BigTV English

Japan Baba Vanga Predicts: మళ్లీ కరోనా.. ఆ నెలలోనే భూమి అంతం! వణుకు పుట్టిస్తున్న బాబా వంగా జోస్యం

Japan Baba Vanga Predicts: మళ్లీ కరోనా.. ఆ నెలలోనే భూమి అంతం! వణుకు పుట్టిస్తున్న బాబా వంగా జోస్యం

Japan Baba Vanga Predicts: రాజకీయాలు, యుద్ధాల మధ్య ప్రపంచం నలిగిపోతుంటే.. కొత్తగా మరో షాకింగ్ విషయం ప్రచారం అవుతోంది. రాబోయేది భయంకరమైన కాలమని ఓ పాపులర్ జోస్యం చెబుతోంది. ఇది అలాంటి ఇలాంటి జోస్యం కాదు. ప్రపంచానికి జోస్యం పవరేంటో చెప్పిన బాబా వంగా లాంటి జపాన్ బాబా వంగ ఊహించిన విషయం. ప్రపంచాన్ని రెండు మూడేళ్లు వణికించిన మహమ్మారి కరోనా మళ్లీ వస్తుందని షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు ఈ జపాన్ బాబా వంగా! నిజానికి, 2025 సంవత్సరం యుగాంతానికి ఎంట్రీ పాయింట్ అవుతుందని బాబా వంగా చెప్పాగా.. ఇప్పుడు జపాన్‌కు చెందిన భవిష్యత్ దర్శిని, ర్యో టసుకి కూడా ఇలాంటి జోస్యమే చెప్పారు. మరి, ఇవన్నీ ఒట్టి మాటలేనని కొట్టి పారేయగలమా..? ప్రపంచానికి మరోసారి కరోనా కష్టాలు తప్పదా..?


జపాన్‌ బాబా వంగగా ప్రఖ్యాతి చెందిన ర్యో టసుకీ

రాబోయేదంతా వినాశనమేనా..? మనుషులంతా నశించి పోతారా..? భూమి మనుగడ ఇక కష్టమైనా..? ఇప్పటి వరకూ ఊహిస్తున్న డూమ్స్ డేకు రోజులు దగ్గర పడ్డాయా..? ఈ సంవత్సరమే మనుషుల అంతానికి ఎండింగ్ పాయింటా..? ప్రపంచమంతా నమ్ముతున్న ఓ జోస్యం చెబుతున్న మాటలివి. రాబోయే విలయం గురించి ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణి బాబా వంగా షాకింగ్ జోస్యం చెప్పగా.. ఇప్పుడు.. జపాన్‌ బాబా వంగగా ప్రఖ్యాతి చెందిన ర్యో టసుకీ జోస్యం కూడా ఇలాంటి భయంకరమైన విషయాన్నే వెల్లడించినట్లు తెలుస్తోంది.


2025 ఘోర కలిని చూపిస్తుందనే కంగారు

నిజానికి, బాబా వంగా చెప్పిన మాటలు తేలికగా కొట్టి పారేయలేం. ఎందుకంటే, 50 ఏళ్ల క్రితమే భవిష్యత్తును ఊహించిన బాబా వంగ చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే నిజమై కనిపించాయి. అలాగే, ర్యో టసుకీ ఊహించిన అంశాలను కూడా చాలా మంది నమ్ముతారు. అందుకే, రాబోయే కరోనా దాడి గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. 2025 ఘోర కలిని చూపిస్తుందనే కంగారు పుడుతోంది.

జపనీస్ మాంగా కళాకారిణిగా పేరున్న ర్యో టసుకీ

కాస్త వింతగా ఉన్నా.. ర్యో టసుకీ అంచనాలకు చాలా ఖ్యాతి ఉందనడంలో సందేహం లేదు. జపనీస్ మాంగా కళాకారిణిగా పేరున్న ర్యో టసుకీ.. అందుకే, మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కరోనా వైరస్ త్వరలో తిరిగి రావచ్చని ఆమె హెచ్చరికలను లైట్‌గా తీసుకోని పరిస్థితి ఉంది. ర్యో టసుకీ.. 1999లో రాసిన తన కామిక్ పుస్తకంలో.. 2020లో వచ్చిన కరోనా వ్యాప్తిని ముందే ఊహించినట్లు ఉంది. కాగా… ఇది జరిగిన దాదాపు ఒక దశాబ్దం తర్వాత అంటే.. ఇంచుమించుగా.. 2030లో కోవిడ్ వైరస్ మరోసారి ఆవిర్భావం చెందుతుందని ఆమె వెల్లడించినట్లు తెతుస్లోంది. “ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్” అనే తన కామిక్‌లో.. జపాన్ బాబా వంగా రాసింది గమనిస్తే.. “2020 చుట్టూ తెలియని వైరస్ కనిపిస్తుంది.

“ది ఫ్యూచర్ యాజ్ ఐ సీ ఇట్” అనే కామిక్‌లో వెల్లడి

తర్వాత, ఏప్రిల్‌లో అది దాని గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.” అని రాశారు. అయితే, ఆ ఏప్రిల్‌కు సంబంధించిన ఖచ్చితమైన సంవత్సరాన్ని ఆమె పేర్కొనకపోయినా.. ప్రారంభంలో చెప్పిన 2020 అంచనా కళ్లముందే కనిపించింది. 2019 చివరిలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ అర్థం అయ్యింది. అలాగే, 2021లో దాని మరో విజృంభణ ఎంత ప్రాణాంతక పరిస్థితిని పరిచయం చేసిందో తెలిసింది. అందుకే, జపాన్ బాబా వంగ మాటల్లో.. ఏప్రిల్ నెల, దశాబ్దం తర్వాత అనే పదాలపై ఇప్పుడు భయం నెలకొంది.

2030లో వైరస్ తిరిగి రావచ్చన్న రియల్ బాబా వంగా

నిజానికి, 2030లో వైరస్ తిరిగి రావచ్చని రియల్ బాబా వంగా చెప్పారు. ఆమె రచనల ప్రకారం, “వైరస్ ఒకటి అదృశ్యమవుతుంది కానీ దాదాపు 10 సంవత్సరాల తర్వాత తిరిగి కనిపిస్తుంది” అని సూచించారు. ఇప్పుడు, వీళ్లద్దరి కాలక్రమం నిజమైతే.. అది 2030 సంవత్సరం నాటికి తిరిగి రావచ్చనే అంచనా ఉంది. అయితే, రెండు దశాబ్దాల క్రితం మొదటిసారిగా ప్రచురించబడిన ర్యో టసుకీ కామిక్ పుస్తకంపై.. ఇప్పుడు, ప్రజారోగ్య నిపుణులు చర్చిస్తున్నారు. ఎందుకంటే.. ప్రపంచ నిపుణులు కూడా దాదాపుగా ఇదే అంశాన్ని వెల్లడించిన సందర్భాలు లేకపోలేదు. కరోనా పునరాగమనం గురించి శాస్త్రవేత్తలు స్పష్టంగా ఎలాంటి ధృవీకరణ చేయనప్పటికీ.. చాలామంది “డిసీజ్ X” వల్ల కలిగే ప్రమాదాల గురించి హెచ్చరికలు చేశారు.

H5N1 బర్డ్ ఫ్లూ, మీజిల్స్, mpox, ఎబోలాపై ఆందోళన

ఇది తెలియని వ్యాధికారకాల నుండి ఉత్పన్నమయ్యే ఊహాజనిత తదుపరి మహమ్మారి అని సూచించారు. ఇక, ఇప్పటికే.. H5N1 బర్డ్ ఫ్లూ, మీజిల్స్, mpox, ఎబోలా వంటి కొత్త ముప్పులపై పెరుగుతున్న ప్రపంచ ఆందోళనల మధ్య.. మరో మహమ్మారి వస్తే దాన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలూ రెడీగా ఉండాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ నేపధ్యంలో.. జపాన్ బాబా వంగా ప్రిడిక్షన్ ఆసక్తిని రేపుతోంది.

15 సంవత్సరాల ప్రవచన చక్రం ప్రకారం..

ర్యో టసుకీ అంచనాల ప్రకారం.. 15 సంవత్సరాల ప్రవచన చక్రం ఉంది. అంటే 2030లో మహమ్మారి తిరిగి రాకపోతే… అది 2045 లో కూడా కార్యరూపం దాల్చవచ్చు. అయితే, దీన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. ఆమె, జూలై 2025లో సునామీతో సహా ఇతర భయంకరమైన పరిణామాలు చూడాల్సి వస్తుందని అంచనా వేసింది. అయితే, గతంలో ఆమె దర్శనాల ఖచ్చితత్వాన్ని నమ్మిన చాలా మంది దీన్ని నమ్ముతున్నారు. ఈ జపానీస్ బాబా వంగా.. గతంలో ప్రిన్సెస్ డయానా మృతి, పాపులర్ సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యురీ మరణాలతో సహా అనేక అంచనాలు నిజమయ్యాయి. అయితే, ఇవన్నీ ఆమె తన కలలలో దర్శనాల ద్వారా చెప్పగలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ కలలను ఆమె వ్రాతపూర్వకంగా కానీ, లేదంటే చిత్రాలు రూపంలో గాని వెల్లడిస్తుంది.

ఈ జోస్యంలో నిజానిజాలు ఎంత..?

ఇటీవల, మూడో ప్రపంచ యుద్ధం గురించి అంతర్జాతీయంగా ఆందోళనలు వచ్చిన సందర్భంలో.. 2025లో యూరప్ యుద్ధం వస్తుందని బాబా వంగా జోస్యం చెప్పారు. ఇది నిజమైతే పరిస్థితి ఏంటా అనే ఆందోళనను పెంచింది. ఇప్పుడు, జపాన్ బాబా వంగా చెప్పిన మాట కూడా ఇలాంటి చర్చనే లేవదీసింది. ఈ జోస్యంలో నిజానిజాలు ఎంతనే దాని కంటే.. ఆమె రాసిన మంగా పుస్తకంలో వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయా లేదా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

1995 కోబ్ భూకంపం, 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం..

70 సంవత్సరాల వయసున్న ర్యో టసుకీ చాలా కాలం తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఆమె కలలుగా చెప్పుకుంటున్న అంశాలు ఇప్పుడు కలవరానికి కారణం అవుతున్నాయి. 1995 కోబ్ భూకంపం నుండీ 2011 గ్రేట్ ఈస్ట్ జపాన్ భూకంపం, సునామీ వంటి ప్రధాన సంఘటనలను అంచనా వేసిన తర్వాత మాంగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. “మార్చి 2011 గ్రేట్ డిజాస్టర్ కమ్స్” అనే హృదయ విదారకమైన అధ్యాయం.. ఆ సంవత్సరం మార్చి 11న సంభవించింది. ఆ నిజమైన విపత్తుకు సంబంధించిన స్థాయిని చూసిన తర్వాత జపాన్ బాబా వంగా శక్తి చాలా మందిని ఆకర్షించింది. ‘ది ఫ్యూచర్ దట్ ఐ సా’ అని ఆమె రాసిన భవిష్యత్ దర్శినిలో.. టసుకీ భారీ సునామీతో కూడిన ఒక పీడకల వివరాలను అందించారు.

భూకంపపరంగా అస్థిరమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో జపాన్

ఇందులో.. జపాన్ ఇప్పటివరకు ఎదుర్కొన్న దానికంటే చాలా పెద్దది. ఉత్తర మరియానా దీవులు, ఇండోనేషియా, తైవాన్, జపాన్‌లను కలిపే వజ్రాల ఆకారపు జోన్‌లో వస్తుందనీ… అప్పుడు, “అత్యంత భారీ బుడగలు” పైకి లేచి “జపాన్‌కు దక్షిణాన సముద్రం ఉడికిపోతుందని” ఆమె వెల్లడించారు. “2011లో వచ్చిన సునామీ కంటే ఇది మూడు రెట్లు పెద్దది” అని ఆమె మాంగా పుస్తకంలో రాసారు. కాగా, దీనిని కొంతమంది అభిమానులు “ప్రవచనాత్మక కామిక్ స్ట్రిప్” అని పిలుస్తున్నారు. అయితే, భూకంపపరంగా అస్థిరమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో జపాన్ స్థానాన్ని బట్టి.. కొందరు ఆమె మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నారు.

నిర్దిష్టంగా స్పష్టమైన తేదీలు ఏవీ లేవు

ఇక, ర్యో టసుకీ.. 2025 జులైలో ప్రపంచంలో భయంకర విధ్వంసం, ప్రళయం జరుగుతుందని జోస్యం చెప్పారు. ఆమె రచనల్లో కరోనా వైరస్ రెండవ వేవ్ లేదంటే, ఇలాంటి విధ్వంసం గురించి నిర్దిష్టంగా స్పష్టమైన తేదీలు ఏవీ లేవు. ఆమె రాసిన మంగా పుస్తకంలో ప్రధానంగా సహజ విపత్తులు, రాజకీయ సంఘటనలు, సామాజిక మార్పుల గురించి ఉంటుంది. కానీ, కరోనా లాంటి మహమ్మారి గురించి స్పష్టమైన సూచనలు లేవని కొందరు నమ్ముతున్నారు.

భవిష్యత్ సంఘటనలను చిత్రించిన పుస్తకం

ఇక, ప్రస్తుతం, కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుందని శాస్త్రీయ ఆధారాలు గానీ, వైద్య నిపుణుల నుండి ఎటువంటి హెచ్చరికలు లేవు కాబట్టి… పెద్దగా ఆందోళన అవసరం లేదనే సూచనలు కూడా ఉన్నాయి. 1999 “మాంగా – ది ఫ్యూచర్ ఐ సా” పుస్తకం.. 1980ల నుండి 1990ల వరకు చూసిన కలల ఆధారంగా భవిష్యత్ సంఘటనలను చిత్రించిందనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే, ఆమె జోస్యాలు స్పష్టమైన తేదీలు లేదా స్థలాలను సూచించలేదు.

అతిశయోక్తులపై ఆధారపడి ఉందంటున్న నిపుణులు

రో టసుకీ ప్రసిద్ధ జోస్యాలు చూస్తే.. 2011లో జపాన్ భూకంపం. కొందరి రాజకీయ నాయకుల మరణాలు, అంతర్జాతీయ సంక్షోభాలు ఉన్నాయి. ఇక, 2025 జులైలో రాబోయే ప్రళయం ప్రపంచంలో భయంకరమైన విధ్వంసంగా కొందరు భావిస్తున్నారు. అయితే, ఈ జోస్యం ఆమె మాంగాలో స్పష్టంగా లేదు. ఇది ఊహాగానాలు, అతిశయోక్తులపై ఆధారపడి ఉందనేది నిపుణుల అభిప్రాయం. ఇక కరోనా గురించి కూడా అంతే.. ర్యో టసుకీ మాంగాలో కరోనా వైరస్ లాంటి మహమ్మారి గురించి స్పష్టంగా చెప్పలేదు. అందులో… “ప్రపంచవ్యాప్త అనారోగ్యం” లేదా “సామాజిక అల్లకల్లోలం” అని ఉంది. దీన్ని కొందరు కరోనాతో జోడిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొందరు కరోనా రెండవ వేవ్ 2025లో వస్తుందని ప్రచారం చేస్తున్నారు.

ఎక్కడా అందుబాటులో లేని ర్యో టసుకీ ఫోటోలు

ఇక, బాబా వంగలా ఫోటోలు దొరికినట్లు ర్యో టసుకీ ఫోటోలు ఎక్కడా అందుబాటులో లేకపోవడం విశేషం. బాబా వంగా 50 ఏళ్ళ క్రితమే జ్యోతిష్యం చెబితే.. ర్యో టసుకీ రాసిన మంగా పుస్తకం 20 ఏళ్ల క్రితానిదే… ఇక, ఈమెకు 70 ఏళ్లనే ప్రచారం ఉంది. అయినప్పటికీ, ఆమె గీసిన చిత్రాలు తప్ప ఆమె చిత్రం అందుబాటులో లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఎంత వెతికినా మాంగా కవర్‌లు, ఇలస్ట్రేషన్‌లు ఆన్‌లైన్‌లో లభిస్తాయి. ఇక, బాబా వంగ బతికున్న కాలంలో మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. జపాన్ బాబా వంగాకు మాత్రం అలాంటి సందర్భాలు లేవు. అయినప్పటికీ.. జపనీస్ బాబా వంగా రో టసుకీ రాసిన సాధారణ కామిక్ పుస్తకం.. అంచనాల కంటే తీవ్రమైనది అనే చర్చ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

ర్యో టసుకీ రాసిన మంగా పుస్తకం 20 ఏళ్ల క్రితానిదే!

టసుకీ రచనలను అనుచరించే వారు సోషల్ మీడియా వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, ఈ జోస్యం ఆన్‌లైన్‌లో డూమ్స్‌డే ప్రిపరేషన్ నుండి డెడ్‌పాన్ హాస్యం వరకు పలు రకాల కామెంట్లకు కారణం అయ్యింది. కొందరు, “ఆమె డైరీ నిజమైన డెత్ నోట్” అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ.. భూమిపై పెరుగుతున్న భూతాపం, పర్యావరణ మార్పులు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్ర్యా.. నిపుణులు కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. అయితే, ఈ అంశాల్లో మంగా లాంటి పుస్తకాలనో.. బాబా వంగా లాంటి జోస్యాలను నమ్మడం కంటే సైన్స్, భూకంప శాస్త్రం చెప్పింది వినడమే కరెక్ట్ అంటున్నారు.

 

Related News

Bigg Boss 9 Promo: పాపం మరీ అంత బోర్ కొట్టేసిందా? కాస్త వారితో కూడా మింగిల్ అవ్వమ్మా?

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో స్టోరీ… ఇమ్మానుయేల్ నడుము గిల్లిన తనూజ!

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Big Stories

×