Nellore Redsanders Smugglers : నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం అన్నంపల్లి అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురు తమిళ కూలీలను అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. తమిళనాడుకు చెందిన కుప్పన్ అనే వ్యక్తి ఎర్రందనం చెట్లను నరికే ఆరుగురు కూలీలను వెంటబెట్టుకొని ఈనెల 21న అన్నంపల్లి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించారన్నారు. ఎర్రచందనం చెట్లను నరికి వాటిని దుంగలుగా చేసి తమిళనాడుకు గురువారం సాయంత్రం రవాణా చేసేందుకు సిద్ధమయ్యారని, ఎస్పీ విజయరావు ఇచ్చిన సమాచారంతో సిబ్బందిని అప్రమత్తం చేయగా అన్నంపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిఘా ఉంచారని చెప్పారు.