BigTV English

Jayaprada Gets NTR Award : అగ్రనటి జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారం..

Jayaprada Gets NTR Award : అగ్రనటి జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారం..

Jayaprada Gets NTR Award : సీనియర్ అగ్రనటి జయప్రదకు ఎన్టీఆర్ చలన చిత్ర శతాబ్ది పురస్కారం అందుకోనున్నారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాల్లో భాగంగా జయప్రదకు ఈ అవార్డు ప్రకటించారు. ఈ నెల 27న ఆదివారం నాజర్ పేట ఎన్వీ ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవ సభ జరుగనుంది. ప్రముఖ డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్ ఈ సభకు అధ్యక్షత వహించనున్నారు. రాజకీయ నేత, మేధావి జయప్రకాశ్ నారాయణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి ఆత్మీయ అతిథిగా వ్యవహరించనున్నారు.


మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్యర్యంలో సంవత్సర కాలం పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగం అనేక సేవాకార్యక్రమాలు, అవార్డుల ప్రదానం, థియేటర్లలో ఎన్టీఆర్ చిత్రాల ప్రదర్శన లాంటి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా తెనాలు పెమ్మసాని థియేటర్‌లో ఏడాది పొడవునా ఎన్టీఆర్ చనల చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి. ఈ నెల 28/11/2022న సోమవారం అడవిరాముడు సినిమాను ప్రదర్శించనున్నారు. నటి జయప్రద, నందమూరి రామకృష్ణ, ఏ.కోదండరామిరెడ్డి, ఎన్టీఆర్ అభిమానులు, ప్రేక్షకులు కలిసి ఈ చిత్రాన్ని థియేటర్లో చూడనున్నారు.


Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×