BigTV English

Rajouri Village Mysterious: విందు భోజనాలు.. వింత మరణాలు.. కశ్మీర్ కొండల్లో మిస్టరీ డెత్స్

Rajouri Village Mysterious: విందు భోజనాలు.. వింత మరణాలు.. కశ్మీర్ కొండల్లో మిస్టరీ డెత్స్

Rajouri Village Mysterious: ప్రకృతి అందాలకు నెలవైన జమ్మూకశ్మీర్‌లో మిస్టరీ మరణాలు.. రాజౌరీ జిల్లాలో మృత్యుఘోష.. నెలన్నర అవుతున్నా వీడని మిస్టరీ..! అంతు చిక్కని మరణాలు చూసి బిత్తరబోతున్న శాత్రవేత్తలు, బిక్కు బిక్కుమంటున్న అక్కడి జనం..! కశ్మీర్‌లో అసలేం జరుగుతోంది? ఈ మరణాలు ఎందుకు జరుగుతున్నాయో డాక్టర్లు, శాత్రవేత్తలు ఎందుకు తేల్చలేకపోతున్నారు? మరైతే.. ఈ వరుస మరణాలకు కారణమేంటి? జమ్ముకశ్మీర్‌ను అంతుచిక్కని వ్యాధి ఏదైనా పట్టిపీడిస్తోందా..? ఇంతకీ.. అమాయక ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకునేది ఎవరు? ఈ రహస్యం వీడేదేలా?


అసలు, కశ్మీర్ అంటే దాల్ సరస్సు సోయగం.. కశ్మీర్ అంటే హిమాలయ పర్వతాల అందం.. నిండా మంచు దుప్పటిని కప్పుకొని ఉండే హిమాలయాల సొగసు ఎంత చూసినా తీరని ప్రకృతి రమణీయత.. అలాంటి కశ్మీర్ కొండల్లో మిస్టరీ మరణాలు, అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడి రాజౌరీ జిల్లా బుధాల్‌ గ్రామంలో నెలన్నర వ్యవధిల్లో 15 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయారు. మరో బాలుడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అయితే, వీరందరిలో కనిపించే కామన్ లక్షణాలు ఏంటంటే.. అధిక జ్వరం, వాంతులు, తీవ్రంగా చమటలు పట్టడం, స్పృహకోల్పోవడం. మృతి చెందినవారిలో కూడా ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. మరి వీరంతా ఎందుకు మరణిస్తున్నారు? వారిని ఇంతగా పీడిస్తున్న వ్యాధి ఏంటి? అని అక్కడి ప్రభుత్వం 11 సభ్యలతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

కోవిడ్, ప్రపంచాన్ని గడగడలాండించిన తర్వాత ఎన్నో రకాల వ్యాధులు పట్టిపీడుస్తున్నాయి. తాజాగా చైనాలో హెచ్ఎంపీవీ పై కూడా జోరుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్‌లో వింత మరణాలు దేశాన్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. అయితే, ఓవైపు ఇది మంచు విపరీతంగా కురిసే కాలం. కాబట్టి, రాజౌరీలో వరుస మరణాలకు ఏమైనా వైరస్ దాడి కారణమా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్న నేపథ్యంలో బ్యాక్టీరియా కానీ, సాంక్రమిక వ్యాధులు కానీ సోకాయా? అని కూడా అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు అంతా అనుకున్నారు. కానీ, ఇవేవీ కారణం కాదని తేలింది.


ఆ విషయంపై ఓ క్లారిటీ కోసం.. బాధితుల నుంచి రక్త నమూనాలను సేకరించి దేశవ్యాప్తంగా ఉన్న అత్యున్నత ల్యాబ్‌లకు పంపించింది జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం. పుణెలోని NIV, ఢిల్లీలోని NCDC, లక్నోలోని NITR, గ్వాలియర్‌ లోని DRDE ల్యాబ్‌లకు పంపి టెస్టులు చేయించింది. ఈ మరణాలకు వైరస్‌ కానీ బ్యాక్టీరియా కానీ కారణం కాదని ల్యాబ్‌లు వెల్లడించాయి. అయితే, IITR మాత్రం ఆ నమూనాల్లో విషపూరిత పదార్థాలు ఉన్నాయని చెబుతోంది. అంటే, ఇక్కడా చనిపోయే వారు ఎవరు కూడా.. ఏ వ్యాధి వల్లా.. చనిపొవట్లేదని స్పష్టంగా తెలుస్తోంది. మరైతే.. వీరంతా కేవలం విష పూరిత పదార్థాల వల్లనే చనిపోతున్నారనుకోవాలా? కాసేపు అలాగే అనుకుందాం..! అలా అయితే, వారి శరీరాల్లోకి ఆ విష పదార్థాలు ఎలా వెళ్లాయి?

ఇక్కడ ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే.. మరణించినవారంతా కూడా కేవలం మూడు కురుమలకు చెందినవారే ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన సంగతేంటంటే.. వీరందరికి,ఒకరితో మరొకరికి బంధుత్వాలు కూడా ఉన్నాయి. అయితే, ఒక రోజు బుధాల్‌ గ్రామంలో 2024 డిసెంబర్‌ 7న బంతి భోజనం పెట్టారు. ఇక్కడ భోజనం చేసిన తర్వాత ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఒకేసారి అస్వస్థతకు గురయ్యారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

Also Read: కోల్ కతా డాక్టర్ కేసులో సంచలన తీర్పు.. మరణించే వరకు నిందితుడు జైలులోనే..!

ఇక, 2024 డిసెంబర్‌ 12న బంతి భోజనంలో విందు ఆరగించిన మరో కుటుంబంలోని తొమ్మిది మంది అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో ముగ్గురు చనిపోయారు. 2025 జనవరి12న కూడా బంతి భోజనం చేసిన ఓ కుటుంబంలోని పది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఓ బాలిక చనిపోయింది. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. నెలన్నర వ్యవధిలోనే మొత్తం 15 మంది చనిపోయారు. దీంతో గ్రామస్తులంతా.. అక్కడ ఏం జరుగుతుంతో అర్ధం కాకా.. భయంతో వణికిపోతున్నారు. అసలు ఈ విందులకు మరణాలకు లింకేంటి? IITR చెప్పినట్లు ఆ విష పదార్థాలు.. విందు భోజనంలోనే కలిసాయా? లేక, ఎవరైనా కావాలనే కలిపారా?

అయితే, ఇక్కడ బాగా గమనిస్తే.. విందు భోజనం చేసిన వారే అధిక జ్వరం, వాంతులు, స్పృహకోల్పోవడం లాంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్నారు. వీరు మాత్రమే అలా మరణిస్తున్నారు. మిగతా వారిలో ఎక్కడ కూడా ఈ అనుమానాస్పద లక్షణాలు కనిపించట్లేవు. ఇంకో విషయం ఏమిటంటే.. చనిపోయినవారి బ్లడ్ నమూనాలలో న్యూరోటాక్సిన్ ను గుర్తించినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ న్యూరోటాక్సిన్ అనేది ఎంత ప్రమాదకరమైన విషపదార్థం అంటే.. అది ఒక్కసారి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే.. అది మనిషి మెదడు, నాడీ వ్యవస్థను పూర్తిగా నాశనము చేస్తుంది. ఇంకా కండరాల బలహీనతకు కారణమవుతుంది, శరీరం వణుకుతుంది, మెదడులోని హిప్పోకాంపస్ పనితీరు దెబ్బతింటుంది ఫలితంగా జ్ఞాపకశక్తి కోల్పోతారు.

వాస్తవానికి ఈ న్యూరోటాక్సిన్స్ అనేవి పర్యావరణ కాలుష్య కారకాలు, ఇంకా కొన్ని రకాల మందులలో ఇవి కనిపిస్తాయి. అయితే, ఇవి శరీరంపై ముడతలు తగ్గించడానికి వైద్య సౌందర్య చికిత్సల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. మరైతే.. విందు భోజనంలో ఈ న్యూరోటాక్సిన్స్ అనే పదార్థం ఎలా కలిసింది? ఆ ఫ్యామిలీలను చంపాలని చూసేది ఎవరు? కేవలం ఆ కుటుంబాలనే ఎందుకు చంపాలనుకుంటున్నారు? నెలన్నర గడిచిపోతున్నా.. ఈ విషయాన్నీ అక్కడి ప్రభుత్వం ఎందుకు నానుస్తోంది? కప్పి పుచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తోందా? అని కొందరు వాదిస్తుంటే.. ఈ విషయాన్నీ కప్పి పుచ్చే అవసరం ప్రభుత్వానికి ఏం ఉందని మరికొందరి వాదన. అంతుచిక్కని ఈ మరణాలకు కారణం ఏంటి? అన్న కోణంలో ఇంకా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×