BigTV English

Kolkata rape murder case: కోల్ కతా డాక్టర్ కేసులో సంచలన తీర్పు.. మరణించే వరకు నిందితుడు జైలులోనే..!

Kolkata rape murder case: కోల్ కతా డాక్టర్ కేసులో సంచలన తీర్పు.. మరణించే వరకు నిందితుడు జైలులోనే..!

Kolkata rape murder case: దేశవ్యాప్తంగా ఆ కేసు ఓ సంచలనం. సదరు నిందితుడికి కఠినశిక్ష విధించాల్సిందేనంటూ నిరసనల పర్వం కూడా సాగింది. జూనియర్ డాక్టర్ ను రేప్ చేసి హత్యకు పాల్పడ్డ నిందితులకు సరైన శిక్ష విధించాల్సిందేనని పలు ప్రజాసంఘాలు కూడా రోడ్డెక్కాయి. ఈ తరుణంలో కోల్ కతా న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. సోమవారం వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.


కోల్ కతా లోని ఆర్జికర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కళాశాలలో ఓ జూనియర్ వైద్యురాలిపై గత ఏడాది ఆగస్టు 9వ తేదీన హత్యాచార ఘటన జరిగింది. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా, పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు వేగవంతంగా సాగించారు. అదే వైద్యశాలలో వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ముమ్మర దర్యాప్తు అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

Also Read: Kerala News: నన్నెందుకు కన్నావు? తనకు జన్మనిచ్చిందని.. తల్లిని కడతేర్చిన కొడుకు!


కేసు విచారణ సాగుతున్న సమయంలోనే ఎట్టి పరిస్థితుల్లో నిందితుడికి కఠిన శిక్ష విధించాలంటూ ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ భద్రతకు సంబంధించి నిరసనలు తెలపడంతోపాటు, ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. ఈ తరుణంలో చివరకు కేసుకు సంబంధించి న్యాయస్థానం తీర్పునిచ్చే సమయం రానే వచ్చింది. సోమవారం న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనను విన్న అనంతరం నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే 50,000 జరిమానాను సైతం న్యాయస్థానం విధించింది. అంతేకాకుండా మరణించే వరకు జైల్లోనే ఉండాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై నిందితుడికి సరైన శిక్ష విధించారంటూ ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×