Yograj Singh On Abhishek Sharma: టీమిండియా టి20 స్పెషలిస్ట్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో (Indian Premier League tournament
) అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ, టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా టి20 స్పెషలిస్ట్ ఆటగాడిగా కూడా మారిపోయాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ కు వచ్చాడంటే… సిక్సర్లు, బౌండరీలు అన్నట్లుగానే వ్యవహారం ఉంటుంది. ఒక్క సింగిల్ కూడా అభిషేక్ శర్మ తీయడు. 200కు పైగా స్ట్రైక్ రేట్ కొనసాగిస్తూ ఇరగదీస్తూ ఉంటాడు. అలాంటి అభిషేక్ శర్మపై యోగరాజ్ సింగ్ ఫైర్ అయ్యారు. పార్టీలు, అమ్మాలకు అభిషేక్ శర్మ బానిస అయ్యాడన్నారు యోగ్‌రాజ్ సింగ్.
టీమ్ ఇండియా టి20 జట్టులో అదరగొడుతున్న అభిషేక్ శర్మ గురించి తాజాగా యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో అభిషేక్ శర్మ అర్ధరాత్రి పార్టీలకు వెళ్లడం.. ప్రియురాలితో షికారులు చేయడం లాంటివి చేశాడని ఆరోపణలు చేశారు. క్రికెట్ కంటే అమ్మాయిలపైన అతడు ఫోకస్ చేశాడని.. ఇష్టం వచ్చినట్లు తిరిగాడని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా అభిషేక్ శర్మ మాత్రం, గాలి తిరుగుళ్ళు మాడలేదని యోగి రాజా సింగ్ గుర్తు చేశారు. ఇక చేసేదేమీ లేక అభిషేక్ శర్మ తండ్రి వచ్చి యువరాజ్ సింగ్ కు ఫిర్యాదు చేశాడని షాకింగ్ నిజాలను యోగ్ రాజ్ సింగ్ బయటపెట్టారు.
వెధవ వేషాలు వేస్తే, యువరాజు సెట్ చేశాడు- యోగ్‌రాజ్ సింగ్
ఇక అక్కడి నుంచి అభిషేక్ శర్మ కెరీర్ పూర్తిగా మారిపోయింది అన్నారు యోగ్ రాజ్ సింగ్. అమ్మాయిలతో తిరగడం, నైట్ పార్టీలు మొత్తం మానేయాలని అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఫోన్లను కూడా లాగేసుకొని, నరకం చూపించామని తెలిపారు. ఏమైనా వెధవ వేషాలు వేస్తే, యువరాజు సింగ్ తన చేతికి పని చెప్పేవాడని గుర్తు చేశారు.
అలా యువరాజ్ సింగ్ చాలా కఠినంగా వ్యవహరించిన నేపథ్యం లో అభిషేక్ శర్మ ఇప్పుడు స్టార్ క్రికెటర్ అయ్యాడని వ్యాఖ్యానించారు. అభిషేక్ శర్మ విజయం వెనుక యువరాజ్ సింగ్ కచ్చితంగా ఉన్నాడని తెలిపారు. తన కుమారుడు యువరాజు సింగ్ ఆధ్వర్యంలో ఏ క్రికెటర్ ట్రైనింగ్ తీసుకున్న సరే.. అద్భుతంగా ఆడతారని వివరించారు. దానికి ఉదాహరణ అభిషేక్ శర్మ అని వ్యాఖ్యానించారు. అభిషేక్ శర్మకు అన్నం పెట్టింది యువరాజ్ సింగ్ అని పేర్కొన్నారు. అలాంటి యువరాజ్ సింగ్ ను.. సరిగ్గా వాడుకోవాలని కోరారు యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh).