E-Paper
Advertisement

కేసీఆర్ బాటలోనే కవిత.. తమిళనాడు విజయ్ సీక్రెట్ జ్యోతిష్యుడితో సంచలన భేటీ!

కేసీఆర్ బాటలోనే కవిత.. తమిళనాడు విజయ్ సీక్రెట్ జ్యోతిష్యుడితో సంచలన భేటీ!
Advertisement

Kavitha Astrology:  కేసీఆర్ మాదిరిగానే క‌విత‌కూ జ్యోతిష్యాల‌పై అపార‌మైన న‌మ్మ‌కం. జాత‌కాల‌ను కూడా అనుసరిస్తార‌ని అంటారు. తండ్రిలాగే ఆమె ముహూర్తాలు, రాహుకాల‌ల‌ను బాగా ప‌ట్టించుకుంటారు. ఏదైనా కార్యం చేసే ముందు వీటిని అనుస‌రించే ముందుకు సాగుతారు. ఇప్పుడు కొత్త పార్టీతో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దుకునేందుకు ఆమె అడుగులు వేస్తున్నారు. ప్ర‌ధాన పార్టీల‌తో పోటీ ప‌డి .. త‌ను అధికారంలోకి వ‌స్తాన‌నే ధీమా వ్య‌క్తం చేయ‌డం.. ఈ క్ర‌మంలోనే ఆమె ప్ర‌ముఖ జ్య‌తిష్యుడితో భేటీ కావ‌డం.. త‌న రాజ‌కీయం గురించేన‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది.

విజ‌య్ సీఎం కావ‌డానికి ఈయ‌నే కార‌ణ‌మా?

Advertisement

త‌మిళ‌నాడులో విజ‌య్ సీఎం కావ‌డానికి ప్ర‌ధానంగా ఈ జ్యోతిష్యుడి సూచ‌న‌ల మేర‌కు న‌డుచుకోవ‌డ‌మేన‌నే ప్ర‌చారం ఉంది. విజ‌య్ రాధ‌న్‌ను ఏకంగా త‌న ప్ర‌భుత్వంలో ఓఎస్డీగా కూడా నియ‌మించ‌డం… ప్ర‌తిప‌క్షాలు దీనిపై దుమ్మెత్తిపోయ‌డంతో వెన‌క్కి త‌గ్గారు. అయితే ఆయ‌న సీఎం కాకముందు నుంచే పార్టీలో అధికార ప్ర‌తినిధిగా విజ‌య్‌కు స‌న్నిహితంగా ఉంటూ పార్టీ కార్య‌క్ర‌మాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు రాధ‌న్‌.

విజ‌య్ త‌ర‌హాలోనే సీఎం అయ్యేందుకు..

Advertisement

గ‌తంలో పలుమార్లు క‌విత‌.. విజ‌య్‌లా త‌నూ సీఎం అవుతాన‌ని చెబుతూ వ‌స్తున్నారు. కొత్త‌గా పార్టీ పెట్టిన విజ‌య్ తొలి ఎటెంప్ట్‌లోనే సీఎం అయిన విధానాన్ని ఉద‌హ‌రిస్తు .. అక్క‌డి ఫ‌లితాల‌ను త‌నకు ఆపాదించుకున్నారు క‌విత‌. ఇప్పుడు ఏకంగా విజ‌య్ వ్య‌క్తిగ‌త జ్యోతిష్యుడినే ఇంటికి ర‌ప్పించుకుని మ‌రీ చర్చించ‌డం వెనుక‌.. సేమ్ విజ‌య్ మాదిరిగానే ఆ జ్యోతిష్యుడి స‌ల‌హాలు ఫాలో అయ్యేందుకేన‌నే విష‌యం స్ప‌ష్టమ‌వుతోంది. ఇందులో దాప‌రిక‌మేమీ లేకుండా.. ఆమె ఫోటోను కూడా విడుద‌ల చేయ‌డం వెనుక‌.. రాజ‌కీయాల్లో ఇది చ‌ర్చ‌కు రావాల‌ని కోరుకుంటున్న‌ట్టుగా కూడా భావించ‌వ‌చ్చు..

Tags

Related News

కాంగ్రెస్‌ పెంచిన పింఛన్లపై విమర్శలు! పాతవి తొలగించి కొత్తవి ఇచ్చారని ప్రచారం..! కేసీఆర్‌ వస్తే 4వేలు ఇచ్చేవారని కామెంట్స్‌..!

పెనం మీద నుంచి పొయ్యిలోకి నిజామాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌! నేతల తీరుతో అధిష్టానానికి తలవంపులు..! మాజీ మంత్రి కామెంట్స్‌తో తీవ్ర చర్చ

జెన్‌జీని తక్కువ అంచనా వేశా! జంతర్‌ మంతర్‌ తరువాత వారి శక్తిని కళ్లారా చూసినా..! నేతలెవరూ వారితో పెట్టుకోవద్దని తెలుసుకున్నా!

నా పాలనకు వందకు 60 మార్కులు.. రెండేళ్లలో మరిన్ని మార్కులు సాధిస్తానని నమ్మకం ఉంది..! సంక్షేమ పథకాలపై చర్చోపచర్చలు!

మాటకు మాట.. సీఎం సభ తరువాత ఆ ఇద్దరూ స్పందిస్తున్న వైనం..! కలిసి తిప్పికొట్టే వ్యూహంతో ముందుకు..!

బీఆరెస్‌కు గతమే.. భవిష్యత్‌ లేదు..! కేసీఆర్‌కు ప్రాణం పోస్తే బానిసత్వాన్ని కొని తెచ్చుకున్నట్టే..! రేవంత్‌ వాదనలతో కొత్త చర్చ..!

బీజేపీ బిగ్ ఆపరేషన్.. ఆ మూడు కార్పొరేషన్లపై బీజేపీ గురి..?

ఓటుకు పదివేలిచ్చినా తీసుకోండి..! ఈసారి పొరపాటు చేయకుండా మనకే ఓటేయండి! కేసీఆర్‌ను ఓడగొట్టి తప్పు చేశారు..!

Big Stories

Advertisement
×