయితే.. ఇక దీన్ని కదనరంగంలోకి వదులుతారు.
పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను సమర్ధవంతంగా తిప్పి కొట్టిన S- 400
ఆపరేషన్ సిదూర్ లో పాక్ టర్కిష్ డ్రోన్లు, చైనా మిస్సైళ్లను వదలడంతో.. వీటిని సమర్ధవంతంగా అడ్డుకోడానికి మనం రష్యన్ ఎస్ 400 ని వాడాం.
స్వదేశీ S 400ని డెవలప్ చేస్తోన్న BEL
ప్రాజెక్ట్ కుషాలో భాగంగా ఎస్ 400 రకం స్వదేశీ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్ల వ్యవస్థను రూపొందించే యత్నంలో బీఈఎల్ పురోగతి సాధిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆకాష్టీర్ ద్వారా 40 వేల కోట్ల ఆర్డర్లు
ఆకాష్టీర్ వంటి వాయు రక్షణ వ్యవస్థల నుంచి 40 వేల కోట్ల వరకూ ఆర్డర్లు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక డీఆర్డీవో నేతృత్వంలో బీఈఎల్ అభివృద్ధి భాగస్వామిగా ప్రాజెక్ట్ కుషా తయారవుతోంది. ఇది కూడా తయారైతే మన ఆయుధ వ్యాపారం మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. నియంత్రణ వ్యవస్థలు వివిధ రకాల రాడార్లు వాటి అనుసంధానం కోసం తమ సంస్థ పని చేస్తోందని అంటున్నారు బీఈఎల్ ఎండీ మనోజ్ జైన్. త్రైమాసిక ఆదాయాల ప్రకటన సందర్భంగా ఆయన ఈ మాట చెప్పారు.
మాస్కో పర్యటించనున్న అజిత్ దోవల్
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. మే 27న రష్యా వెళ్తారు. మాస్కోలో 29వ తేదీ వరకూ జరిగే అంతర్జాతీయ ప్రతినిథుల సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రష్యాను మిగిలిన ఎస్ 400 డెలివరీ ఎప్పుడిస్తారో అడుగుతారు.
ఐదోది వచ్చే ఏడాదికల్లా భారత్ కి
2018లో భారత్ ఎస్ 400 కి సంబంధించి ఐదు యూనిట్లను కొనుగోలు చేసింది. దీని విలువ భారత కరెన్సీలో 35 వేల కోట్లు. వీటిలో ఇప్పటి వరకూ మూడు భారత్ చేరుకోగా.. మిగిలిన రెండు ఇంకా రావల్సి ఉంది. వీటి కోసం దోవల్ సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చే అవకాశముంది. నాల్గవ యూనిట్ ఈ ఏడాది చివరినాటికి భారత్ వచ్చేలా తెలుస్తోంది. ఐదవ సెగ్మెంట్ వచ్చే ఏడాదికల్లా వస్తుందని అంచనా.
రూ. 30 వేల కోట్ల విలువైన QRSAM
ప్రాజెక్ట్ కుషాతో పాటు బీఈఎల్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ని కూడా తయారు చేయడంలో బిజీగా ఉంది. ఇందుకోసం మరో ప్రత్యేక బృందం పని చేస్తోంది. దీని విలువ సుమారు 30 వేల కోట్లు. QRSAM అంటూ షార్ట్ ఫామ్ లో పిలిచే దీని కోసం ఇప్పటికే ఆర్డర్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నిర్వాహకులు.
OP సిందూర్ లో ఎస్ 400 తో పాటు
భారత రక్షణ రంగ వ్యవస్థ.. రష్యాతో కలసి జాయింట్ వెంచర్ చేస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ లో ఎస్- ఫోర్ హండ్రడ్స్ తో పాటు.. ఇండోరష్యన్ జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ క్షిపణులు సైతం బ్రహ్మాండంగా పని చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే తరహాలో.. రష్యన్ తయారీ ఎస్ ఫోర్ హండ్రెడ్ మోడల్లో.. మన వాళ్లు ఆపరేషన్ కుషా తయారు చేస్తున్నారు. దీనికి క్విక్ వర్షెన్ కూడా డెవలప్ చేస్తున్నారు.
ఇండో- రష్యన్ బ్రహ్మోస్ సైతం బ్రహ్మాండం
ఇటీవలి యుద్ధంలో భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ల సాయంతో.. 300 కి పైగా పాకిస్థానీ డ్రోన్లను కుప్పకూల్చింది. అంతే కాదు, పాకిస్థానీ డ్రోన్లు, క్షిపణులను నిలువరించడానికి భారతవైమానిక దళ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్, రష్యన్ ఎస్ ఫోర్ హండ్రెడ్స్ తో కలసి స్వదేశీ ఆకాశ్ సమర్ క్షిపణులు, బరాక్- 8, అధునాతన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ సైతం మొహరించింది భారత సైన్యం.
అల్మాజ్- ఆంటే నిర్మించిన ఎస్ ఫోర్ హండ్రెడ్లు
రష్యాకు చెందిన అల్మాజ్- ఆంటే నిర్మించిన ఎస్ ఫోర్ హండ్రెడ్లు.. డ్రోన్లు, మిస్సైళ్లతో పాటు అనేక వైమానిక టార్గెట్లను ఏక కాలంలో ఫిక్స్ చేసి వాటిని బ్లాస్ట్ చేయగలదు. ఇది నాలుగు వందల కిలోమీటర్ల వరకూ సుదూర లక్ష్యాలను ఛేజ్ చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. సరిగ్గా అలాంటి శక్తి సామర్ధ్యాలతో ప్రాజెక్ట్ కుషాను తయారు చేస్తోంది భారత్. దీంతో భారత్ ప్రపంచ ఆయుధ మార్కెట్ లోకి మరింత ఘనంగా ఎంట్రీ ఇవ్వగలదు.
భారత్ ఎందుకీ రంగాన్ని స్ట్రాంగ్ చేస్తోంది?
ప్రపంచంలోనే భారత్‌ది గొప్ప మిలటరీ వ్యవస్థ. మన మిలటరీ, మన ఆయుధాలు ఇప్పుడున్నంత స్ట్రాంగా గతంలో ఉండేవి కాదు. దానికి కారణమేంటి? ఇప్పుడిప్పుడే భారత్ ఎందుకీ రంగాన్ని స్ట్రాంగ్ చేస్తోంది? దీని వెనక గల పరిణామ క్రమాలు ఎలాంటివి?
కాశ్మీర్ గొడవే లేకుంటే భారత్ పరిస్థితి మరోలా ఉండేది
దేశ వ్యాప్తంగా కుషాలతో భారత భద్రత మరింత కట్టుదిట్టంభారత్ బేసిగ్గా ఒకరి జోలికి వెళ్లి యుద్ధం చేసే అలవాటు లేదు. ఆ మాటకొస్తే అమెరికా కూడా అంతే. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఎటు చూసినా శాంతి జపం చేస్తుండేవారు అమెరికన్లు. యుద్ధం వద్దు- శాంతి ముద్దు అంటూండేవారు. ఎప్పుడైతే పెర్ల్ హార్బర్ పై జపాన్ విమానాలు బాంబులు వేసి వెళ్లాయో.. ఆనాటి నుంచి అమెరికా ఆయుధ తయారీ చేయడం మొదలు పెట్టింది. మొదట్లో అమెరికా వస్తు తయారీ మాత్రమే చేసేది. వాటిని ఆపి, ఆయుధ తయారీ మొదలు పెట్టింది.
ఎప్పుడైతే జపాన్ అమెరికా అహాన్ని దెబ్బ తీసిందో..
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పై రివేంజ్ తీర్చుకోడానికి గానూ.. ఓపెన్ హైమర్ అనే అణు శాస్త్రవేత్తకు అణుబాంబు తయారీ చేయమని నిధులు కేటాయించి.. ఆ దిశగా కదనరంగంలోకి కాలు మోపింది యూఎస్. అప్పటి వరకూ బ్రిటన్ అమెరికాను ఎంత బతిమలాడుకున్నా.. యుద్ధంలోకి అడుగు పెట్టింది కాదు అమెరికా. ఎప్పుడైతే జపాన్ అమెరికా అహాన్ని దెబ్బ తీసిందో.. ఆనాటి నుంచి ఈ దేశం.. తనదైన శైలిలో ఆయుధాల మీద గురి పెట్టింది. ఏకంగా అణు బాంబులు తయారు చేసింది. హిరోషిమా, నాగసాకీల మీద అణుబాంబులు వేసి రివేంజ్ తీసుకుంది. అక్కడి నుంచి అమెరికా ఆయుధ తయారీలో పెద్దన్న అయి కూర్చుంది.
యుద్ధాలు, ఆయుధాలతో పనే ఉండేది కాదు..
భారత్ కూడా ఇంచు మించు ఇలాంటి చరిత్రే. మనకంటూ పాకిస్థాన్ తో కశ్మీర్ గొడవే లేకుంటే ఈ యుద్ధాలు ఆయుధాలతో పనే ఉండేది కాదు. మన ఉద్దేశం కూడా అదే. మనది శాంతి యుత దేశం. మితవాద దేశం. మనకి విపరీతమైన రాజ్యకాంక్ష ఉండేది కాదు. ఇదే కాశ్మీర్ ని రాజా హరిసింగ్ భారత్ లో కలపడానికి ఆయనంతట ఆయన స్వయానా ముందుకొచ్చారు కాబట్టే ఒప్పుకుంది భారత్. ఇదే చేటు తెచ్చింది.
1948లో మొదటి కాశ్మీర్ యుద్ధం నుంచి..
కాశ్మీర్ మీద విపరీతమైన కాంక్ష పెట్టుకున్న పాకిస్థాన్ భంగ పడి.. ఆనాటినుంచి మనతో ఏదో ఒక రకంగా కాలుదువ్వుతూనే ఉంది. 1948లో జరిగినదాన్ని మొదటి కాశ్మీర్ యుద్ధమని అంటారు. ఒక్క 1971 తప్ప మనకు పాకిస్థాన్ తో జరిగిన అన్ని యుద్ధాలూ కాశ్మీర్ కేంద్రంగా జరిగినవే. అయితే ఇక్కడ మనవాళ్లు మిలిటరీ, దాని నిర్వహణను ఎంతో పటిష్ట పరిచారు కానీ ఆయుధ తయారీ మాత్రం ఎప్పుడూ రష్యన్ ఆయుధాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు.
మన దగ్గరున్న ఆయుధాల్లో 70% రష్యన్ మేడ్
మొన్నటి యుద్ధంలో సరిహద్దు రక్షణ వ్యవస్తగా పని చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ల వరకూ మనం రష్యా మీదే ఆధారపడేవాళ్లం. ఇప్పటకీ మన దగ్గరున్న ఆయుధాల్లో 70 శాతం వరకూ రష్యన్ మేడ్ మాత్రమే ఉంటాయ్. వాళ్లు కూడా మనకు అలాగే కోపరేట్ చేసేవారు. ఇప్పటికీ ప్రపంచమంతా ఎదురు తిరిగినా భారత్ అంటే టక్కున ముందుకొచ్చే దేశం రష్యా. ఆ తర్వాత ఇజ్రాయెల్.
ఎస్ ఫోర్ హండ్రెడ్ తరహాలో ప్రాజెక్ట్ కుషాలాగా
భారత రక్షణ రంగం తర్వాతి కాలంలో ఒక వ్యవహార శైలిని నేర్చుకుంటూ వచ్చింది. అదే రష్యన్ టెక్నాలజీ సాయంతో వారి తరహాలో కొన్ని ఆయుధాలను తయారు చేసుకోవడం. ఇప్పుడు ఎస్- ఫోర్ హండ్రెడ్ మోడల్లో ప్రాజెక్ట్ కుషా ఎలాగో గతంలో బ్రహ్మోస్ కూడా అలాగే. ఆ తర్వాత స్కై స్ర్టైకర్ల వంటి మరికొన్ని ఆయుధాల తయారీలో ఇజ్రాయెలీ సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ.. మన ఆయుధ వ్యవస్థను అంతకంతకూ పెంచి పెద్దది చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మన ఆయుధ శాల.. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఎన్నో ఆయుధ శ్రేణులను సొంతంగా తయారు చేసుకుంటోంది.
బ్రహ్మోస్, ఆకాశ్, నాగాస్త్ర, డీ- 4, స్కై స్ట్రైకర్ ఇలా..
ఇందులో రెండు విషయాలు దాగి ఉన్నాయి. మొదటిది.. మనమే తయారు చేసుకుంటే చౌక ధరలకే పని పూర్తవుతుంది. ఇక రెండో విషయం.. ఈ ఆయుధాలను మనం కూడా రష్యా- అమెరికా- చైనాలా అమ్ముకోవచ్చు. ఈ దిశగా మనం బ్రహ్మోస్, ఆకాశ్, నాగాస్త్ర, డీ- 4, స్కై స్ట్రైకర్ ఇలా.. రరకాల ఆయుధాల తయారీతో దూసుకెళ్తున్నాం. వీటితో పాటు అగ్ని, పృధ్వి వంటి మిస్సైళ్ల సంగతి సరే సరి. తాజాగా ప్రాజెక్ట్ కుశా.
ఆయుధాల తయారీలో దూసుకెళ్తోన్న భారత్
మనం మన ఆయుధ శ్రేణిని పెంచి పెద్ద చేసుకుంటూ పోవడం వల్ల.. భారత్ కూడా ఒక ఆయుధ తయారీ దేశంగా మారుతుంది. తద్వారా ఆయుధ మార్కెట్ ని మరింతగా ఇంప్రూవ్ చేయగలం. ఇప్పటికే మనం ఆకాష్, బ్రహ్మోస్ ఆర్డర్లను వేల కోట్ల రూపాయల మేర అందుకుంటూ అందుకంటూ తగిన లాభాలను పొందుతున్నాం. దీంతో ఇటు స్వామికార్యం- అటు స్వకార్యం పూర్తి చేసుకోగలుగుతున్నాం.
ఇదే కోవలో తయారవుతోన్న ప్రాజెక్ట్ కుష
వచ్చే రోజుల్లో ప్రాజెక్ట్ కుషాను డీఆర్డీఎల్ అధ్వర్యంలో బీఈఎల్ సాయంతో రెడీ అయితే.. తర్వాత జరిగే పర్యావసానాలు వేరే లెవల్లో ఉండబోతున్నాయ్. కారణమేంటంటే.. మొన్నటి యుద్ధంలో పాకిస్థాన్ ప్రయోగించిన టర్కిష్ డ్రోన్లు, చైనీస్ పీఎల్ ఫిఫ్టీన్లను సమర్ధవంతంగా ఎదుర్కుంది.. భారత్. అందుకు ప్రధాన సహకారం అందించింది.. ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్స్. ఇప్పటి వరకూ మన దగ్గర మూడు సిస్టమ్స్ ఉండగా.. వచ్చే రోజుల్లో మరో రెండు రానున్నాయి. ఈ మాత్రం తో సరిపెట్టకుండా మరికొన్ని యూనిట్లను విరివిగా తయారు చేసుకోగలిగితే.. అవసరమైన చోట వీటిని మొహరించవచ్చు.
దేశ వ్యాప్తంగా కుషాలతో భారత భద్రత మరింత కట్టుదిట్టం
ఇటు పాకిస్థాన్ కాశ్మీర్ తో ఎలాంటి కయ్యానికి కాలు దువ్వుతోందో అటు బంగ్లా దేశ్ కూడా ఈశాన్యా రాష్ట్రాలను ఆశించి చైనాతో కలసి అలాగే వ్యవహరిస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా మనం కుషాలను సరిహద్దుల వెంబడి మొహరించుకుంటే ఇక భారత భద్రత మరింత కట్టుదిట్టం అవుతుందని అంటున్నారు మన నిపుణులు.